చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు బదిలీ వేటు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్‌ అడ్రస్‌లా పీఎస్‌ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్‌ బాబు సస్పెండ్‌ చేశారు.

ఆయనను మల్టీజోన్‌-2కు అటాచ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, కానిస్టేబుల్ బీ. మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్‌లు ఐదు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు.

ఓ కేసులో నిందితుడి నుంచి రూ.3 లక్షలు లంచం వసూలు చేశారు.ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ముగ్గురు కాని స్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించింది.

ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్‌స్పెక్టర్ పసిగట్టక పోవడం, స్టేషన్‌లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైల మధ్య మాటామాటా పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది.

ఇలాంటి ఘటనలతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇన్‌స్పె పెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు..

YS Sharmila: ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం

వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు..

డేట్.. టైం.. వాళ్లు చెప్పినా... సరే.. నన్ను చెప్పమన్నా... సరే.. వస్తా.. అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని షర్మిల డిమాండ్ చేశారు..

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిలి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్‌లో ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మఒడి అందుతుందా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు..

నేడు అయోధ్య లో పోటెత్తిన భక్తులు

రాంల‌ల్లా ప్రాణ‌ప్ర‌తిష్ట వేడుక‌ల‌ను దేశ‌మంతా సంబురంగా జ‌రుపుకున్నారు. ప్ర‌ధాని ఇచ్చిన పిలుపుతో దీపాల‌ను వెలిగించి పూజ‌లు నిర్వ‌హించారు.

ప్రాణ‌ప్ర‌తిష్ట అనంత‌రం మంగ‌ళ‌వారం నుంచి భ‌క్తుల‌కు రాంల‌ల్లా ద‌ర్శ‌నం క‌ల్పించారు. తొలిరోజు బాల‌రామున్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు.

దీంతో అయోధ్య రామాల‌యమంతా జ‌న‌సంద్రోహంగా మారింది. జైశ్రీ‌రామ్ నినాదాల‌తో ఆల‌య ప్రాంగ‌ణం హోరెత్తింది.

కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు.

మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచు తారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చ‌ని, ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు..

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి❓️

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ, ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిం చినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌, కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.

ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించి నట్లు సమాచారం.

ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో కీలక నిర్ణయం

ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలోనే కొన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమావేశం కావాలని నిర్ణయించామని, త్వరలోనే ప్రభుత్వాని కి నివేదిక అందచేస్తామని ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ తెలిపారు.

సోమవారం సాయంత్రం సిసిఎల్ కార్యాలయంలో ధరణి కమిటీ సభ్యులు మూడోసారి ధరణి సమస్యలపై సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరణి కమటీ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భగా ముందుగా రేమండ్ పీటర్ మాట్లాడుతూ ‘ధరణి’ లొసుగులపై చర్చిస్తున్నా మని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటు న్నట్లు ఆయన పేర్కొన్నారు.

మీ సేవలో ఉన్న సమస్యలు, అగ్రికల్చర్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతా మన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు.

నివేదిక వచ్చాక ప్రభుత్వం ‘ధరణి’పై స్పందిస్తుందని రేమండ్ పీటర్ తెలిపారు. ధరణి పోర్టల్‌తో పాటు మెరుగైన భూ పరిపాలన అందించేందుకు అవసర మైన మార్పులను కూడా తాము అందిస్తామన్నారు.

అలాగే ఆర్‌ఓఆర్ 2020కి సవరణలు అనివార్యమని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లోని భూముల డేటాను క్రోఢీకరించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ మూడింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పడనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకేసారి నివేదికను అందించకుండా తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేర్వేరుగా మార్గాలను అందించనున్నట్టు ఆయన తెలిపారు.

ధరణి లేదా ఇతర ఏ సాఫ్ట్‌వేర్ అమలు చేసినా ఏదైనా అప్లికేషన్ చేస్తే ఆమోదించినా, తిరస్కరించినా సమాచారం రావాలి. ఎందుకు తిరస్కరించారో కూడా దరఖాస్తుదారుడికి సమాచారం అందాలి. ప్రతిదీ సర్వర్‌లో నిక్షిప్తం కావాలి. ధరణి పోర్టల్లో అలాంటి వ్యవస్థ ఉందా? లేదా? అన్నది పరిశీలిస్తున్నామన్నారు.

పార్లమెంటు ఎన్నికల లో పోటీ చేయనున్న బర్రెలక్క?

తెలంగాణలో నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది.బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకు దాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.

ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారు మ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చు కున్నారు.ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది.

ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి...

త్వరలో 20 మందికి నామినేటెడ్ పోస్టులు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషిచేసిన నేతలకు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజక వర్గం నుంచి సుమారుగా నా లుగు నుంచి ఐదు పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది.అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం.

త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కూడా వారి పేర్లకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించి నట్టుగా సమాచారం.

ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్‌ను కల్పి స్తూ అడ్వైయిజర్ పోస్టులు ఇవ్వగా, త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది.

టిపిసిసి, ఏఐసిసిల సమన్వయంతో పోస్టుల భర్తీ

మిగిలిన 30 నుంచి 40 పోస్టులను ఈనెలాఖరు లోగా మిగతా వారికి కేటాయించాలని సిఎం రేవంత్‌కు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సిఎం రేవంత్ పంపించిన జాబితాకు ఢిల్లీ నుంచి ఆమోదం ముద్రపడగానే ఆ జాబితాలోని పేర్లను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి....

నేటి నుంచి సామాన్యులకు బాల రాముడి దర్శనం

ఇవాళ్టి నుంచి అయోధ్య లోని బాలరాముని దర్శనం కలగనుంది. 24 అడుగుల దూరం నుంచి సాధారణ భక్తులు బాలరాముని దర్శనం చేసుకోనే అవకాశం. సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.

ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం

ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి

ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన

త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని తెలిపారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు.

ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించామని, ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఒక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు

వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం... రాముడే భారత్ విధానం... నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు... భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ" అంటూ ప్రధాని మోదీ వివరించారు.

Ayodhya Ram Mandir: నేడే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామమందిరం

అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది..

మహా ఘట్టానికి అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వని స్టార్ట్ అవుతుంది.

దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాలకు చెందిన వాయిద్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు.

ఇక ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12.29కి అభిజిత్‌ లగ్నంలో క్రతువు ప్రారంభం అవుతుంది. 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న 14మంది దంపతులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:25కి అయోధ్య చేరుకోనున్నారు.

ఈ క్రమంలో అయోధ్య రామాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రామ్‌లలా ప్రాణప్రతిష్ఠకు 7వేల మందికి ఆహ్వానాలు అందించారు. అతిథుల్లో 4వేల మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. వీఐపీల తాకిడితో అయోధ్యకి వందకి పైగా ఛార్టెర్డ్‌ విమానాలు, 12 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సాధువులు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు..