కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు వేసింది. క‌ర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో భార్య, అత్తను చంపి మామను తీవ్రంగా గాయ‌ప‌రిచిన కేసులో ఇద్దరికీ ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రతిభా దేవి బుధవారం తీర్పు వెలువరించారు.

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రు లతో పాటు రుక్మిణి ఆమె తల్లి రమా దేవిని అతికిరా తకంగా చంపేశాడు.

రుక్మిణి తండ్రి వెంకటేశ్‌ని దారుణంగా గాయపరి చాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్ప‌ట్లో కేసు న‌మోదైంది.

విచారణలో నిందితులపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణలో కేవలం సంఘటన జరిగిన 13నెల లోపల విచారణ పూర్తి చేసి నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సంచలనా త్మకమైన తీర్పు చెప్పారు....

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..

బుధవారం హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్టుగా రేవంత్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రూ.2000 కోట్లలతో 64ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదిం పులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామన్నారు.

ఈ ప్రభుత్వం అంద రిదీ..మీరు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రాభివృద్ధికి అందరి సహకాం అవసరమన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానమని అన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం.

రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు

అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాల కులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తా మని చెప్పారు.

గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని… ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు...

తండ్రి అయిన హీరో నిఖిల్‌

యంగ్‌ హీరో నిఖిల్‌ తండ్రి అయ్యాడు. నిఖిల్‌ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకు న్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, డాక్టర్‌ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

నిఖిల్‌ ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం ‘స్వయంభూ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

STREETBUZZ NEWS

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..

అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత (TDP)బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని అంటే మోసమని.. నాని అంటే నమ్మించి నిండా ముంచడం అని వ్యాఖ్యలు చేశారు.

కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR) మద్దతుతో హరికృష్ణ బిక్షతో రాజకీయంగా ఎదిగారన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కొడాలి నాని బాధితుడే అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయలు తీసుకున్నారని.. అది నిజమా? కాదా? నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు..

హైదరాబాద్ శివారులోలో తప్పుడు పత్రాలు సృష్టించి 12 ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్‌కు ఎకరం రూ. 85 లక్షలు చొప్పున అమ్మి మోసం చేశారని విమర్శించారు. ఆ తరువాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జరిగిన మోసాన్ని గ్రహించి ఆ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు.

గుడివాడలో నాని వల్ల మోసపోయిన కాపునేత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాని ఉనికికి ప్రమాదం ఏర్పడినపుడు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్‌ను (Nara Lokesh) విమర్శిస్తారని మండిపడ్డారు. ఎవరో ఒకరిని తిట్టడానికే కొడాలి నాని ప్రెస్ మీట్స్ పెడతారన్నారు.

వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు జగన్‌ను సంతృప్తిపరచడానికి మాట్లాడతారన్నారు. ''మేము చెప్పిన అంశంపై గుడివాడలో చర్చ పెట్టు మేము వస్తాం. నాని లాంటి కుక్కతో మనకెందుకు అని వదిలేస్తున్నారు తప్ప.. మరేమీ కారణం కాదు'' అంటూ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు..

Medaram Jatara: మేడారంలో ఎక్కడ చూసినా జనసంద్రం.. దారులన్నీ అటువైపు

మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు..

దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

కాగా మేడారం మహాజాతరకు సర్వం సన్నద్ధమైంది. నేడు (బుధవారం) సారలమ్మర రాకతో నాలుగు రోజుల జాతర షురూ అయ్యింది. ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక ఈ రోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను (సారయ్య రూపంలో) ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు.

ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మహాజాతర మొదలవనున్న వేళ మేడారం ఇప్పటికే జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

మేడారం జాతర భక్తులకు అందుబాటులో హెలికాప్టర్ సేవలు

దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వనప్రవేశం చేయించడం వరకు… అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేలలా ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలి కాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.

ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందు బాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది.

మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు!.

హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా VIP దర్శనాన్ని పొందవచ్చు. దీని ధర రూ. ఒక్కొక్కరికి 28,999.హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది.

మరో రైడ్.. జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాలు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్కనుంచి మొద లయ్యే రైడ్‍ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాలమీదుగా ఉంటుంది.

దీనికోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు.

నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది కొత్త ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు..

Streetbuzz News

AP News: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి..

ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా.. వారిలోఇద్దరు సజీవ దహనమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స కోసం మార్కాపురం తరలించారు. మృతులంతా బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

STREETBUZZ NEWS

AP: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.రూ.78.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్‌..

2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేలా వారికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు "వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

Streetbuzz News

SB NEWS

మహా జాతరకు మేడారం ముస్తాబు

మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తు న్నాయి.

ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో..మేడారం కీకార ణ్యంలో…ప్రతి రెండేళ్ల కోసారి ఈ జాతర జరుగుతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవా రం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి..గోవింద రాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.

మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్ర దాయాల ప్రకారం తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.

శుక్రవారం దేవతలకు భక్తు లు మొక్కులు చెల్లించు కుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనా రణ్యాంగా మారిపో తుంది.

సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలు కొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి..