ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడి నోటీసులు

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇవాళ నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.

ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగు తోంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొ వద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడం పొలిటికల్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సీబీఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది..

పురిటి నొప్పులతో పరీక్ష రాసి జడ్జి అయ్యింది

పురిటి నొప్పులతో పరీక్ష రాసి జడ్జి అయ్యింది, ఓ వివాహిత తమిళనాడులోని తిరువణ్ణామలైలోని గిరిజన గూడెం గ్రామానికి చెందిన కలియప్పన్ కూతురు శ్రీపతి,

శ్రీపతి చిన్ననాటి నుంచి కష్టాలు పడి చదువుకుంది. ఆమె లా చేస్తున్నప్పుడే వెంకటేషన్ అనే అంబులెన్స్ డ్రైవర్ తో పెళ్లి అయ్యింది.

బిడ్డకు జన్మనిచ్చిన 2 రోజులకే పురిటి నొప్పులతో సివిల్ జడ్జి పరీక్ష రాసింది. ఫలితాల్లో సివిల్ జడ్జిగా ఎంపికైంది. శ్రీపతి అందరికి ఆదర్శంగా నిలిచిందని అంతా అభినందిస్తు న్నారు.....

Streetbuzz News

మేడారం జంపన్న వాగులోజన సునామి

నాలుగు రోజులే కీలక మైనవి.

మొదటిరోజైన నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.

రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరు కుంటుంది.

మూడో రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవింద రాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

జంప‌న్నవాగులో జ‌న సునామీ

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.

మేడారంలోని జంపన్న వాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలో మీటర్ల వరకు భక్తులతో జంపన్నవాగు జనసముద్రం అవుతుంది. మేడారం, నార్లాపూర్‌, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాలన్ని కూడా జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు.

ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు. ఒక గిరిజన జాతరకు కోట్లాది మంది భక్తులు రావటం కూడా ప్రపంచం లోనే అరుదైన జాతరగా గుర్తింపు పొందింది.

ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం వచ్చి అమ్మలను దర్శించు కుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేరోజు మేడారానికి విచ్చేసి అమ్మలను దర్శించుకోనున్నారు..

పెళ్లి చేసుకున్న క్యూట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్నారు. గోవాలోని ITC గ్రౌండ్ లో ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది.

ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు షాహిద్ కపూర్, శిల్పాశెట్టి, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్ తదితరులు హాజరయ్యారు.

వరుడి సంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలో మరోసారి వివాహం జరగనుంది...

Streetbuzz News

వైసీపీ పార్టీకి, వేమిరెడ్డి గుడ్ బై…

వైసీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మ‌రో షాక్ తగిలింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఇప్ప‌టికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు పార్టీని వీడారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. తన మనసులోని మాటను బహిరంగంగానే బయట పెట్టారు.

కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఎంపీ సీటుపై భరోసా రాలేదు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వేమిరెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట. దీంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేశారు..

ఇక ఆయ‌న‌తో పాటు సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సమాచారం..

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు వేసింది. క‌ర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో భార్య, అత్తను చంపి మామను తీవ్రంగా గాయ‌ప‌రిచిన కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభా దేవి బుధవారం తీర్పు వెలువరించారు.

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రు లతో పాటు రుక్మిణి ఆమె తల్లి రమా దేవిని అతికిరా తకంగా చంపేశాడు.

రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని దారుణంగా గాయపరి చాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్ప‌ట్లో కేసు న‌మోదైంది.

విచారణలో నిందితులపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణలో కేవలం సంఘటన జరిగిన 13నెల లోపల విచారణ పూర్తి చేసి నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనా త్మకమైన తీర్పు చెప్పారు....

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..

బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్టుగా రేవంత్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రూ.2000 కోట్లలతో 64ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదిం పులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు.

ఈ ప్రభుత్వం అంద రిదీ..మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకాం అవసరమన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని అన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం.

రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు

అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాల కులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తా మని చెప్పారు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని… ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు...

తండ్రి అయిన హీరో నిఖిల్‌

యంగ్‌ హీరో నిఖిల్‌ తండ్రి అయ్యాడు. నిఖిల్‌ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకు న్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, డాక్టర్‌ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

నిఖిల్‌ ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ‘స్వయంభూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

STREETBUZZ NEWS

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..

అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత (TDP)బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని అంటే మోసమని.. నాని అంటే నమ్మించి నిండా ముంచడం అని వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR) మద్దతుతో హరికృష్ణ బిక్షతో రాజకీయంగా ఎదిగారన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కొడాలి నాని బాధితుడే అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయలు తీసుకున్నారని.. అది నిజమా? కాదా? నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు..

హైదరాబాద్ శివారులోలో తప్పుడు పత్రాలు సృష్టించి 12 ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్‌కు ఎకరం రూ. 85 లక్షలు చొప్పున అమ్మి మోసం చేశారని విమర్శించారు. ఆ తరువాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జరిగిన మోసాన్ని గ్రహించి ఆ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు.

గుడివాడలో నాని వల్ల మోసపోయిన కాపునేత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాని ఉనికికి ప్రమాదం ఏర్పడినపుడు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్‌ను (Nara Lokesh) విమర్శిస్తారని మండిపడ్డారు. ఎవరో ఒకరిని తిట్టడానికే కొడాలి నాని ప్రెస్ మీట్స్ పెడతారన్నారు.

వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు జగన్‌ను సంతృప్తిపరచడానికి మాట్లాడతారన్నారు. ''మేము చెప్పిన అంశంపై గుడివాడలో చర్చ పెట్టు మేము వస్తాం. నాని లాంటి కుక్కతో మనకెందుకు అని వదిలేస్తున్నారు తప్ప.. మరేమీ కారణం కాదు'' అంటూ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు..

Medaram Jatara: మేడారంలో ఎక్కడ చూసినా జనసంద్రం.. దారులన్నీ అటువైపు

మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు..

దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

కాగా మేడారం మహాజాతరకు సర్వం సన్నద్ధమైంది. నేడు (బుధవారం) సారలమ్మర రాకతో నాలుగు రోజుల జాతర షురూ అయ్యింది. ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక ఈ రోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను (సారయ్య రూపంలో) ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు.

ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మహాజాతర మొదలవనున్న వేళ మేడారం ఇప్పటికే జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.