AP News: ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలుపునకు వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసేందుకు ప్రణాళికలు రచించారని సమాచారం.

సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఆనం, కోటంరెడ్డి భేటీతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్‌ చోటు చేసుకుంది..

చెత్త కుప్పలో శిశువు

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో అమాన‌వీయ ఘ‌ట‌న శనివారం చోటు చేసుకుంది.

అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో ప‌డేశారు. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

ప్రాణాల‌తో ఉన్న మ‌గ శిశువును పోలీసులు నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు.

శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు..

ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వేలకొద్దీ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. మార్చి 2021లో జరిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ ఓట్లు పోలయ్యాయని లేఖలో ఫిర్యాదు చేశారు.

EPIC కార్డుల డిజిటల్ ప్రింట్‌ అవుట్ల డేటాను కూడా సమర్పించారని.. అందులో 35000 ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని తేలిందన్నారు. డీఈవో ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేశారని పురంధరేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు..

ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిట

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. సికింద్రా బాద్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నం, ఇంటర్‌సిటీ, వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్లు చేయిం చుకున్నారు.

వాటిల్లోకి సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తుం డడంతో రిజర్వేషన్‌ తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట

మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో బస్సుల్లో 1.6 లక్షల మంది ప్రయా ణాలు సాగిస్తే రెండు రోజు లుగా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు జిల్లాలకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ, తెలంగాణ జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు గురువారం రాత్రి 8 గంటల వరకు 975 ప్రత్యేక బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తెలిపారు.

రాత్రి 12 గంటల వరకు 1250 బస్సులు జిల్లాలకు వెళ్లే అవకాశముందన్నారు. శనివారం రద్దీ మరింత పెరిగితే బస్సుల సంఖ్య పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహా లక్ష్మి పేరుతో మహి ళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆయా బస్సుల్లో ప్రయాణానికి పోటీ పడుతున్నారు.

శివారు ప్రాంతాల నుంచే పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడు పుతోంది. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.

ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు చెల్లించి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు క్యూ కట్టారు. ఏపీ, తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులతో మియాపూర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం సమస్యలు నెల కొన్నాయి.

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్‌ వెళ్లి పశ్చిమ బెంగాల్‌ ఎంపీ ఖాన్‌చౌదరికి ఫిర్యాదు చేశారని చెప్పారు.

దీనిపై ఇతర రాష్ట్రాల ఎంపీలు స్పందించినా అనంతపురం జిల్లా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికేనా ఖాకీ డ్రస్సు ఇచ్చిందంటూ నిలదీశారు. సిగ్గులేని ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా.. సీఎం స్పందించడం లేదంటే దీంట్లో ఆయనకూ భాగం ఉందని ఆరోపించారు..

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

''సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ.

తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి..

Chandrababu: స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు

అమరావతి: జగన్‌ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు..

వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాల్ని చీకటిమయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుక్రవారం ఓ ప్రకటనలో భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

''మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయిచేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం'' అని చంద్రబాబు తెలిపారు..

Crime News : భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు!

అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే..

స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని సింధు ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు..

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద నాగార్జునను సింధు బంధువులు కొట్టిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీ పంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు.ఆటో, బైక్ పై వెళ్తున్న పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.