Revanth reddy ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై జగ్గారెడ్డినే అడగాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు..

''మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే కాదు... ప్రతిపక్షాలనూ అక్కడికి తీసుకెళ్తాం..

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మా పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తాం.

20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారు. ఈ విషయంపై ఆయన్నే అడగాలి''అని చెప్పారు..

Telangana Budget 2024-25: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

2024-25: తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. 

ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు 

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11692 కోట్లు

మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు

ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు

ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు

విద్యా రంగానికి రూ.21389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

వైద్య రంగానికి రూ.11500 కోట్లు

విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418కోట్లు.

విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు.

గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.

నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు కేటాయించారు

AP Congress: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు..

ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా..

ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ కాంగ్రెస్ సమయం ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్‌ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి..

గడవు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజుల గడువును ఏపీసీసీ పెంచింది. దరఖాస్తులు ఎక్కువగా రావడంపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలో స్పష్టతనిస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి పదిమంది ఆశావహులు పోటీపడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలా ల్లో యాత్ర కొనసాగిస్తాం అని వివరించారు.

ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం అని చెప్పారు.

Pawan Kalyan: పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు..

అమరావతి: జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు..

ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని స్పష్టం చేశారు..

అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు..

బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రాం రాం

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కోసం అనేక మంది నేతలు ఎదురు చూశారు. మూడు రోజు సమావేశాలు జరుగుతున్న కేసీఆర్ మాత్రం ఇంకా అసెంబ్లీ రాలేదు.

ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయిన కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న ఇంకా హాజరు కాలేదు.

కాగా, అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించ లేక రావడం లేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది.

మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శ నకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ బాధ్యత లు అప్పగించారు...,.

NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి..

చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కాగా, కొయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది..

ఎన్ఐఏ అధికారులు ఉట్టీమ్, కారంబుక్కడై, గుణిముత్తూరు, పొత్తెలూర్ సహా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఉద్ధిమ్ అల్ అమ్యేన్‌క దగ్గర ఏచి మెచకానిక్ అపిపూర్ రక్షకుడు ఇంట్లో సైతం నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు సోదాలు చేశారు.

అలాగే, అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.. నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు చెన్నై, దురై, నోల్యతో సహా తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. అయితే, 2021లో జరిగిన కారు బాంబు ఘటన నేపథ్యంలో ఐఎస్ఐఎస్ సంస్థ ఉనికిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో వెల్లడైంది..

KCR: తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు..

గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు..

కాగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగ్గా.. బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ సభకు హాజరుకాలేదు.

ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజులు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది..

ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్

టీఎస్‌ ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు పేర్కొంది.

లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపింది.

ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకా శం ఇచ్చింది. మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించను న్నట్లు ప్రకటన చేసింది...

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన :.సీఎం రేవంత్ రెడ్డి

ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పిం చారు.

మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవదాయ శాఖ అందు బాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు ఈ సౌకర్యం కల్పించనుంది.

సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించు కునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు...