Ayodhya Ram Mandir: నేడే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామమందిరం

అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో.. ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది..

మహా ఘట్టానికి అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. కోట్లాది మంది చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మంగళ ధ్వని స్టార్ట్ అవుతుంది.

దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇప్పటికే 18 రాష్ట్రాలకు చెందిన వాయిద్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయంలో ఉపయోగించే అన్ని రకాల వాయిద్యాలు వాయిస్తారు.

ఇక ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12.29కి అభిజిత్‌ లగ్నంలో క్రతువు ప్రారంభం అవుతుంది. 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న 14మంది దంపతులు పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:25కి అయోధ్య చేరుకోనున్నారు.

ఈ క్రమంలో అయోధ్య రామాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రామ్‌లలా ప్రాణప్రతిష్ఠకు 7వేల మందికి ఆహ్వానాలు అందించారు. అతిథుల్లో 4వేల మంది స్వామీజీలు, 50 మంది విదేశీయులు ఉన్నారు. వీఐపీల తాకిడితో అయోధ్యకి వందకి పైగా ఛార్టెర్డ్‌ విమానాలు, 12 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సాధువులు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు..

PM Modi: సముద్ర స్నానం.. ప్రత్యేక పూజలు.. రామేశ్వరంలో ప్రధాని మోదీ..

రామేశ్వరం: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు..

అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థం (Agni Teertham)లో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.

రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు..

ప్రధాని మోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్‌ కాలారామ్‌ దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయుర్‌ ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి దేవాలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు. శనివారం తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రమాద బీమా పెంపు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

తమ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ప్రమాద బీమా పెంచింది. రూ.40 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ.1.12 కోట్లకు పెంచుతూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు శనివారం ఒప్పందం చేసుకున్నారు. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడు తూ.. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామమని అన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడు తుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధి కారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు.

గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.

సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని సజ్జనార్‌ తెలిపారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఉందని చెప్పారు.

ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ ఈ స్కీమ్‌ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందన్నారు.

యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని అధికారులకు సజ్జనార్‌ సూచించారు.

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. అయోధ్యలో శ్రీరామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.

జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాల యాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రాంగణాన్ని శుభ్రం చేసి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించు కున్నారు.

నవగ్రహ ప్రదక్షిణ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ తమిళిసై తన ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు మనోడే

అయోధ్య రామ మందిరం లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపే తంగా నిర్వహిం చేందుకు చకాచకా ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పూజలు ప్రారంభమయ్యాయి.

ఈ స‌మ‌యంలో మ‌రో సంచ‌ల‌న విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. 22 ఏళ్ల యువ‌కుడికి ఆయోధ్య‌ రామాల‌యం ప్ర‌ధాన అర్చ‌క పీఠం అప్ప‌గించ‌డం అది కూడా తిరుమ‌ల వేద విద్యాల‌యంలో విద్యా బుద్ధులు నేర్చుకున్న వ్య‌క్తి కావ‌డం ప్ర‌ధాన చ‌ర్చ‌గా సాగుతోంది.

1992 నుంచి అర్చ‌క బాధ్య‌తలు చూస్తున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కు 85 ఏళ్లు రావ‌డంతో కొత్త ప్ర‌ధాన అర్చ‌కుడిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆల‌య ట్ర‌స్ట్ ఆయ‌న‌కే అప్ప‌గిం చింది. ఈ మేరకు 2023లోనే యూపీ ప్రభుత్వం రామ మందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది.

దాదాపు 3 వేల మంది పూజారులు ప్రధానార్చకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, దరఖాస్తుల స్వీకరణలో కొన్ని షరతులు కూడా పెట్టారు. దరఖాస్తుదారుడి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. గురుకుల విద్యను అభ్యసించి ఉండాలని, శ్రీరాముడి దీక్షకు అర్హతను కలిగి ఉండాలని నిబంధనలు పెట్టారు.

దరఖాస్తులను వడబోసి అందులో రెండు వందల మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించగా.. అందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌కు చెందిన 22ఏళ్ల మోహిత్ పాండే కూడా ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు.

ఇంట‌ర్వ్యూ ప్యాన‌ల్‌లో మ‌హామ‌హులు..

ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా, అయోధ్యలోని మహంత్ మిథిలేష్, నంది శరణ్, సత్యనారాయణ్ దాస్ ఉన్నారు. వారంతా వేదాల నుంచి ఆరాధనా పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు.

అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఆరంభించారు. ఈ సందర్భంగా వారు దరఖాస్తుదారులను శ్రీరాముడి పూజలకు సంబంధించిన ప్రశ్నలు, సంధ్యా వందనం అంటే ఏంటి, పూజ పద్ధతులు, కర్మకాండ అంటే ఏంటి, రాముడి పూజకు ఎలాంటి మంత్రాలు పఠిస్తారనే ప్రశ్నలు సంధించారు.

ఇంటర్వ్యూకి వచ్చిన 200 మందిలో చివరకు 21 మందిని అర్చ‌కులను ఎంచుకున్నారు. అందులో ఒక ప్రధాన అర్చక పదవితో పాటు 20 మంది సహాయ అర్చకులను ఎంచు కున్నారు.

ఎంతోమంది అనుభ‌వ‌జ్ఞులున్నా..

వారందిరిలోనూ చర్చకు వస్తున్న పేరు మోహిత్ పాండే. కేవలం 22 ఏళ్ల వయసు గల మోహిత్ రామ మందిర ప్రధానా ర్చకుడిగా నియమించ బడ్డాడనే వార్త సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మోహిత్ తన కంటే ఎంతో పెద్ద పండితులను, అను భవం ఉన్న పూజారులను ఓడించాడు.

ప్యానెల్ మెంబర్లను సైతం మెప్పించాడు. ప్రస్తుత ఆలయ అర్చకుడు సత్యేంద్ర దాస్ మన్ననలు పొందాడు. మోహిత్ తాను పదేళ్ల వయసులోనే రామాయణం, మహాభారతం లాంటి వేదాలను పఠించడం ప్రారంభించాడు. 2020-2021 విద్యా సంవత్సరంలో ఘజియాబాద్‌లోని దుదేశ్వర్ వేద్ విద్యా పీఠ్‌లో తన పదో తరగతి విద్యను పూర్తి చేశాడు.

ఎస్.వీ.వీ.యూ బీఏ ప్రోగ్రాంలో చేరాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యా లయం ఎంఏ డిగ్రీ చదివి పీహెచ్‌డీకి సిద్ధం అవుతు న్నాడు.

ఇక ప్రస్తుతం ఆలయ ప్రధానార్చకుడిగా సత్యేంద్ర దాస్ కొనసాగుతుండగా, శిక్షణ అనంతరం మోహిత్ పాండే అయోధ్య రామ మందిర ప్రధానార్చకుడిగా బాధ్యతలను స్వీకరించను న్నాడు. మార్చిలో ప్ర‌ధాన అర్చ‌క భాద్య‌త‌లు చేప‌ట్ల‌నున్న‌ట్లు స‌మాచారం..

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు.. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలు

అయోధ్యలోని శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాల కానుక రథం శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పాటు హిందూ సంఘాల నాయకులు రథానికి ఘన స్వాగతం పలికారు.

ముత్యాల తలంబ్రాల కలశాన్ని ఎమ్మెల్యే తలపై ఎత్తుకొని స్థానిక శ్రీరామ చంద్ర గోపాలకృష్ణ మఠం వరకు తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

మహిళలు హారతులతో స్వాగతం పలికారు. జనవరి 22న అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉంది, కాబట్టి ఆ రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారి కంగా సెలవు ప్రకటించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‌ఘడ్ : మరోసారి ఎదురుకాల్పులతో ఛత్తీస్‌ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి..

అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు తెగబడ్డారు.

ఇరువురి మధ్య జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు పోలీసుల నుంచి తప్పించుకుని అటవీప్రాంతంలోకి పారిపోయారు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

Chandrababu: మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే రాష్ట్రం అంధకారమే: చంద్రబాబు

మండపేట: వైకాపా ప్రభుత్వం మరోసారి వస్తే రాష్ట్రం అంధకారమేనని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. శనివారం కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన 'రా..కదలిరా' బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆక్వారంగాన్ని ఆదుకుంటాం, రాయితీపై విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

వైకాపా పాలనలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టు బాటు ధర ఇవ్వరని ధ్వజమెత్తారు..

''కోనసీమ జిల్లా పచ్చని అందాలకు, అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే ప్రాంతం ఇది. పంటలకు సాగునీరు ఇచ్చిన కాటన్‌ దొరను ఇప్పటికీ పూజిస్తారు.

ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇక్కడి వారే. కాలువలు బాగు చేయకుండా పంటలను ముంచేశారు. పోలవరం పూర్తి చేసి ఉంటే జిల్లాకు సాగునీరు అందేది. తెదేపా పాలనలో ఆక్వారంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారు. అనేక హామీలు ఇచ్చి ఆక్వా రైతులను జగన్‌ మోసం చేశారు'' అని చంద్రబాబు విమర్శించారు..

500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య చాలా రేగిన చిన్నపాటి వివాదం ఆ ఇరువురి ప్రాణాలను బలి తీసుకుంది......

కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్ లో నివసిస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ మధ్య 500 రూపాయల విషయమై చిన్నపాటి గొడవ మొదలైంది.. భార్య 500 అడిగితే ఇవ్వలేదని తాగిన మైకంలో భార్య మీద కోపంతో రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా. అది గమనించిన భార్య కనకదుర్గ వెంటనే ఆ విషయాన్ని కుమారుడు కు వివరించడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు.

విషయం తెలుసుకున్న కుమారుడు హుటాహుటిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ కారులో హాస్పటల్కు తీసుకువెళ్లగా అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. తండ్రి మరణ వార్తను కుమారుడు తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయగా. , భర్త మరణ వార్త విన్న కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన కొడుకు తన తల్లినైన కాపాడుకోవాలని ఉద్దేశంతో వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరికి మరియు బంధువులకు తెలియజేయగా బంధువుల పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకేరోజు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుగు పొరుగువారు ఈ ఘటనతో శోకసముద్రంలో మునిగారు.

Minister Ponguleti: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తా

హనుమకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) హెచ్చరించారు..

శనివారం నాడు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌పై మేజర్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితిపై కూడా చర్చించామన్నారు..

మేడారం మహాజాతరకు 105కోట్లు ఇస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భటాలు మాత్రమేనని.. వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. నాడు మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు. భూ కబ్జాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు..