మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

•పోస్టుల వివరాలు

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది,రేవంత్ సర్కార్ 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయను న్నారు.

ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది

గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టుల ను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

కాగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు.

అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది...

UP CM Illegal Mining Case: నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది..

సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 2012-16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్‌ స్పందించారు..

''ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్‌ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్‌. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?'' అంటూ బీజేపీపై అఖిలేశ్‌ నిప్పులు చెరిగారు..

ఏమిటీ కేసులు?

హమీర్‌పూర్‌ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012-17లో అఖిలేశ్‌ సీఎంగా ఉంటూనే 2012-13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ-టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్‌పూర్‌ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్‌ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్‌ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది..

మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు

మేడారం హుండీ లెక్కింపు ఈరోజు నుంచి కొనసాగిస్తు న్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాత‌రకు సంబంధించి భ‌క్తులు మొక్కులు చెల్లించుకొని కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు. హుండీ లెక్కింపుల్లో న‌కిలీ క‌రెన్సీ నోట్లు రావడం క‌ల‌క‌లం రేపింది. విచి త్ర‌మేమిటంటే న‌కిలీ క‌రెన్సీ పై అంబేద్క‌ర్ చిత్రం ఉండ‌డం గ‌మ‌నార్హం.

మేడారం జాతర హుండీల్లో నకిలీ వంద రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీ లలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల కనిపించాయి.

నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనక అంబే ద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్ చేయడం గమనార్హం . ఇంకా ఎన్ని హుండీలలో ఇలాంటి కరెన్సీ ఉందో వేచి చూడాలి.

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది.

బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు.

ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమ తించలేదు.

ఇందులో మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివకుమార్.. గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో చనిపోతు న్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నాం

మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మేడిగడ్డపై సీఎం రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, వ్యవసాయ రంగ ప్రాజెక్టుల్లో..అవినీతి జరిగిందని విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంతో 90 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని తెలిపారు.

మేడిగడ్డపై కాలయాపన చేయకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తు న్నారని మండిపడ్డారు

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..

కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రజలకు వివరిస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.

కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.

మార్చి 4 నుంచి తెలంగాణలో ప్రధాని ఎన్నికల శంఖారావం

రాష్ట్రంలో బిజెపి అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపి సీట్లు లక్షంగా ముందుస్తు ప్రచారానికి నడుం బిగించారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ కంటే ముందుగా ప్రచారం చేపట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆపార్టీ నేతలు వ్యుహాలు రచిస్తు న్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోడీ హాజరై ఎన్నికల ప్రచారం ప్రారంభించ నున్నారు.

మార్చి 4, 5 తేదీల్లో బహిరంగసభలతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ సీనియర్లు వెల్లడించారు. వచ్చే నెల 4న హైదరా బాద్‌లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న సభ రద్దు అయినట్లు చెప్పారు.

ప్రధాని మోడీ షెడ్యూల్……

4వ తేదీన అదిలాబాద్, 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటన

4వ తేదీ ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.

ఉదయం 11.15 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదిలాబా ద్‌లో బహిరంగ సభ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస..

5వ తేదీన సంగారెడ్డిలో…..

ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ

ఉదయం 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు బహిరంగ సభ తరువాత ఒడిషాకు వెళ్లనున్న మోడీ

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.

రైల్లో మంటలు చెలరేగ డంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు.అదే సమ యంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళా ఝారియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసు కుంది. అసాన్సోల్‌-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబు లెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది

11062 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్?

•పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేకుండానే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం.. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది.

అయితే.. 2023 సెప్టెం బర్‌లో 5089 ఉపాధాయ పోస్టులకు.. కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసిన రేవంత్ సర్కార్... పాత నోటిఫి కేషన్‌లో ఇచ్చిన 5089 పోస్టులకు అదనంగా మరో 5973 పోస్టులను కలిపి మొత్తంగా 11,062 పోస్టులతో రేపు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ పోస్టుల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,600 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 700 పండిట్‌ పోస్టులు ఉండగా.. PET పోస్టులు 190 ఉన్నట్టు సమాచారం.

అయితే.. గత ప్రభుత్వం ఇచ్చిన 5089 పోస్టులకు గానూ.. రాష్ట్రవ్యాప్తంగా.. 1.77లక్షల మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకొన్నారు. కాగా.. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల వుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? అవసరం లేదా..? అన్న కన్ప్యూజన్ అభ్యర్థుల్లో నెలకొంది.

అయితే.. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారు లు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే.. తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్‌‌లో డీఎస్సీ నోటిఫి కేషన్ వేయగా.. అదే నెల 20 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అదే సమయంలో.. నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

మార్చి 1 న చలో మేడిగడ్డ

మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి కోరుతూ డీజీపీ ర‌వి గుప్తాకు మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేతృ త్వంలోని బృందం విన‌తి ప‌త్రం అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మేడిగ‌డ్డ‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను కూడా డీజీపీకి అంద‌జేశారు. బీఆర్ఎస్ విన‌తిప‌త్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించారు.

చ‌లో మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు త‌గిన బందోబ‌స్తు క‌ల్పిస్తామ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు డీజీపీ ర‌వి గుప్తా తెలిపారు...