వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ ని సన్మానించిన మండల భవన నిర్మాణ కార్మిక సంఘం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి , పుష్ప గుచ్చం అందజేసి ..శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సింగారపు వెంకటేశం, మండల కార్యదర్శి రాదారపు మల్లేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు సుక్క రామచంద్రు, పట్టణ అధ్యక్షుడు మల్గ కుమార్, పట్టణ కార్యదర్శి పోలేపాక శంకర్,మండల నాయకులు పల్లెర్ల రాజు,చేగూరి నాగేష్, పల్లెర్ల లక్ష్మయ్య, పొలేపాక జీడయ్య, శ్యామల సత్తయ్య, సింగారపు లక్ష్మయ్య, శ్యామల మల్లేశం, భవనిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ 75వ జయంతి వేడుకలు


వలిగొండ మండల కేంద్రంలో ,అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ 75వ జయంతి సందర్భంగా గద్దర్ ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గద్దర్ విప్లవ పార్టీ కార్యకర్త ,రచయిత, గాయకుడు ,గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ విప్లవ కవి ,ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీ కు గుర్తుగా తీసుకోవడం జరిగిందని అన్నారు.కళాకారులు మాట్లాడుతూ ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి.. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టా నష్టాలను ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజేసేవారు. ఆయన పాడిన పాటలకు మేము ఆకర్షితులమై కళాకారులంగా ఇప్పుడు మేము జీవిస్తూనే ఉన్నాము... ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ,వెనకబడ్డ కులాలకు ఎంతో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ఎస్సీ , ఎస్ టి, బీసీ ,మైనార్టీ సంఘాలు, రాజకీయ నాయకులు ,ఘనంగా జయంతిని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో కొత్త రామచందర్ ,మామిండ్ల రత్నయ్య, రవీందర్, పెరమండ్ల యాదగిరి ,సాయిని యాదగిరి, ఆకుల వెంకటేశం ,సత్తిరెడ్డి, కొండూరు సత్తయ్య, శీను, గోదా అచ్చయ్య ,పోలె పాక సత్యనారాయణ ,లోతుకుంట సర్పంచ్ బిక్షపతి ,కందుల అంజయ్య, బిక్షపతి, నరసింహ, పోలేపాక బిక్షపతి, పవన్ కుమార్ ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలైన ఇవ్వండి , నిరుద్యోగ భృతి నైనా కల్పించండి : సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు


అఖిలభారత విద్యార్థి సమాఖ్య-AiSF, అఖిలభారత యువజన సమాఖ్య-AiYF, ఉమ్మడి సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎల్లంకి మహేష్ గారి అధ్యక్షతన జరిగినది .ఈ సమావేశానికి *ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గోదాశ్రీ రాములు హాజరై మాట్లాడుతూ.... నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ,ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రధానంగా యువకులు ,విద్యార్థులు, లక్షలాదిమంది ఏలాంటి పనులు లేకుండా ఉన్నారని ..నిరుద్యోగులకు ఉద్యోగాలైన ఇవ్వండి లేదా వారికి నిరుద్యోగ భృతి 5000 రూపాయలు ,రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ ఈనెల 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యువజన,విద్యార్థి సంఘాలు అమలు కోసం ...చలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపు నిచ్చారు .అలాగే యాదాద్రి జిల్లాలో యాదాద్రి దేవాలయం నిధులతో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించాలని, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ,అలాగే రైతులు వ్యవసాయ కూలీలు సాగు త్రాగునీరు కోసం బూనాది గాని కాలువ, పిల్లాయిపల్లి కాలువలు కూడా పూర్తి చేయాలని, గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని ,మూసి ప్రక్షాళన త్వరగతిన పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ,మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం యువజన విద్యార్థి సంఘాలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విద్యార్థి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉప్పులశాంతి కుమార్, పెరబోయిన మహేందర్, వస్తువుల అభిలాష్,మమ్మద్ నయీమ్,సూరారం జానీ, సుద్దాల సాయికుమార్, మేడి దేవేందర్, మారుపాక లోకేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి, బద్దుల శ్రీనివాస్, బూడిద సాయి చరణ్, సునారి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ పై దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడి ఘటనలో , పక్షపాత ధోరణితో , దురుసుగా.. వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై.. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ డిజిపి కి బిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై , చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు... ఎల్ రమణ ,మాజీ శాసనసభ్యులు.. భాస్కరరావు, శానం పూడి సైది రెడ్డి , పైళ్ళ శేఖర్ రెడ్డి, కోరు కంటి చందర్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ,సిహెచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు


యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..

2018 ఆగస్టు 13వ తేదీ... ఆరేళ్ళ క్రితం దిలావర్‌పూర్ లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు..

మంత్రాల నెపంతో దిలావర్‌పూర్ కు చెందిన సీస యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు..

ఇద్దరు మహిళలతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా నాయస్థానం..

సీస యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన 15 మంది గ్రామస్తులు..

అందులో 

A 14 నిందితుడు చనిపోయాడు

మిగతా 14 మందికి జీవిత ఖైదు

*సీస యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచిన పోలీసులు...ఈ కేసు దర్యాప్తు విషయంలో అప్పటి మోటకొండూరు ఎస్సై గండికోట మధు, సిఐ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు.

మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని,యాదగిరిగుట్టడిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన అరూరు గ్రామస్తులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని..యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కి, అరూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

మత్స్యగిరిగుట్ట దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ ,అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కానీ ,ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక భక్తులు ముఖ్యంగా మహిళలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది .దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు ,నల్లగొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సులు లేక భువనగిరి వలిగొండలో నిలిచి పోతున్నారు.

యాదగిరిగుట్ట నుండి మచ్చ గిరి గుట్ట వరకు ఒక సెటిల్ బస్సు నడపాలని ,మేనేజర్ గారిని కోరడం జరిగింది .సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ అతి త్వరలో బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

వినతి పత్రం అందజేసిన వారిలో బండారు నరసింహారెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, లింగయ్య యాదవ్ మాజీ మచ్చ గిరి గుట్ట ధర్మకర్త,

ఆవుల సత్యనారాయణ వార్డు మెంబర్, జనుగల మల్లేష్ హై స్కూల్ చైర్మన్, ఆవుల అంజయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్,

పిట్టల సుధాకర్, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నార

వలిగొండ ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన మండల యూత్ కాంగ్రెస్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ,పదవీ బాధ్యతలు స్వీకరించిన మహేందర్ లాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించిన ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని నగేష్, పట్టణ యూత్ అధ్యక్షులు పుసుకూరి లింగస్వామి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు శ్యామల సాయికుమార్ ,యూత్ నాయకులు గొలుసుల దుర్గాప్రసాద్, వినేష్, కల్కూరి మధు, మైసొల్ల వేణు, పిట్టల శేఖర్ ,మత్స్యగిరి ,మైసోల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

గాయత్రి హైస్కూల్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు, విద్యార్థులకు అవగాహన కల్పించిన డిటిఓ రవీందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచుల సేవలు గుర్తిండిపోతాయి: ఎంపిటిసి సామ రామ్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం: ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువ లేనిదని ఎంపిటిసి సామ రాంరెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. ఎంపిటిసి పరిధిలోని వేములకొండ, ముద్దాపురం,వెంకటాపురం, గుర్నాథ్ పల్లి,నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచులను, వార్డు మెంబర్లను, ఈరోజుతో .. సర్పంచుల ముగిస్తున్నందున, మంగళవారం వేములకొండ గ్రామపంచాయతీ ఆవరణలో పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా... రాంరెడ్డి మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోడ లక్ష్మమ్మ బాలయ్య,ఉప్పల్ రెడ్డి, కొత్త నరసింహ, జువ్వ మంజుల సత్తయ్య, ఆయా గ్రామపంచాయతీ ల వార్డ్ మెంబర్లు ,గ్రామ నాయకులు పులిపలుపుల రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నిదాన్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.