కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు.

ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగు పెట్టబోతున్నారు. వైఎస్ జగన్ కు అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో.. తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదంటే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది.

రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు ఈ కరెంటు కోతలు విధిస్తున్నట్లు పేర్కొంది.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా డిమాండ్ ను తట్టుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పవర్ లైన్లు, సబ్ స్టేషన్లలో రొటేషన్ పద్ధతిలో నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు టిఎస్ఎస్ పిడిసిఎల్ తెలిపింది.

ఏయే ప్రాంతాల్లో ఏ రోజు కరెంటు కోత అమలవు తుందో తెలుసుకునేందుకు టిఎస్ఎస్ పిడిసిఎల్ వెబ్ సైట్ ను చూడవచ్చు.

కరెంటు కోతలవల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ పేర్కొన్నారు.

నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, అవసరమైతే కొత్త విద్యుత్ లైన్లు వేస్తామని ఆయన వివరించారు.

ఒక్కొ ఫీడర్ కు ఒక్కొ రోజు మాత్రమే కరెంటు కోతలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

జల్లికట్టు క్రీడలో45 మంది యువకులకు గాయాలు

త‌మిళ‌నాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.

పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవనీయ పురం జల్లికట్టు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జ‌ల్లిక‌ట్టులో ఎద్దులు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌కుల‌ను అవి కుమ్మి వేశాయి.. అంత‌కాకుండా బ‌రిలోంచి బ‌య‌ట‌కు రంకెలేస్తూ దూకి ప్రేక్ష‌కుల మీద నుంచి దూకిపారి పోయాయి.. దీంతో ఇద్దర పోలీసుల‌తో స‌హా 45 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.

ఇది ఇలా ఉంటే అవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు కోసం వెయ్యి ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. ఈ పోటీ ప్రాంగణం దగ్గర 8వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

వైద్య సేవలు అందించడా నికి 20 మెడికల్ టీమ్ లను సిద్దంగా ఉంచారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో ఈసారి మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటు న్నారు...

అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు

అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి.

తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు తలుపులు బిగించారు. దీంతో పాటు మొత్తం ఆలయంలో 14 బంగారు తలుపులు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 18న రాముడి విగ్రహం గర్భగుడికి చేరుకోనుంది.

ప్రముఖ కంపెనీల దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డిభేటీ

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుం టున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేం దుకు తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖు లతో కీలక చర్చలు జరిపింది.

దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనా మిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండ్ తో సమావేశమ య్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వా హకులు, ఇతర ప్రముఖుల తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.

అనంతరం, ఇథియోఫియా ఉప ప్రధాని డెమెక్ హసెంటోతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న కార్యాచరణపై చర్చించారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ తో సమావేశమయ్యారు..

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా..

ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రూ.160-180 మధ్య ఉన్న ధర ఈరోజు రూ.200లకు చేరింది.

ఏపీలోని చాలా ప్రాంతాల్లో కూడా రూ.200-230 మధ్య చికెన్ ధర కొనసాగుతోంది.

రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్‌ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ పర్యటించనున్నారు.

ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్న మెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనర సింహారావు తదితరులు పాల్గొంటారు...

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా?

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన కవిత విచార ణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.

ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని.. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను విచారణకు హాజరుకాకూడ దని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపారు. గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

మహిళలను ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే గతేడాది మార్చి లోనే కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు పలుమార్లు విచారించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌కు సంబంధిం చిన వ్యవహారాల్లో కవిత లీడ్‌ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కవిత విచారణకు రానని తేల్చిచెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్‌ చేస్తారా లేక విచారణకు రావాల్సిందేనని మరోసారి నోటీసులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది...

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలస ముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదా యాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్) 74, 75వ బ్యాచ్ ల ట్రైనీ ఆఫీసర్లతోనూ, రాయల్ సివిల్ సర్వీస్ ఆఫ్ భూటాన్ ట్రైనీ ఆఫీసర్లతోనూ మాట్లాడనున్నారు

మోదీ తన పర్యటన సందర్భంగా NACIN క్యాంపస్ లోని పురాతన వస్తువుల అక్రమ రవాణా అధ్యయన కేంద్రం, నార్కోటిక్స్ అధ్యయన కేంద్రం, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్ లను సందర్శించనున్నారు.

NACIN ప్రాంగణంలో మోదీ ఓ మొక్కను నాటనున్నారు. అక్కడి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించ నున్నారు..

కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించనున్నారు.

కాగా, రాష్ట్ర విభజన చట్టం-2014 కేటాయింపుల్లో భాగంగా ఏపీకి NACIN అకాడమీని కేటాయించారు.

ఈ అకాడమీ నిర్మాణానికి 2015లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. NACINకి దేశంలోనే ఇది రెండో క్యాంపస్. దీన్ని రూ.730 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది..

ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది..