భవన నిర్మాణ కార్మికులకు రావలసిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలి : కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు
![]()
అసంఘాటీత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు నూతనంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తంబు విధానని రద్దుచేసి పాత పద్ధతినే గుర్తింపు కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘo రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని తాపీ సంఘం భవన ప్రారంభోత్సవానికి రత్నాకర్ రావు మరియు ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై శిలా పలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చాలామంది కార్మికులకు రేషన్ కార్డులు లేనందున నూతన లేబర్ కార్డులు రావడం లేదని కావున ప్రభుత్వ వెంటనే నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని, 60 ఏళ్ళు వయస్సు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ మరియు ఇతర బెనిఫిట్ బకాయిలను వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికుల అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరణం పొందితే రూ.5 లక్షలు, పెండ్లి కానుక ఒక లక్షకు పెంచాలని, పిల్లల చదువుకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు దాసరి లక్ష్మయ్య, పోచంపల్లి మండల అధ్యక్షులు చేరాల లింగయ్య, ఉపాధ్యక్షులు దేవిగారి బాలయ్య, ప్రధాన కార్యదర్శి కొత్త నరేష్, సహాయ కార్యదర్శి రామచర్ల సందయ్య, కోశాధికారి పోతగళ్ల బాలరాజు మరియు మాజీ మండల అధ్యక్షులు పొన్నమోని ఎట్టయ్య, చేరాల పెద్ద నర్సింహా, పెద్దల యాదయ్య, ఇబ్రహీంపట్నం అంజయ్య, చెరుకు నరసింహ, సలహాదారులు చీరాల చిన్న నరసింహ, కొండమడుగు బాలయ్య, గోరికంటి బాలయ్య, జక్కి రమేష్, గుర్రు దానయ్య, నాయకులు కొండమడుగు మైసయ్య, పొన్నమోని శ్రీశైలం, చేరాల రాజయ్య, చేరాల యాదయ్య, తదితర 100 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
![]()
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామ శివారులో గల ఎండి కాజా పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర వాహనాల తనిఖీ లో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు వలిగొండ మండలంలో వివిధ గ్రామాల నుండి పేద ప్రజల దగ్గర తక్కువ రేటుకు పిడిఎస్ బియ్యాన్ని తీసుకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని పి.బితండా గ్రామానికి చెందిన గగులోతు కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని టాటా ఏసీ వాహనంలో తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాహనంలో 17 బ్యాగుల ఉన్నాయని ఒక్కొక్క బ్యాగులో 60 కిలోల బియ్యం ఉన్నాయని అన్నారు. వీటి బరువు దాదాపు 10 క్వింటాల్ వరకు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టంణంలోని మల్లికార్జున ఆగ్రో రైస్ మిల్లును *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* సందర్శంచారు ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో, రైస్ మిల్లు యజమానుల తో మాట్లాడారు.. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువను పరిశీలించారు.గత వానాకాలం,యాసంగి ధాన్యం నిలువ ఉండటం వళ్లే ఈ కాలం ధాన్యం ఆన లోడింగ్ కు ఇబ్బందులు అవుతున్నయని పరిశీలినలో తెలుసుకున్నారు.అనంతరం ఆలేరు పట్టంణంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు.రైతులతో,హామలి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు..ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.గతం కంటే ప్రస్తుతం విద్యుత్ ఎక్కువగా అందిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి తెలిపారు. ఈ సందర్భంగా *బీర్ల ఐలయ్య* గారు మాట్లాడుతూ.గత వానాకాలం,యాసంగి,ధాన్యం 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాములో నిల్వలు ఉండటం వల్ల ఈ కాలం ధాన్యం నిలువ కు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.గతంలో జూన్ 30వరకు కొనుగోళ్లు జరిగేవని,కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం లో అధికారుల చొరవ తో మరో 10రోజుల్లో టార్గెట్ పూర్తి చేస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులు ఎవ్వరు ఆధర్యపడవద్దని,ధైర్యంగా ఉండాలని,ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారాలు చేసి రోడ్డు ఎక్కుతున్నారని అన్నారు,వరి వేస్తే ఉరి అన్న వారు నిరసన చేయడానికి అనర్హులు అన్నారు.రైతుల రుణమాఫీ కోసం,500రూపాయల బోనస్ ఇవ్వటం కోసం రైతులకు పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. గెలుపే లక్ష్యంగా చేసుకొని అందరం పని చేద్దామని కోరారు .కాంగ్రెస్ - బిఆర్ఎస్ పార్టీలు యువతకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయానికి అందరూ కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వరంగల్ నలగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


May 19 2024, 20:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k