వలిగొండ ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం


వలిగొండ నూతన ఎస్సైగా వచ్చిన.. డి.మహేందర్ ను. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ...ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్, మండల ప్రధాన కార్యదర్శి బొడిగె సుదర్శన్, మండల మహిళా అధ్యక్షురాలు గంధ మల్ల మల్లమ్మ.,కార్యదర్శి ఐటి పాముల పుష్ప,మహిళా కమిటీ గౌరవ సలహాదారు,శీలం ఇందిర,మల్లం వెంకటేశం ,మంటి రమేష్, లింగస్వామి ,సత్యనారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ పట్టణం లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మహేందర్ లాల్


సైబర్ నేరల పట్ల ప్రజలు విద్యార్థులు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రావన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ అన్నారు. వలిగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ... సైబర్ నేరాలపై పట్టణ ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు .ఫోన్లో ఓటిపి.. ఫోన్ పే ,గూగుల్ పే కేవైసీలను అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్ స్పందించ వద్దన్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నడిపివారు... కొత్త వ్యక్తుల మాటలను నమ్మ వద్దని... తెలియని మెసేజ్ ల పై క్లిక్ చేయరాదని తెలిపారు. అలాగే సీసీటీవీ ఉపయోగాల గురించి తెలియజేశారు.

వలిగొండ ఎస్సై మహేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నేతలు


మందకృష్ణమాదిగ ఆదేశాల మేరకు, ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ..వలిగొండ మండల లో మండల కన్వీనర్ పల్లెర్ల రామచందర్ అధ్యక్షతన నిర్వహించిన సందర్భంగా mrps జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ...  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం తుది దశకు చేరుకుందని ,ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ప్రతి మాదిగ బిడ్డ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొని ,వర్గీకరణ సాధించి మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే వరకూ ...మందకృష్ణ మాదిగ గారినాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి... వర్గీకరణ సాధించి, మాదిగ ఉపకులాల ప్రజలకు న్యాయం చేయాలని ,అందుకోసం ప్రతి మాదిగ బిడ్డ వర్గీకరణ సాధించేవరకు అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. త దనంతరం నూతనంగా వచ్చిన వలిగొండ ఎస్సై మహేందర్ sir గారిని ,మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .ఈ కార్యక్రమంలో mrps సీనియర్ నాయకులు దుబ్బ దానయ్య మాదిగ ,కందుల అంజయ్య, సలిగంజి బిక్షపతి, ఎర్ర  మహేష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు శివకుమార్,  పులి కృష్ణ ,దుబ్బ చింటూ, తదితరులు పాల్గొన్నారు.

స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థను వృత్తి విశ్వవిద్యాలయంగా మార్పు చేయాలని సీఎం ని కోరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ని గురువారం కలిసిన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి .... ఈ సందర్భంగా

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ అభివృద్ధి సంస్థను వృత్తి విశ్వవిద్యాలయంగా మార్పు చేయాలని వినతిపత్రం అందజేశారు.

RRR రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని సీఎంని కోరారు..

అలాగే నియోజకవర్గంలోని భునాదిగాని కాలువ మరమ్మతులకు159.03 కోట్లు, ధర్మారెడ్డి పల్లి కాలువ మరమ్మతులకు 129.80 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వ మరమ్మతులకు 95.60 కోట్లు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది .

మరియు తెలంగాణ సాయుధ రైతు ,పోరాటయోధుడు రావినారాయణరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారని ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా మండల అధ్యక్ష ,కార్యదర్శులుగా గంధమల్ల మల్లమ్మ , ఐటిపాముల పుష్ప నియామకం


తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళ మండల అధ్యక్ష కార్యదర్శులుగా గంధ మల్ల. మల్లమ్మ ,ఐటి పాముల పుష్పను నియమిస్తూ... రాష్ట్ర కమిటీ అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి ఆదేశాల మేరకు ...మండల గౌరవ సలహాదారులుగా శీలం ఇందిరను నియమిస్తూ, నియామక పత్రం గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొడిగె. సుదర్శన్ ,మంటిపల్లి లింగస్వామి , తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమ సేవా సంఘం కార్యనిర్వణ అధ్యక్షులుగా వంగాల అశోక్ గౌడ్ నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన వంగాల అశోక్ గౌడ్ ను, రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆలేరులో నిర్వహించిన రైతు సంక్షేమ సంఘం ముఖ్య కార్య కార్యకర్తల సమావేశంలో ..ఆయనను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి రైతు క్రిమిసంహారక

మందులు పిచికారి చేయకుండా సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి, అందరి ఆరోగ్యం కాపాడాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎబినేజర్ ,రైతు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేతావత్ మహేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ను కలిసిన వలిగొండ మండలంలోని RRR భూ బాధితులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని వర్కట్ పల్లి ,గోకారం గ్రామాల నుండి రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గురువారం సాయంత్రం నాలుగు గంటలకి హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి, తమ సమస్యల్ని వివరించారు. గతంలో గ్యాస్ పైప్ లైన్ కోసం తమ భూములు పోయాయని అన్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా తమ భూముల నుండి పోతుందని ,దీనికోసం మిగిలిన భూమి కూడా పోతే జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అందుచేత అలైన్మెంట్ మార్చేలా ...ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, బాధిత రైతులు ప్రొఫెసర్ కోదండ రామ్ ను కోరారు. ఈ సందర్భంగా ...ప్రొఫెసర్ కోదండరాం సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు దానయ్య ,మాడుగుల గోపి, వెంకటేశం, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గోపరాజుపల్లి గ్రామ యువకులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన యువకులు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చం అందజేసి, సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా... యువజన నాయకులు కీసర్ల భరత్ రెడ్డి మాట్లాడుతూ ...గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కీసర్ల వంశీధర్ రెడ్డి ,పాశం మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పద్మశ్రీ పురస్కారం కు ఎన్నికైన కూరెళ్లకు బీఎస్పీ సన్మానం


భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్బంగా సాహిత్య విషిష్ఠ సేవలను గుర్తించి డా. కూరెళ్ళ విఠలాచార్యకు పద్మ శ్రీ పురస్కారం లభించిన సందర్బంగా.. వెల్లంకి గ్రామంలో తన స్వగృహంలో బిఎస్పి ఆద్వర్యంలో ..సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ సందర్బంగా ..బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ ..తనకు మిగిలిన ఏకైక ఆస్తి ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి ,కవి ,డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య అని అన్నారు.కూరెళ్ల అందరివాడని, ఆయన సేవలు మనందరికీ అవసరమని అన్నారు.పెన్షన్‌ డబ్బులతో మహా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి.. లక్షల పుస్తకాలు సేకరించిన మహోన్నత వ్యక్తి విఠలాచార్య అని కొనియాడారు.చిన్నతనం నుంచే అనేక కష్టాలను చూసిన వ్యక్తి ,ఏడేళ్ల ప్రాయంలోనే రచనలు చేయడం ఆయనకున్న పట్టుదలకు నిదర్శనమన్నారు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక సాహితీ,విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన సహకారంతో అనేక మంది విద్యార్థులు ...పైకెదిగి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నారని తెలిపారు.తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది జీవితాన్నే సాహిత్యానికి అంకితమిచ్చిన డా.కూరేళ్ళ విఠలాచార్య ఈ ప్రాంత వాసులు కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ లభించడం, చాలా అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేడి సంతోష్, చిట్యాల మండల అధ్యక్షులు జోగు శేఖర్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్,రామన్నపేట మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, కొంగరి రాజా లింగం,మేడి నవీన్, కూరెళ్ల వ్యక్తిగత సహాయకులు తాటిపాముల స్వామి బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు

వలిగొండ ఎస్సై ని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా,

వలిగొండ మండల నూతన ఎస్సైగా, బాధ్యతలు స్వీకరించిన.. మహేందర్ ను బుధవారం రోజున జిల్లా కాంగ్రెస్ సినియర్ నాయకులు.. బత్తిని లింగయ్య, కాసుల వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిసి ...శాలువాతో సన్మానించారు.