ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే

సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ సర్కార్‌లను నిలదీస్తోంది

కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలీ డే ఇచ్చాయి. ఆ హోలీ డే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి.

అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోరాటం చేస్తోంది బీజేపీ. సమస్యల గురించి కాకుండా సెలవుల కోసం యుద్ధం ప్రకటించింది. అయితే అది స్టూడెంట్స్‌ కోసం కాదు. రామ భక్తుల కోసం.. ఏపీ, తెలంగాణ సర్కార్‌లపై సమరానికి సై అంటూ సీరియస్‌ అవుతోంది.

ఈ నెల 22న అయోధ్య లోని దివ్య భవ్య నవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టతో కొలువుదీరను న్నాడు బాల రామయ్య. దీంతో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

కొన్ని రాష్ట్రాల్లో సెలవు దినం.ప్రకటించింది. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు.

అయితే ఆ హోలీ డే నాడు తెలుగు రాష్ట్రాలు హాలీ డే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతు న్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాలను కోరుతోంది కాషాయ పార్టీ.

సమయం లేదు మిత్రమా సెలవు ఇస్తారా, సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తోంది, బిజెపి పార్టీ...

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించు కుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, శుక్రవారం శ్రీవారి 69,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 26,034 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి..

కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

థేమ్స్ తరహాలో మూసినది అభివృద్ధి

రుజ్జీవన ప్రణాళికలపై లండన్‌లో థేమ్స్ రివర్ పాలక మండలితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు.

లండన్‌లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.

దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడికా ర్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సిఎంకు వివరించారు.

అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలను ఈ సందర్భంగా వారు చర్చించారు.

విజన్ 2050’కు అనుగుణంగా ప్రాజెక్టు

అక్కడి ‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి.

హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.

పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్ వై భవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా భావించారు..

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు..

అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు..

అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు..

ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో జనసమీకరణ చేస్తున్నారు..

పలువురు YCP నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రేపు అయోధ్యకు బయల్దేరుతారు..

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది..

ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ఇస్తోంది. దీక్షపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రంతా దీక్షా ప్రాంగణంలోనే పోలీసులు బస చేశారు..

ఫంక్షన్ హాలు ఖాళీ చేయించాలని యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నది పోలీసులేనని సమత సైనిక్ దళ్ ఆరోపిస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు కోడికత్తి శ్రీను సైతం విశాఖ జైలులో మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్నాడు.

జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని శ్రీను కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇవాళ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నిన్న దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. నిన్న పోలీసులకు, సమతా సైనిక్ దళ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది..

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్ షేక్ అవతార మెత్తారు.

దుబాయ్‌లో పర్యటిస్తున్న ఆయన.. ఎడారిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ టేరైన్ వెహికిల్‌ను జోష్‌తో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూత్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మల్లన్న.. ఎన్నికల తర్వాత రిలాక్స్ అవడానికి టూర్లు వేస్తున్న మాజీ మంత్రి.. ఆయనతో పాటు ఎన్నికల్లో కష్టపడ్డ కింది స్థాయి నేతలను కూడా తనవెంట తీసుకెళ్ళారు.

గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాల్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో మరణించిన వారిని నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయు లు(50)లుగా పోలీసులు గుర్తించారు.

గద్వాలలో పుట్టినరోజు వేడుకలకు హాజరై గద్వాల్ నుంచి వెర్రవెల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 22న సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

అయోధ్యలో రామ్ మందిర్‌లో విగ్రహం మహా ప్రతిష్ఠాపన జరగనున్న రోజు సోమవారం (22న) సెలవు దినంగా మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది.

హోమ్ మంత్రిత్వశాఖ కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ 22న సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ఉత్తర్వులో తెలియ జేసింది.

రామ్ మందిర్‌లో ‘ప్రాణ్ ప్రతిష్ట్’ సందర్భంగా దేశం అంతటా తన కార్యాల యాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు 22న అర రోజు సెలవు ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

అదే సందర్భంలో 22న తన కార్యాలయాలు అన్నిటినీ మూసివేయనున్నట్లు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

కాగా, సోమవారం అర రోజు సెలవును హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకి

అయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది.

దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో ధ్యలోకి అనుమతించరు.

కాగా అంతకుముందు జనవరి 18న‌ వివేక్ సృష్టి ట్రస్ట్ నుండి రాంలాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాల యానికి తీసుకువచ్చారు.

విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం లోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. జనవరి 16 ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి.

వేడుక ప్రధాన కార్యక్రమం జనవరి 22 న జరుగుతుంది.