తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,390..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,190..
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,900.
STREETBUZZ NEWS
SB NEWS
Kalki Dham: నేడు కల్కిధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు..
10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు..
Adluri Lakshman: ప్రభుత్వ విప్ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం..
కరీంనగర్: తెలంగాణప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద కారు బోల్తా పడింది..
ఘటన సమయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారులోనే ఉన్నారు. ఆయనతో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాస్పిటల్ వైద్యుల తో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణ్ ను హైదరాబాద్‌కు తరలించారు..
Pawan Kalyan: నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు..
టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
మధ్యాహ్నం తర్వాత పవన్ రాజమండ్రి వెళ్లనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం..
Tirumala: నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది..
సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు,
అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు..
వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ
ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు..
పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అన్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు..
ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి..
Bandla Ganesh : మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది..
జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఆయనకు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా ఆరునెలల జైలు శిక్ష విధించింది.
టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.15,86, 550ల జరిమానా కూడా విధించింది..
25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది.
బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవూడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసాడు. ‘ఆంజనేయులు’ సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించి ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘టెంపర్’ వంటి చిత్రాలు నిర్మించాడు..
Bharat Jodo Nyay Yatra: జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది..
రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి..
పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది.
అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు..
Farmer's Protest Updates: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..
ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచిచూస్తున్నారు. దీంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది
రైతుల ఆందోళనల నేపధ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. మంగళవారం హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకుంది.
ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్‌లో గట్టి పోలీసు నిఘా కొనసాగుతోంది..
Feb 19 2024, 13:17