కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలా ల్లో యాత్ర కొనసాగిస్తాం అని వివరించారు.

ప్రజల కోసం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేశాం అని చెప్పారు.

Pawan Kalyan: పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌ కీలక సూచనలు..

అమరావతి: జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు..

ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని స్పష్టం చేశారు..

అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు. అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు..

బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రాం రాం

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కోసం అనేక మంది నేతలు ఎదురు చూశారు. మూడు రోజు సమావేశాలు జరుగుతున్న కేసీఆర్ మాత్రం ఇంకా అసెంబ్లీ రాలేదు.

ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయిన కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న ఇంకా హాజరు కాలేదు.

కాగా, అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌కు సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించ లేక రావడం లేదని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది.

మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శ నకు రావాలని గులాబీ బాస్ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ బాధ్యత లు అప్పగించారు...,.

NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి..

చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కాగా, కొయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది..

ఎన్ఐఏ అధికారులు ఉట్టీమ్, కారంబుక్కడై, గుణిముత్తూరు, పొత్తెలూర్ సహా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా, ఉద్ధిమ్ అల్ అమ్యేన్‌క దగ్గర ఏచి మెచకానిక్ అపిపూర్ రక్షకుడు ఇంట్లో సైతం నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు సోదాలు చేశారు.

అలాగే, అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.. నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు చెన్నై, దురై, నోల్యతో సహా తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. అయితే, 2021లో జరిగిన కారు బాంబు ఘటన నేపథ్యంలో ఐఎస్ఐఎస్ సంస్థ ఉనికిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల విచారణలో వెల్లడైంది..

KCR: తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు..

గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు..

కాగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం చర్చ జరగ్గా.. బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ సభకు హాజరుకాలేదు.

ఇటీవలే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజులు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది..

ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్

టీఎస్‌ ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు పేర్కొంది.

లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపింది.

ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకా శం ఇచ్చింది. మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించను న్నట్లు ప్రకటన చేసింది...

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన :.సీఎం రేవంత్ రెడ్డి

ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పిం చారు.

మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవదాయ శాఖ అందు బాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు ఈ సౌకర్యం కల్పించనుంది.

సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించు కునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు...

Telangana Budget 2024 : నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​!

ఉభయ సభల ముందుకు రానుంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసనసభలోశాససభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..

2024-25 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ అంచనాలతో పాటు 2022-23 సంవత్సరానికి చెందిన లెక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించారు..

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2 లక్షలా 90 వేల కోట్ల రూపాయలు కాగా రానున్న ఆర్థిక సంవత్సరానికి కాస్త పెరిగి రెండు లక్షలా 90 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం..

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం..

సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు..

ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు

-జస్టిస్‌ ఎన్‌వీ రమణ..

PM Modi: ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు..

బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్, ఎల్‌.మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే తదితరులు ప్రధానితో కలిసి భోజనం చేశారు..

దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన లంచ్‌ భేటీలో పలు అంశాలపై ముచ్చటించారు. విదేశీ పర్యటలు, వ్యక్తిగత విషయాలను మోడీ పంచుకున్నట్లు తెలిసింది. తనతో పాటు ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..