తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ గా ఉంటుంది: గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ భాష,అంటేనే క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పు డు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.

తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాల న్నారు. రవీంద్ర భారతిలో నేడు జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు.

అనంత‌రం ఆమె మాట్లాడుతూ… తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని చెప్పారు.

‘స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ. సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ భాష. మాట్లాడుతు న్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది.

ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి.

తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూని వర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తమిళిసై అన్నారు.

మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి.

తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతృభాష తమిళ్. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ’ అని గవర్నర్ అన్నారు..

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు..

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి..

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు..

తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

తెలంగాణలో మరింత బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోలీ చేయించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే రాష్ట్రంలో సర్కార్ ఎప్పటి చేసిన కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్య ధిక ఎంపీ స్థానాలను గెలు చుకోవాలన్న పట్టు దలతో ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై అచితూచి అడుగులు వస్తోంది.

ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి పార్టీ అధినేతలను రంగంలో దింపాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

నేడు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ - 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు..

చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతో సచివాలయంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం జరిగే సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మంగళవారం నుంచి మరో రెండు హామీలను అమలు చేసేందుకు నడుంబిగించింది. ఇందుకోసం ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరవుతారు..

ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుందని ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఆ పత్రికలో పేర్కొంది..

మరో రెండు హామీలకు సీఎం రేవంత్ రెడ్డి నేడు స్వీకారం

అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీ రింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ నున్నారు.

ఇక, గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ లభించనుంది. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం 500రూపాయలకే ఇవ్వనున్నారు.

అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసింది. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది ఆరోగ్యశ్రీ లబ్దిని 5 లక్షల నుంచి 10లక్షల రూపాయ లకు పెంచింది.

రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చినా, ఆ పథకం ఇంకా పూర్తిగా అమలు కాలేదు.దీంతో ఇవాళ అమలు చేసే 2 పథకాలతో మొత్తం 4 పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లైతుంది.

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు..

రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో 'మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం' పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు..

ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు..

Rajnath Singh: ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..

మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ (BJP core committee) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఏలూరు బయలుదేరి వెళతారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళతారు..

Narendra Modi: నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు..

ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా విడుదల చేస్తారు. 21,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.

ఈ నేపథ్యంలో మొదట కేరళ(Kerala)లోని తిరువనంతపురం(thiruvananthapuram)లోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని ఈరోజు ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన మూడు కీలకమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రధాని ప్రారంభించనున్నారు. దేశ అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు సాంకేతిక, పరిశోధన, అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ఆ తర్వాత తమిళనాడు(tamilnadu)లోని మధురైలో MSME పారిశ్రామికవేత్తల కోసం ఫ్యూచర్ ఆటోమోటివ్ డిజిటల్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. నెక్ట్స్ మహారాష్ట్ర(maharashtra)లోని 5.5 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (SHG) రూ. 825 కోట్లు అందించనున్న ప్రధాని రివాల్వింగ్ ఫండ్ పంపిణీ చేస్తారు. దీంతోపాటు మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. OBC కేటగిరీ లబ్ధిదారుల కోసం మోదీ ఆవాస్ యోజనను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ఇక్కడ 1300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు..

Rajya Sabha elections: నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది..

సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరగనుండగా..మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాల కంటే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు..

ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఓటింగ్(voting) జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 3 మంది ఉన్నారు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు..

నేడు హన్మకొండకి తరలిస్తున్న మేడారం హుండీలు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జారత దిగ్విజయంగా ముగిసింది.

దీంతో అధికా రులు నేడు మేడారం నుంచి హుండీ లను హన్మకొండకి తరలిం చనున్నారు.

హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 29 నుంచి హుండీ లను లెక్కించనున్నారు.

మేడారం జారతలో మొత్తం 512 హుండీలను అధికా రులు ఏర్పాట్లు చేశారు. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది.