గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
స్కానింగ్ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తెలిసింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ.. హైరిస్కు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సూచించారు.
ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగు తుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్ చేసి విషయం తెలిపారు.
ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెం ట్‌ను ఆదేశించారు.
ఆ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్ చేశారు.
ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా.. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలక డగా ఉంది. ప్రభుత్వాసు పత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో శుక్రవారం సాయంత్రం చోటుచేసు కుంది.
Jan 13 2024, 14:33