మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత కీలక భేటీ

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులు పంపించింది.

ఈ మేర‌కు ఇవాళ ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, ఆమెను నిందితు రాలిగా మారుస్తూ సీబీఐ తాజగా నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కవిత తాను హాజ‌రుకాలేన‌ని సీబీఐకి లేఖ రాశారు. ఇదిలా ఉండ‌గా సీబీఐ నోటీసుల నేపథ్యంతో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత… కేసీఆర్ తో ఈ అంశంపై చర్చిస్తున్నారు.

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసు లను ఉపసంహరించు కోవాలని లేఖలో కవిత కోరారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు విరుద్ధంగా ఈ నోటీసులు ఉన్నాయని ఆమె చెప్పారు.

సీబీఐకి ఏవైనా సమాధా నాలు కావాలంటే… తాను వర్చువల్ పద్ధతితో విచా రణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణం లో… తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని చెప్పారు.

ఈ కారణంగా తాను ఢిల్లీకి విచారణకు రాలేనని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, తనకు జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించాలని కోరారు...

పవన్ కల్యాణ్‌ను సీఎం చేస్తా:కే ఏ,పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధ్యక్షుడు పవ న్‌కల్యాణ్‌ టీడీపీ నుంచి బయటకు రావాలని సూచించారు.

పవన్ బీసీలు... కాపులపైన అభిమానం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరారన్నారు.

72 సీట్లిచ్చి జనసేనను గెలిపించుకుని పవన్ ను సీఎం చేస్తానన్నారు. కాపులు.. జనసేన, టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నా రన్న పాల్.. దేశంలో ప్రధాని మోడీ మతతత్వం పెంచుతున్నారని విమర్శించారు.

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది.

మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించు కుని.. మొక్కులు సమర్పిం చుకున్నారని తెలిపారు.

బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకు న్నారన్నారు.మేడారం జన జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసిన ఆర్టీసీ కుటుంబానికి అభినంద నలు తెలిపారు.

అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపా యాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసు కున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు.

ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరి చారన్నారు.లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్ట మైన పనిని సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారన్నారు.

ప్రయాణ సమయంలో భక్తులు ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించా రని.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరి స్తున్నామని, ప్రోత్సహిస్తు న్నామని మరోసారి నిరూపించారంటూ కొనియాడారు.

మేడారం మహాజాతరలో ఆర్టీసీ సేవలను వినియో గించుకుని, సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక సజ్జనార్‌ కృతజ్ఞ తలు తెలిపారు...

ఎల్లుండే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయి.

రాష్ట్రంలో సుమారు 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం అధికారులు 1,521 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగు తాయి. మార్చి 19తో పరీక్షలు ముగియను న్నాయి.

https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తొమ్మిదో తరగతి బాలికపై పీఈటీ ఉపాధ్యాయుడు అత్యాచారం

విశాఖ జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది.తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పీఈటీ మాస్టర్ అత్యాచారం చేశాడు.

మధురవాడకు చెందిన మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో బాలికపై పీఈటీ దుర్గాప్రసాద్ కళ్లు పడ్డాయి. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి తెలిసింది.

బెదిరింపులకు పాల్పడ టంతో బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

కాకినాడ జిల్లాలో లారీ ఆర్టిసి బస్సు ఢీకొని నలుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కన నిలిపి వేసి మరమ్మతులు చేస్తున్నారు.

విశాఖ పట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది పైకి దూసుకెళ్ల డంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో నేడు గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటన

ఇవాళ తెలంగాణలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యటించానున్నారు. విజయ సంకల్ప యాత్రల్లో పాల్గొంటారు

కాగా, ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ఉదయం నుంచి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, ముషీ రాబాద్ చౌరస్తా, బైబిల్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలాపూర్ స్వీట్ షాప్,

మహంకాళి స్ట్రీట్, సన్ షైన్ హాస్పిటల్, పీజీ రోడ్. పాటిగడ్డ, బేగంపేట్ రైల్వే స్టేషన్, అమీర్ పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.

అలాగే, ఇవాళ మధ్యాహ్నం జుబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని మోతీనగర్, జనప్రియ గ్రౌండ్, అంబేద్కర్ విగ్రహం, రాజీవ్ నగర్, యూసుఫ్ గూడా చెక్ పోస్ట్, శ్రీకృష్ణా నగర్, ఇందిరానగర్ లో జరిగే రోడ్ షోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల

ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.

ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయి న్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టిజిటి పోస్టులకు గతేడాది ఆగస్టు లో రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1: :2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజి నల్ సెలెక్షన్ జాబితాలను విడుదల చేసింది.

ప్రొవిజి నల్ జాబితాలో ఉన్న హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది.

సబ్జెక్టుల వారీగా ఎంపికైన జాబితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది...

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు.. ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు విచారించారు. అయితే.. ఈ కేసులో సమాచారం కోసమే విచారణ చేస్తున్నామంటూ సీబీఐ ఓసారి.. ఈడీ పలు మార్లు విచారణ చేసింది.

అయితే.. మధ్యలో కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించగా.. ఆమె వెళ్లలేదు. ఈ క్రమంలోనే.. ఈడీ నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు కూడా. దానిపై ఇంకా కేసు నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది.

కాగా.. ఈసారి కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు కూడా పంపిం చింది. ఈ నెల 26న విచారణకు రావాలని.. సెక్షన్ 41ఏ కింద కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ.

అయితే.. ఇన్ని రోజులు ఈడీ విచారణలకు డుమ్మా కొట్టిన కవిత.. ఇప్పుడు సీబీఐ విచారణకు కూడా డుమ్మా కొట్టనుంది. అయితే.. నోటిసులు, విచారణ విషయంలో సుప్రీం కోర్టు నుంచి స్పష్ట మైన తీర్పు వచ్చేంత వరకు తాను విచారణకు హాజరు కాబోనంటూ ఇప్పటికే కవిత తేల్చి చెప్పింది.

కాగా.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసులకు కూడా వెళ్లనంటున్నారు కవిత. ఇదిలా ఉంటే.. ఈడీ నోటీసుల కేసుపై ఈనెల 28న సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. సీబీఐ విచారణకు కవిత గైర్హాజరుకానున్నారు. అయితే.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. గతంలో కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్దే విచారించారు

పోలీస్ కట్టు దిట్టమైన భద్రత లో గ్రూపు 2 పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే ఏపీపీఎస్పీ గ్రూపు-2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధ మైంది. గ్రూప్‌-2 పోస్టుల కు మొత్తం 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 25వ తేది ఆదివారం స్క్రీనింగ్‌ రాత పరీక్ష జరుగనుంది.

ఇందుకోసం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 3971 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా ఆయా జిల్లాల ఎస్పీలు పోలీసు అధికా రులు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

దాదాపు అన్ని పరీక్షా కేంద్రాలు నిఘా నీడలోకి వెళ్ళిపోయాయి. బందో బస్తులో భాగంగా ఆయా పరీక్ష కేంద్రాలపై సీసీ కెమేరాల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఉదయం 10.30.గం.ల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయి.

పరీక్షలు సక్రమంగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది ఐఏఎస్‌ అధికారులు, 450 మంది రూట్‌ అధికారు లు,1330 మంది లైజనింగ్‌ అధికారులను నియమించా రు..ఇక కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లు, 8500 ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ఆయా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్సి యల్‌ మెటీ-రియల్‌ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్‌ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.

అలాగే మొత్తం పరీక్షల తీరును పర్యవేక్షించేందుకు ఏపీపీఎస్సీ నుండి 51 మంది అధికారులు నియమితులయ్యారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు రూట్‌ మొబైళ్ళు, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద రిజర్వు సిబ్బందితో గార్డులు ఏర్పాటు చేశారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌లో సూచించిననిబంధనలు పాటించాలని, సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్‌, స్మార్ట్‌ వాచీలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు పరీక్షా కేంద్రాల లోకి అనుమతించ బడవని అధికారుల స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద నిషేదా జ్ఞలు అమల్లో ఉన్నందున సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ షాపులు పని చేయరాదని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడడం నిషేధమని హెచ్చరికలు జారీ చేశారు..