మున్సిపల్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీసిన చనిపోయిన కోడి

కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి నిరసన వ్యక్తం చేశాడో వ్యక్తి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన యువకుడు.

అజీజొద్దీన్‌ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతూ కోడి కళేబరంతో మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లారు. గమనించిన కమిషనర్‌ వేణుమాధవ్‌, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో అజీజొద్దీన్‌ చేసేదేమీలేక కోడిని కమిషనర్‌ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి కొత్తపల్లి పట్టణ ప్రజల వాట్సాప్‌ గ్రూప్లఓ ఆడియోను విడుదల చేశారు.

గత మూడున్నరేండ్లుగా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం వీధి కుక్కల నుంచి ప్రజలను, కోళ్లను కాపాడాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు అని బాధితుడు వాపోయాడు.

మంగళవారం నా ఇంట్లోకి కుక్కలు చొరబడి కోడిని చంపేశాయి. ఒక వేళ పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? మీరే ఆలోచించుకోవాలి’ అంటూ ఆడియోలో పేర్కొన్నారు. ఆఫీసు గుమ్మానికి కోడిని వేలాడదీయడంపై కమిషనర్‌ వేణుమాధవ్‌ కరీంనగర్‌ సీపీతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే కోడి చనిపోయిందా? లేదా? అనే విషయమై విచారణ జరిపిస్తామని తెలిపారు...

Jallikattu Stadium: మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు.

జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం. స్టేడియంలో తొలిసారిగా ఆరువందల ఎద్దులు పోటీలకు సిద్ధమయ్యాయి. నాలుగు వందలమంది యువకులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

కొత్త జల్లికట్టు స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి పేరు పెట్టారు. ఈ గ్రామంలో రూ.44 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల మందికి పైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి జల్లికట్టు స్టేడియాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతంలో ప్రకటించారు..

ఈ స్టేడియంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు, మీడియాకు అవసరమైన సౌకర్యాలతో పాటు త్వరిత ప్రథమ చికిత్స, నిరంతర వైద్య సహాయాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఈ స్టేడియంలో ఉన్నాయి..

Rahul Gandhi: జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో అస్సాంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..

ఈ నేపథ్యంలో రాహుల్ భద్రతపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా( Amit Shah)కు లేఖ రాశారు. ఇటీవల చోటుచేసుకున్న భద్రతాపరమైన లోపాలను దానిలో ఎత్తిచూపారు.

భారత్‌ జోడో న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra) గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు వీటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని.. ఉద్రిక్తతకు దారితీసింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమయ్యారంటూ రాహుల్‌, ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రికి ఖర్గే లేఖ రాశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పార్టీ పోస్టర్లను చించివేయడం, భాజపా కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడం, నేతలపై దాడి చేయడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోలేదని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

హిమంత రిమోట్‌ అమిత్‌ షా చేతిలో..

'ద్వేషం, భయాన్ని అస్సాం ముఖ్యమంత్రి వ్యాప్తి చేస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం ఆయన. ఆయన కోరుకునేదే మీడియా చూపిస్తోంది. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నది హిమంత కాదు. దీని రిమోట్‌ అమిత్‌ షా చేతుల్లో ఉంది' అంటూ బుధవారం యాత్రలో భాగంగా రాహుల్ కార్యకర్తలతో మాట్లాడారు.

Hyderabad: సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు..

గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు..

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరిజిల్లా టీడీపీ నాయకులు.

ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 3రోజులు నిజం గెలవాలి కార్యక్రమం.

విమానాశ్రయానికి భారీగా చేరుకున్న జిల్లా నాయకులు, కార్యకర్తలు.

నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన.

చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ.

మొదటగా జగ్గంపేట నియోజకవర్గం, గుర్రపాలెం గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి..

సూర్యాపేట జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య?*

సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద అతడు మంగళవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది .

పెనపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆర్థిక సమస్యలతో కుటుంబ కలహాలు చెలరేగడంతోనే సదరు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు...

రేపు భారత్‌కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ రేపు భారత్‌కు చేరుకోనున్నారు.

ఈ సందర్బంగా ఆయన జైపూర్‌లోని ఆమెర్ కోట, హవా మహాల్‌ను సందర్శిం చనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్‌ ను సందర్శిస్తారు. జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.

చివరగా రాష్ట్రపతి భవన్‌లో రిసెప్షన్‌కు హాజరవుతారు.....

గడ్చిరోలి నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గ‌ల్లంతు

మహారాష్ట్రలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం నెల‌కొంది.

వైనగంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి.

చాముర్సి తాలుక ఘ‌ణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలో ఏరివేత కు వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

7 గురు వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.అయితే ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి.

ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం. గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణి కులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు.

సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది.

యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీక రించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన

ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.