ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు..
అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ జరుగుతుందట..
పెడనలో జాగ్రత్తగా పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పారట చంద్రబాబు. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం.
మొత్తం 175 స్థానాలనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు - పవన్ కళ్యాన్ ఉన్నారట. బీజేపీతో పొత్తు తెర పైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈలోగా అనధికారికంగా కొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు..










Feb 11 2024, 11:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.6k