ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు..

అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ జరుగుతుందట..

పెడనలో జాగ్రత్తగా పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పారట చంద్రబాబు. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం.

మొత్తం 175 స్థానాలనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు - పవన్ కళ్యాన్‌ ఉన్నారట. బీజేపీతో పొత్తు తెర పైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈలోగా అనధికారికంగా కొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు..

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న ఈ మెగా టోర్నమెంట్‌ లో భారత్ వరుస విజయా లతో ఫైనల్‌కు చేరింది.

ఈ క్రమంలో ఒక్క సౌతాఫ్రి కాతో జరిగిన సెమీ ఫైనల్లోనే టీమిండియాకు కాస్త పోటీ ఎదురైంది. లీగ్ దశతో పాటు సూపర్6 లో భారత్ అలవోక విజయాలను అందుకుంది.

ఒక్క ఓటమి కూడా చవి చూడకుండానే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసా గించాలనే పట్టుదలతో ఉంది. తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఆరో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దా డాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో రెండు సార్లు ఫైనల్‌లో భారత్ తలపడింది.

రెండు సార్లు టీమిండియానే విజయం సాధించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియా ను ఓడించి ప్రపంచ ఛాంపి యన్‌గా నిలువాలనే లక్ష్యం తో పోరుకు సిద్ధమైంది. అంతేగాక పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా నిలువాలనే పట్టు దలతో కనిపిస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ మాత్రమే వరుసగా రెండు సార్లు ప్రపంచకప్ ట్రోఫీని గెలిచింది. భారత్‌కు ఈసారి ఆ రికార్డును సమం చేసే అవకాశం దక్కింది.

వరుస విజయాలతో..

ఈ వరల్డ్‌కప్‌లో టీమిండి యా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టి స్తోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్ సిక్స్‌లో కూడా అజేయంగా నిలిచింది. సెమీస్‌లో బలమైన సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభా గాల్లో టీమిండియా సమ తూకంగా ఉంది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్, అర్షిన్ కుల్‌కర్ణి, ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, వికెట్ కీపర్ అవనిష్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ముషీర్ ఖాన్ ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు.

ఉదయ్, సచిన్, ఆదర్శ్ తదితరులు కూడా అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో తమవం తు పాత్ర పోషిస్తున్నారు. సమి,పాండే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. రాజ్ లింబాని, మురుగన అభిషేక్, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది

Amit Shah: ఎన్డీఏలోకి కొత్త మిత్రులు.. ఏపీలో పొత్తులపై స్పందించిన అమిత్‌ షా

దిల్లీ: ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆయన స్పందించారు. ఎకనమిక్‌ టైమ్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన అమిత్‌ షా..

ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబ పరంగా బాగుంటుందన్న అమిత్‌ షా.. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీలో అమిత్‌షాతో సమావేశమై చర్చలు జరిపారు..

నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రూప్ C,ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ గుడ్‌న్యూస్ చెప్పింది. పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది..

ఫిబ్రవరి 16తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడ మీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్‌కు ట్రైనింగ్ ఇస్తారు.

ఈ సంస్థ తాజా రిక్రూట్‌ మెంట్‌లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు..

లోయర్ డివిజన్ క్లర్క్-16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి.

కంపోజిటర్ కమ్ ప్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్ (OG)-3, కార్పెంటర్-2, ఫైర్‌మెన్-2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైయినింగ్-151 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

మా పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీ

కరోనా వల్ల చాలాకాలం అనేక కష్టాలు పడ్డాం: మోదీ

ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం

ఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాం.

ఐదేళ్లుగా రిఫామ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాం

అనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదు

కొత్త పార్లమెంటు భవనం మనకు గర్వకారణంగా నిలిచింది

స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను నిత్యం స్మరించుకుంటున్నాం.

ఆ లక్ష్యాల దిశగా మా పరిపాలన ఎప్పుడూ కొనసాగుతోంది

జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం

జీ-20 సదస్సుతో మన దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది

పార్లమెంటులో డిజిటలైజేషన్‌ చేపట్టాం

పార్లమెంటుకు హాజరయ్యే సభ్యుల శాతం పెరిగింది: మోదీ...

Revanth reddy ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డినే అడగాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు..

''మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే కాదు... ప్రతిపక్షాలనూ అక్కడికి తీసుకెళ్తాం..

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మా పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తాం.

20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారు. ఈ విషయంపై ఆయన్నే అడగాలి''అని చెప్పారు..

Telangana Budget 2024-25: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

2024-25: తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. 

ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు 

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11692 కోట్లు

మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు

ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు

ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు

విద్యా రంగానికి రూ.21389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

వైద్య రంగానికి రూ.11500 కోట్లు

విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418కోట్లు.

విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు.

గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.

నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు కేటాయించారు

AP Congress: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు..

ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా..

ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ కాంగ్రెస్ సమయం ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్‌ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి..

గడవు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజుల గడువును ఏపీసీసీ పెంచింది. దరఖాస్తులు ఎక్కువగా రావడంపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలో స్పష్టతనిస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి పదిమంది ఆశావహులు పోటీపడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలా ల్లో యాత్ర కొనసాగిస్తాం అని వివరించారు.

ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం అని చెప్పారు.

Pawan Kalyan: పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు..

అమరావతి: జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు..

ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని స్పష్టం చేశారు..

అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు..