భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని సన్మానించిన మాజీమంత్రి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారిని సూర్యాపేట శాసనసభ్యులు ,మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆదివారం సన్మానించారు .ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ , రవీందర్ కుమార్ ,భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల మహిపాల్ రెడ్డి , జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వలిగొండ ఎస్సై


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి డి మహేందర్ లాల్ ఆదివారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక యువతకు క్రీడల పట్ల సూచనలు చేస్తూ వారికి అవగాహన కలిగేలా కృషి చేస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. యువతలో ఎలాంటి చెడు ప్రభావాలు రాకుండా చర్యలు తీసుకుని

అవగాహన కల్పించాలని ఎస్సై కి సూచించారు.

బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా చెక్కును అందజేసిన పైళ్ల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే


హైదరాబాదులోని మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏ దుళ్ళ గూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలశెట్టి ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై మరణించడంతో బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా ద్వారా రెండు లక్ష రూపాయల చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.