కాసేపట్లో కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ

ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ ఆదివారం(మార్చ్‌ 3) భేటీ అవనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది..

ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు..

మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది..

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి.

ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్‌ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింక్‌ల ద్వారా నేరుగా ఫలితాను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఫలితాలు త్వరలోనే ప్రకటించ నున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది..

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.

గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది.

ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది.

ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు..

జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా? మాజీ మంత్రి కేటీఆర్

లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అన్నారు.

ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో పోటీ చేద్దాం.. సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దామని కెటిఆర్ సూచించారు. మీ సిట్టింగ్ సిట్‌ మల్కాజ్ గిరిలో పోటీ చేసి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.

గతంలోనూ రేవంత్ సవాల్ చేసి పారిపోయారని కెటిఆర్ ఆరోపించారు. కొడంగల్, జిహెచ్ఎంపి ఎన్నికల్లో సవాల్ చేసి రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు.

సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువేముంది అని కెటిఆర్ ప్రశ్నించారు. కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే సవాల్ చేశారు. కేటీఆర్ మగాడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు..ఏం జరుగుతుందో చూడాలి మరి.....

ఏపీ లో 18 నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు

ఎపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చి 18వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి..

మార్చి 30 తేది వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30నుంచి 12.30 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.. ఎస్ ఎస్ సి బోర్డు నేడు ప‌రీక్ష‌ల టైం టేబుల్ విడుద‌ల చేసింది.

ప‌దో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 18 – ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 – సెకండ్ లాంగ్వేజ్

మార్చి 21 – థర్డ్ లాంగ్వేజ్

మార్చి 23 – గణితం

మార్చి 26 – ఫిజిక్స్

మార్చి 28 – బయాలజీ

మార్చి 30 – సోషల్ స్టడీస్

Hyderabad: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ

హైదరాబాద్‌: రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్‌కు సయ్యద్‌ అబ్బాస్‌ డ్రగ్స్‌ సరఫరా చేసేవాడు. వివేకానంద్‌ కొకైన్‌ కావాలని కోరినపుడు మీర్జా వాహిద్‌ నుంచి అతడు తీసుకొచ్చేవాడు.

ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధాలపై మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ పార్టీకి సినీ దర్శకుడు క్రిష్‌ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. సోమవారం వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది..

మరోవైపు కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్‌ లిషిత పరారీలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. దీంతో లిషిత సోదరి కుషిత పీఎస్‌కు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చారు.

ఆమె ఇంట్లో లేదని.. వచ్చాక విచారణకు పంపిస్తామని తెలిపారు. డ్రగ్స్‌ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు లిషిత కచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు..

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

•పోస్టుల వివరాలు

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది,రేవంత్ సర్కార్ 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయను న్నారు.

ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది

గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టుల ను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

కాగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు.

అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది...

UP CM Illegal Mining Case: నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది..

సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 2012-16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్‌ స్పందించారు..

''ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్‌ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్‌. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?'' అంటూ బీజేపీపై అఖిలేశ్‌ నిప్పులు చెరిగారు..

ఏమిటీ కేసులు?

హమీర్‌పూర్‌ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012-17లో అఖిలేశ్‌ సీఎంగా ఉంటూనే 2012-13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ-టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్‌పూర్‌ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్‌ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్‌ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది..

మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు

మేడారం హుండీ లెక్కింపు ఈరోజు నుంచి కొనసాగిస్తు న్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాత‌రకు సంబంధించి భ‌క్తులు మొక్కులు చెల్లించుకొని కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు. హుండీ లెక్కింపుల్లో న‌కిలీ క‌రెన్సీ నోట్లు రావడం క‌ల‌క‌లం రేపింది. విచి త్ర‌మేమిటంటే న‌కిలీ క‌రెన్సీ పై అంబేద్క‌ర్ చిత్రం ఉండ‌డం గ‌మ‌నార్హం.

మేడారం జాతర హుండీల్లో నకిలీ వంద రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీ లలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల కనిపించాయి.

నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనక అంబే ద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్ చేయడం గమనార్హం . ఇంకా ఎన్ని హుండీలలో ఇలాంటి కరెన్సీ ఉందో వేచి చూడాలి.

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది.

బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు.

ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమ తించలేదు.

ఇందులో మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివకుమార్.. గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో చనిపోతు న్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.