మార్చి 4 నుంచి తెలంగాణలో ప్రధాని ఎన్నికల శంఖారావం

రాష్ట్రంలో బిజెపి అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపి సీట్లు లక్షంగా ముందుస్తు ప్రచారానికి నడుం బిగించారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ కంటే ముందుగా ప్రచారం చేపట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆపార్టీ నేతలు వ్యుహాలు రచిస్తు న్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోడీ హాజరై ఎన్నికల ప్రచారం ప్రారంభించ నున్నారు.
మార్చి 4, 5 తేదీల్లో బహిరంగసభలతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ సీనియర్లు వెల్లడించారు. వచ్చే నెల 4న హైదరా బాద్‌లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న సభ రద్దు అయినట్లు చెప్పారు.

ప్రధాని మోడీ షెడ్యూల్……
4వ తేదీన అదిలాబాద్, 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటన
4వ తేదీ ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.
ఉదయం 11.15 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదిలాబా ద్‌లో బహిరంగ సభ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస..
5వ తేదీన సంగారెడ్డిలో…..
ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ
ఉదయం 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు బహిరంగ సభ తరువాత ఒడిషాకు వెళ్లనున్న మోడీ
Feb 29 2024, 16:55
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
16.9k