సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన :.సీఎం రేవంత్ రెడ్డి
ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పిం చారు.
మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవదాయ శాఖ అందు బాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు ఈ సౌకర్యం కల్పించనుంది.
సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించు కునే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు...











Feb 10 2024, 09:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k