నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 15:01

ఆ భరోసాతోనే ప్రతి ఇంటా సంక్రాంతి: సీఎం జగన్‌ పండుగ శుభాకాంక్షలు

గుఃటూరు : రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

''సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ. గ్రామానికి నూతన శోభను తెచ్చే పండుగ. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన పాడిపంటల పండుగ.

తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్ళి, తమ కుటుంబ, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ. భోగి మంటలు.. రంగ వల్లులు.. హరిదాసుల కీర్తనలు. గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు. రైతు లోగిళ్ళలో ధాన్యం రాసులు.. పిండి వంటల ఘుమఘుమలు. బంధు మిత్రుల సందళ్ళతో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:43

Chandrababu: స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతికి సంకల్పిద్దాం: చంద్రబాబు

అమరావతి: జగన్‌ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు..

వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాల్ని చీకటిమయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుక్రవారం ఓ ప్రకటనలో భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

''మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయిచేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం'' అని చంద్రబాబు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:35

Crime News : భార్య ఆత్మహత్య.. భర్తను కొట్టిచంపిన బంధువులు!

అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు చంపారు. వివరాల్లోకి వెళ్తే..

స్థానికంగా ఉంటున్న సింధు, నాగార్జున మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని సింధు ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు..

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆమె మృతి చెందింది. అనంతరం మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద నాగార్జునను సింధు బంధువులు కొట్టిచంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:33

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీ పంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు.ఆటో, బైక్ పై వెళ్తున్న పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:32

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:30

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా

ప్రైవేటు బ‌స్సుల‌పై ర‌వాణ శాఖ అధికారులుఈరోజు దాడులు నిర్వ‌హించారు.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా అధికారుల ఆదేశాల మేర‌కు ఎల్బీ న‌గ‌ర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సుల‌ను త‌నిఖీ చేశారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్డ‌ల‌పై తిరుగుతున్న 15బ‌స్సుల‌పై కేసు న‌మోదు చేశారు.

నిబంధ‌న‌ల‌ను పాటించ‌ కుండా ప్రైవేటు టావెల్స్ ఇష్టానుసారంగా వ్య‌వ‌ హ‌రిస్తున్నాయ‌ని, క‌నీసం ఫైర్ సెఫ్టీని కూడా పెట్టు కోవ‌డం లేద‌ని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాం ప్రసాద్ తెలిపారు.

నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:28

Raghurama: నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు..

మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ''నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు'' అని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:13

తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా కంటే కేశవ గౌడ్

నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరచినట్టుగా ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ సామాజిక వర్గం వారిని ఎస్టీలుగా గుర్తించి నాటి తెలంగాణ ప్రభుత్వం G.o.No 5/2014 తీసుకొచ్చి ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ్స్ ని ఎస్టీలుగా ప్రకటించింది కానీ అట్టి G.o నీ అధికారులు అమలు చేయలేదు..

ప్రభుత్వం ప్రకటించిన జీవోని అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గౌడ బిడ్డలను ఎస్టీలుగా గుర్తించాలని పోరాడుతున్న కంటే కేశవ గౌడ్ ని తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.

ఈ సందర్భంగా కంటే కేశవ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెప్పినారు.....

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 13:25

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై

రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు ఈరోజు శనివారం నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.

శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదు చ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:50

నేడు చంద్రబాబు ఇంటికి షర్మిల

ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళనుంది. వైఎస్ షర్మిల కలవనున్నారు.

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందచేయ నున్నారు.

ఇందులో భాగంగానే చంద్ర బాబును కూడా ఆమె కలసి నిశ్చితార్ధానికి, వివాహానికి రావాలని కోరనున్నారు. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతు న్నారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది..