నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:32

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:30

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా

ప్రైవేటు బ‌స్సుల‌పై ర‌వాణ శాఖ అధికారులుఈరోజు దాడులు నిర్వ‌హించారు.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా అధికారుల ఆదేశాల మేర‌కు ఎల్బీ న‌గ‌ర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సుల‌ను త‌నిఖీ చేశారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్డ‌ల‌పై తిరుగుతున్న 15బ‌స్సుల‌పై కేసు న‌మోదు చేశారు.

నిబంధ‌న‌ల‌ను పాటించ‌ కుండా ప్రైవేటు టావెల్స్ ఇష్టానుసారంగా వ్య‌వ‌ హ‌రిస్తున్నాయ‌ని, క‌నీసం ఫైర్ సెఫ్టీని కూడా పెట్టు కోవ‌డం లేద‌ని రవాణా శాఖ అధికారి ఆనంద్ శ్యాం ప్రసాద్ తెలిపారు.

నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:28

Raghurama: నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు..

మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ''నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు'' అని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:13

తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా కంటే కేశవ గౌడ్

నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరచినట్టుగా ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ సామాజిక వర్గం వారిని ఎస్టీలుగా గుర్తించి నాటి తెలంగాణ ప్రభుత్వం G.o.No 5/2014 తీసుకొచ్చి ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ్స్ ని ఎస్టీలుగా ప్రకటించింది కానీ అట్టి G.o నీ అధికారులు అమలు చేయలేదు..

ప్రభుత్వం ప్రకటించిన జీవోని అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గౌడ బిడ్డలను ఎస్టీలుగా గుర్తించాలని పోరాడుతున్న కంటే కేశవ గౌడ్ ని తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.

ఈ సందర్భంగా కంటే కేశవ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెప్పినారు.....

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 13:25

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై

రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు ఈరోజు శనివారం నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.

శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదు చ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:50

నేడు చంద్రబాబు ఇంటికి షర్మిల

ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళనుంది. వైఎస్ షర్మిల కలవనున్నారు.

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందచేయ నున్నారు.

ఇందులో భాగంగానే చంద్ర బాబును కూడా ఆమె కలసి నిశ్చితార్ధానికి, వివాహానికి రావాలని కోరనున్నారు. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతు న్నారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:22

గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తెలిసింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ.. హైరిస్కు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు.

ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగు తుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు.

ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెం ట్‌ను ఆదేశించారు.

ఆ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు.

ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా.. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలక డగా ఉంది. ప్రభుత్వాసు పత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో శుక్రవారం సాయంత్రం చోటుచేసు కుంది.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:02

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు.

ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది.

10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగా పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయో ధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 18:12

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం

వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ట్రైన్ లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 77కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు.. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 16:11

ప్రజా భవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

ప్రజాభవన్‌ వద్ద ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు.

పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్మికులు తరలివచ్చారు.

కాగా, ప్రజావాణి కార్య క్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్ల వారుజాము నుంచే ప్రజా భవన్‌ వద్ద బారులు తీరారు.

ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు.