జన సందోహంలో వేములవాడ దేవస్థానం

రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు.

స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు ఆచ‌రించి ఆల‌యానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

వేములవాడ రాజన్నభక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు అధికారులు రద్దు చేశారు. భక్తులకు లఘు దర్శనానికి అనుమతి ఇచ్చారు.

సమ్మక్క-సారలమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ.

వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే…సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళతారు జనాలు. ఈ తరుణంలోనే.. జనవరి మాసం నుంచే వేములవాడ రాజన్న క్షేత్రాని కి భక్తులు విపరీతంగా వస్తున్నారు.

Rebel MLAs Disqualification: రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా..?

రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు..

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించనున్నారు.. ఈ రోజు ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అయితే, అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది..

అయితే, ఈనెల 9వ తేదీన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ.. 9వ తేదీన నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఆ నోటీసుల ప్రకారం.. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజు వారి అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు స్పీకర్‌..

Farmers movement: రేపు రైతు సంఘాల 'ఢిల్లీ చలో'

•భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు

ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన 'ఢిల్లీ చలో'మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..

నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్‌ దిమ్మెలు, స్పైక్‌ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్‌ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్‌ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు..

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్‌ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్‌ ట్రాలీ మార్చ్‌ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్‌ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సరీ్వసులను, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను మంగళవారం దాకా నిషేధించింది..

Telangana Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు..

ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..

అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి్.. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతిపై కేసీఆర్ ను ఉద్దేశించి ఓ వీడియోను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామ అధికార కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు తెలంగాణ ప్రజలకు అసలు నిజాలు చెప్తామన్నాంటున్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారు.. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీలోనే చెప్పారనే విషయాన్ని ప్రజలకు అధికార కాంగ్రెస్ పార్టీలు తెలిపారు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పేద‌లు, రైతులు గుర్తుకొస్తార‌ని అన్నారు. బీజేపీ రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుపొందుతుంద‌న్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు, మీ సేవ‌కుడిగా తాను ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని మోదీ చ‌ప్పారు. తాను లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావం పూరించేందుకే వ‌చ్చాన‌ని కొంద‌రు మాట్లాడుకుంటున్నార‌ని.. కానీ తాను ఓట్ల కోసం రాలేద‌ని మోదీ చెప్పారు.

Nagoba Jatara: వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు..

ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.

కాగా నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా... ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవతల బౌలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు.

అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు బేటింగ్‌ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్‌తో పాటు మెస్రం పెద్దలు పాల్గొన్నారు..

Chandrababu : మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ

అమరావతి: ''అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి... ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే..

ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న స్వచ్ఛభారత్‌, ఆత్మనిర్భర్‌, బేటీ బచావో- బేటీ పఢావో వంటి పథకాల్ని పాతికేళ్లకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అమలు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం''

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై సీనియర్‌ పాత్రికేయుడు పూల విక్రమ్‌ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకంలోని వాక్యాలివి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి... కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగి, తన దార్శనికతతో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ప్రచురించిన ఆ పుస్తకాన్ని... విజయవాడలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు.

అన్ని పార్శ్వాలనూ స్పృశిస్తూ...

చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో ప్రారంభించి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపుతో పెట్టిన తప్పుడు కేసుల్ని దీటుగా ఎదుర్కోవడం, 53 రోజులపాటు అక్రమంగా జైల్లో పెట్టినా మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న అలుపెరగని పోరాటం వరకు... అన్ని అంశాల్నీ పుస్తకంలో పొందుపరిచారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు-వాస్తవాలపై ఒక అధ్యాయమే ఉంది. చంద్రబాబు కుటుంబానికి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉండేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఆస్తులు సంపాదించారన్నది ఎలా దుష్ప్రచారమో వివరించారు.

''చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు ఆయనపై అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఆయన అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేశారు. ఆయన 'వ్యవసాయం దండగ' అన్నారన్నది వాటిలో ఒకటి. వైఎస్‌ ముఖ్యమంత్రయ్యాక ఒక సందర్భంలో... వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి సంబంధించిన న్యూస్‌ క్లిప్పింగ్‌ వెతికి తీయాలని అధికారుల్ని ఆదేశించారు. సమాచార శాఖ ఉద్యోగులు వారం రోజులు అన్ని పనులూ పక్కనపెట్టి పాత వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు శోధించారు. కానీ ఏ పేపర్‌లోనూ వారికి అలాంటి స్టేట్‌మెంట్‌ దొరకలేదు. దాంతో తేలు కుట్టిన దొంగల్లా కాంగ్రెస్‌ నేతలు మౌనంగా ఉండిపోయారు'' అని రచయిత వివరించారు.

ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు..

అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ జరుగుతుందట..

పెడనలో జాగ్రత్తగా పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పారట చంద్రబాబు. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం.

మొత్తం 175 స్థానాలనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు - పవన్ కళ్యాన్‌ ఉన్నారట. బీజేపీతో పొత్తు తెర పైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈలోగా అనధికారికంగా కొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు..

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న ఈ మెగా టోర్నమెంట్‌ లో భారత్ వరుస విజయా లతో ఫైనల్‌కు చేరింది.

ఈ క్రమంలో ఒక్క సౌతాఫ్రి కాతో జరిగిన సెమీ ఫైనల్లోనే టీమిండియాకు కాస్త పోటీ ఎదురైంది. లీగ్ దశతో పాటు సూపర్6 లో భారత్ అలవోక విజయాలను అందుకుంది.

ఒక్క ఓటమి కూడా చవి చూడకుండానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసా గించాలనే పట్టుదలతో ఉంది. తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఆరో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దా డాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో రెండు సార్లు ఫైనల్‌లో భారత్ తలపడింది.

రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియా ను ఓడించి ప్రపంచ ఛాంపి యన్‌గా నిలువాలనే లక్ష్యం తో పోరుకు సిద్ధమైంది. అంతేగాక పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా నిలువాలనే పట్టు దలతో కనిపిస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాత్రమే వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ ట్రోఫీని గెలిచింది. భారత్‌కు ఈసారి ఆ రికార్డును సమం చేసే అవకాశం దక్కింది.

వరుస విజయాలతో..

ఈ వరల్డ్‌కప్‌లో టీమిండి యా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టి స్తోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్ సిక్స్‌లో కూడా అజేయంగా నిలిచింది. సెమీస్‌లో బలమైన సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభా గాల్లో టీమిండియా సమ తూకంగా ఉంది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్, అర్షిన్ కుల్‌కర్ణి, ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, వికెట్ కీపర్ అవనిష్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ముషీర్ ఖాన్ ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు.

ఉదయ్, సచిన్, ఆదర్శ్ తదితరులు కూడా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తమవం తు పాత్ర పోషిస్తున్నారు. సమి,పాండే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. రాజ్ లింబాని, మురుగన అభిషేక్, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది

Amit Shah: ఎన్డీఏలోకి కొత్త మిత్రులు.. ఏపీలో పొత్తులపై స్పందించిన అమిత్‌ షా

దిల్లీ: ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆయన స్పందించారు. ఎకనమిక్‌ టైమ్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన అమిత్‌ షా..

ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబ పరంగా బాగుంటుందన్న అమిత్‌ షా.. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీలో అమిత్‌షాతో సమావేశమై చర్చలు జరిపారు..