ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తెలిపారు..

Streetbuzz News

SB NEWS

STREETBUZZ NEWS

SB NEWS

గ్రూప్ 1ఎగ్జామ్ నిర్వహణపై అయోమయంలో తెలంగాణ సర్కార్

హైకోర్టు తీర్పుతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్‌తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది. త్వరగా గ్రూప్ -1కు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్‌పి ఎస్‌సి ని ఆదేశించిన విష యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా…? లేక 2022 ఏప్రిల్ 26న విడుదలైన పాత నోటిఫికేషన్‌కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహి స్తారా..? అనే విషయంపై టిఎస్‌పిఎస్‌సి తీసుకునే నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.

ఫలితాల విడుదలపై దృష్టి…

రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడించ డంపై టిఎస్‌పిఎస్‌సి దృష్టి సారించింది. చైర్మన్, సభ్యులతో పాటు కమిష న్‌కు కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది.

ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన కమిషన్, ఇటీవల వివిధ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల చేసింది.

అంతకుముందు భూగర్భ జలవనరుల శాఖ ఉద్యోగ పరీక్షల ఫైనల్ కీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 20న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు...

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్ల లో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళా శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దు కునే సౌకర్యం ఉంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించన‌ న్నారు. ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాను న్నారు...

కరీంనగర్ జిల్లా లో రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

గుజరాత్ నుంచి వచ్చి కొద్ది సంవత్సరాల నుండి గోపాల్ పూర్ లో నివాసం ఉంటు న్నారు తండ్రి రాజీవ్ పటేల్.

మృతురాలు దియా పటేల్ ఆల్ ఫోర్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది.

కరీంనగర్ ఫ్లైఓవర్ కింద సర్కిల్ నుండి ఎలక్ట్రానిక్ స్కూటీపై బైపాస్ కి మలుపు తిరుగుతుండగా గోదావరి ఖని నుండి హైదరాబాద్ వెళుతున్న చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది...

మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అన్నీ ఏర్పాట్లు చేసిందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా 25వ తేది వరకు 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపు తోందని తెలిపారు.

గతంలో కంటే ఈసారి ఎక్కువ‌ బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉంద‌ని, ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ జాతరకు అందు బాటులో ఉన్నందున.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.

మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించు కుంటారని సంస్థ అంచనా వేస్తోందన్నారు.

భక్తులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు పెద్ద సంఖ్యలో 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు....

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,390.. 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,190.. 

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,900.

STREETBUZZ NEWS

SB NEWS

Kalki Dham: నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు..

10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు..

Adluri Lakshman: ప్రభుత్వ విప్ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం..

కరీంనగర్: తెలంగాణప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద కారు బోల్తా పడింది..

ఘటన సమయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కారులోనే ఉన్నారు. ఆయనతో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాస్పిటల్ వైద్యుల తో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ ను హైదరాబాద్‌కు తరలించారు..

Pawan Kalyan: నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు..

టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.

మధ్యాహ్నం తర్వాత పవన్‌ రాజమండ్రి వెళ్లనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం..

Tirumala: నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది..

సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్‌ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, వర్చువల్‌ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు,

అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు..