నమిలే సాయి తేజ జయంతి సందర్భంగా ,అనాధాశ్రమంలో అన్నదానం


యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు కు చెందిన నమిలె సాయితేజ జయంతి సందర్భంగా ..వంగపల్లి లోని "అమ్మఒడి అనాదాశ్రమం"లో బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నకందుకూరు మాజీ సర్పంచ్ నమిలె పాండు మాట్లాడుతూ... చిన్న వయసులోనే కుటుంబ సభ్యులను, స్నేహితులను విడిచి వెళ్ళిన సాయితేజ జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయని ఆయన అన్నారు. నమిలె సాయితేజ జయంతి,వర్థంతులను అనాదాశ్రమం లో జరుపుకుంటామని ఆయన తెలిపారు. "అమ్మఒడి అనాదాశ్రమానికి" మా వంతు సహాయ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, సాయితేజ కుటుంబ సభ్యులు అఖిల, శ్రావణి,అనాధ ఆశ్రమ నిర్వాహకులు చింతకింది దివ్య, సాయితేజ మిత్రులు నమిలె అభిషేక్, శ్రీకాంత్, సాయికుమార్, రాజేష్ మనోహర్, మధు, బలరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల ఆత్మహత్యలపై స్పందించిన భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర


భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై బుధవారం రాజేష్ చంద్ర స్పందించారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతుందన్నారు. విద్యార్థినీల ఆత్మహత్యలపై సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి కథనాలను నమ్మొద్దని చెప్పారు. తోటి విద్యార్థినీల వాంగ్మూలం తీసుకున్నామన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు.

ప్రజా పోరాటాలను బలపరచండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

 ప్రజా పోరాటాలను బలపర్చాలని సిపిఎం నిర్వహిస్తున్న ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున బీబీనగర్ మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రజా పోరాటాలను బలపరచాలని, ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ మండల నాయకత్వంతో కలిసి " కరపత్రం " విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అనేక ప్రజా సమస్యలను అధ్యయన చేసి వాటి ఆధారంగా ఆందోళన, పోరాట కార్యక్రమాలు రూపొందించడానికి ఇంటింటి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు, మేధావులు, కర్షకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్ని విధాలా ఆదరించాలని అన్నారు. దశాబ్దాలు కడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న నేటికీ జిల్లాలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు. హామీలు ఇవ్వడం పదేపదే ప్రజల్ని మోసగించడం పాలకులకు అలవాటుగా మారిందని అన్నారు. గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వెనుకబాటుతనం మూలంగా ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని నూతన పాలకుల పనితీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన ప్రతి వాగ్దానాలను ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం పూనుకొని సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలను పరిశీలిస్తే అసంపూర్తి పనులే చాలా మిగిలి ఉన్నాయని బీబీనగర్ ఎయిమ్స్, బస్వాపురం ప్రాజెక్టు, బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలు, నక్కలగండి ఎత్తిపోతల పనులు నేటికీ పూర్తి కాలేదని ఆవేదన వెలిబుచ్చారు.ఇప్పటికైనా వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తి అయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి సర్కారు పాలన గాడి తప్పిందని ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను, పెడరల్ స్ఫూర్తికి విగాథం కలిగిస్తూ ఏకపక్ష విధానంతో నియంతృత్వం వైపు కొనసాగుతుందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలికి వదిలి ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మతోన్మాద రాజకీయ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాసు, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, సందెల రాజేష్, టం టం వెంకటేశం నాయకులు బండారు శ్రీరాములు, మంద కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఎస్సీ హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్య....వార్డెన్ శైలజ సస్పెండ్


యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ శైలజ సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహము లో ఫ్యాన్ కు ఉరేసుకుని విద్యార్థినిలు మృతి చెందిన ఘటన అనుమానాస్పదంగా ఉందని, హాస్టల్ వార్డెన్ శైలజ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పలువురు ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ ఘటనపై విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జేండగే , వార్డెన్ శైలజ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

భూదాన్ పోచంపల్లి ని పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేస్తాం: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


భూదాన్ మున్సిపాలిటీ కేంద్రంలోని టూరిజం పార్కులో మున్సిపాలిటీ మరియు మండల అభివృద్ధి రివ్యూ మీటింగ్ ని అధికారులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని పలు సమస్యలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు మినీ ట్యాంక్బండ్ గా ఏర్పాటు చేస్తామని ,హామీలు ఇచ్చి వదిలేసారని అని తెలిపారు. 

అలాగే భూదాన్ పోచంపల్లి కి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి చీరలకు కొనుగోలుకు ...పర్యాటకులు వస్తుంటారని, కానీ ఇక్కడ వసతుల లేమితో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని ,ప్రభుత్వపరంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేలా చేస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ విజయలక్ష్మి, ఎమ్మార్వో ,ఎంపీడీవో, తదితర విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు .. తేజ


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం 

అనాజిపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్,యువకులకు క్రీకెట్ కిట్టు పంపిణీ హాజరైన 

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా తేజ మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించే బాధ్యత నాది,క్రమశిక్షణతో కష్టపడి చదివే బాధ్యత మీది,పాఠశాల అభివృద్ధికి నా వంతు సాయంగా10,000/వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినారు.యువత క్రీడలలో అభివృద్ధి చెందాలి చల్లా తేజ అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెమ్మోజు బాలచారి కుటుంబ సభ్యులను పరామర్శించి10,000/వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన చల్లా తేజ ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు దశరథ మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ అజాద్ యువకులు తరితరులు పాల్గోన్నారు.

లింగరాజు పల్లి లో రామాలయ నిర్మాణం ... దాతలు గంధమల్ల మల్లమ్మ బాలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో పుట్టిన ఊరు మీద ప్రేమతో గ్రామంలో నూతనంగా రామాలయ నిర్మాణం చేపట్టిన లింగరాజు పల్లి వాస్తవ్యులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గంధ మల్ల బాలయ్య మల్లమ్మ తమ సొంత నిధులతో ఊరిలో రామాలయ నిర్మాణం చేపట్టారు. ఈ గుడి నిర్మా ణం చేపట్టడంతో గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విరివురు దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకుంటూ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందులో సీతారాముల వారి విగ్రహాలు ప్రతిష్టించాలని వారి కోరిక ఉన్నందున వారికి గ్రామ ప్రజలు సహకరించాలని ఆ సీతా రాముల కరుణాకటాక్షం గ్రామ ప్రజలపై ఉండాలని గుడి నిర్మిస్తున్న గంధమల్ల మల్లమ్మ బాలయ్య కి సీతారాముల కరుణ కటాక్షం ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి కల్పించాలని సీతారామచంద్రస్వామి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బాల్క సుమన్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలి: యూత్ కాంగ్రెస్ వలిగొండ పట్టణ అధ్యక్షులు పూసుకూరి లింగస్వామి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పుసుకూరి లింగస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ వ్యవహార శైలిపై లింగస్వామి తీవ్రంగా స్పందించారు. బిఆర్ఎస్ నేతల మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మనిషిలాగ మాట్లాడుతూ బ్రతకాలని సూచించారు. బాల్క సుమన్ ఇంకోసారి వింత జంతువు లాగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని 

హెచ్చరించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్యంగా మాట్లాడే బాల్క సుమన్ లాంటి నేతలకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాల్క సుమన్ ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీ రామలింగేశ్వర నాట్య కళామండలి అధ్యక్షులుగా ఎన్నికైన పైళ్ళ దామోదర్ రెడ్డిని సన్మానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


శ్రీ రామలింగేశ్వర నాట్య కళా మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పుడమి సాహితీ పురస్కార గ్రహీత దామోదర్ రెడ్డి ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆత్మకూరు ఎం: శ్రీ రామ లింగేశ్వర నాట్య కళా మండలి అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పైళ్ళ దామోదర్ రెడ్డి ని గౌరవంగా సన్మానించిన ప్రభుత్వ విప్ ,ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బీర్ల ఐలయ్య . మండలంలో నాటక కళా రంగంలో తనదైన శైలిలో ప్రత్యేక స్థానాన్ని పొందిన సీనియర్ కళాకారుడు మండల కేంద్రానికి చెందిన పైళ్ళ దామోదర్ రెడ్డి , ఇటీవల పుడమి సాహితీ వేదిక ద్వారా పురస్కారాన్ని అందుకోగా నేడు వారు స్థానిక శ్రీరామ లింగేశ్వర నాట్య కళా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ,ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏఐఎస్ఎఫ్ ,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ముట్టడి


అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సమస్యలు పరిష్కరించాలని ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ...అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్ ,పెరబోయిన మహేందర్ లు మాట్లాడుతూ ...బీబీనగర్ లోని ఎయిమ్స్ లో అలాగే యాదాద్రి దేవస్థానంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఈ జిల్లాలో డ్రగ్స్ గంజాయిని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తూపుల అభిలాష్ ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ..యాదాద్రి దేవస్థానం నిధులతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని . పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో జరిగిన ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ముట్టడి కార్యక్రమం కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత కొనసాగింది పోలీసులు విద్యార్థి ,యువజన నాయకుల మధ్య తోపులాట జరిగింది కలెక్టరేట్ లోనికి ప్రదర్శనగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .వారు సానుకూలంగా చదివి విన్న తర్వాత స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నహీం సుద్దాల సాయి ,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సూరారం జానీ ,ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల వెంకటేష్ ,కంబాల రాజు ,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మారుపాక లోకేష్, ఎం జానీ దినేష్ ,కళ్యాణ్ ,సాయి చరణ్, సుమన్, ప్రవీణ్ ,ప్రణయ్ ,రవితేజ ,దుర్గాప్రసాద్ ,సుమన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.