నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 14:13

తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా కంటే కేశవ గౌడ్

నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందపరచినట్టుగా ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ సామాజిక వర్గం వారిని ఎస్టీలుగా గుర్తించి నాటి తెలంగాణ ప్రభుత్వం G.o.No 5/2014 తీసుకొచ్చి ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ్స్ ని ఎస్టీలుగా ప్రకటించింది కానీ అట్టి G.o నీ అధికారులు అమలు చేయలేదు..

ప్రభుత్వం ప్రకటించిన జీవోని అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గౌడ బిడ్డలను ఎస్టీలుగా గుర్తించాలని పోరాడుతున్న కంటే కేశవ గౌడ్ ని తెలంగాణ గౌడ యువజన సంఘం ఏజెన్సీ ప్రాంత రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.

ఈ సందర్భంగా కంటే కేశవ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ యువజన సంఘాల జేఏసీ చైర్మన్ & రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెప్పినారు.....

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 13:25

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై

రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు ఈరోజు శనివారం నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.

శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదు చ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:50

నేడు చంద్రబాబు ఇంటికి షర్మిల

ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళనుంది. వైఎస్ షర్మిల కలవనున్నారు.

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందచేయ నున్నారు.

ఇందులో భాగంగానే చంద్ర బాబును కూడా ఆమె కలసి నిశ్చితార్ధానికి, వివాహానికి రావాలని కోరనున్నారు. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతు న్నారు.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:22

గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తెలిసింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ.. హైరిస్కు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు.

ఆర్థిక స్తోమత లేకపోవడం, గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరుగు తుందన్న భయంతో ఆమె కుటుంబసభ్యులు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఫోన్‌ చేసి విషయం తెలిపారు.

ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెం ట్‌ను ఆదేశించారు.

ఆ వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు.

ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా.. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలక డగా ఉంది. ప్రభుత్వాసు పత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో శుక్రవారం సాయంత్రం చోటుచేసు కుంది.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 09:02

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు.

ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్ర వారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది.

10.50 గంటలకు కాచి గూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగా పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయం త్రం 4.25 గంటలకు అయో ధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 18:12

వికారాబాద్ లోభారీగా గంజాయి స్వాధీనం

వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ట్రైన్ లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 77కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు.. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 16:11

ప్రజా భవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

ప్రజాభవన్‌ వద్ద ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు.

పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున కార్మికులు తరలివచ్చారు.

కాగా, ప్రజావాణి కార్య క్రమానికి అర్జీదారులు పోటెత్తారు. సమస్యల పరిష్కరణకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్ల వారుజాము నుంచే ప్రజా భవన్‌ వద్ద బారులు తీరారు.

ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 16:07

ఓడిన మేము ప్రజల వెంటే ఉంటాం : ఎమ్మెల్యే హరీష్ రావు

ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నది. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు

మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హ‌రీష్ రావు.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిం చుకోవడం చాలా సంతోషం గా ఉందన్నారు.ఇక కాంగ్రెస్ నేత‌ల తీరును ఎండ‌గ‌డు తూ, కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నా రని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవే ర్చాలన్నారు.

బీఆర్‌ఎస్ చేసిన అభివృ ద్ధిని కక్షతో అడ్డుకుంటు న్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని తేల్చి చెప్పారు..

తెలంగాణ కెసిఆర్ తేవ‌డం వ‌ల్లే ప‌థ‌కాలు వ‌చ్చా యి..నీళ్లు వ‌చ్చాయి..

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని అన్నారు..

కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్‌ను తెలం గాణను ఎవరూ వేరు చేయలేరు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామాలు అభివృద్ధి చెందినయి. తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్ వచ్చింది,

రైతుబంధు, రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్‌ అని గుర్తు చేశారు.

ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం. వారి పక్షాన పోరాడతామని పేర్కొ న్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు. బట్ట కాల్చి బీఆర్ ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెం బ్లీలో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.

ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:56

నేడు మళ్లీ ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.

పార్టీ సమావేశాలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఈ రోజు రాత్రి లోపు సమావేశం కాను న్నారు.

అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నా రు. ఆదివారం ఉదయం భారత్ జోడ్ న్యాయ్ యాత్రలో పాల్గొంటారు.

స్విట్జర్లాండ్ లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొంటారు. పది రోజుల తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నారు

నిజంనిప్పులాంటిది

Jan 12 2024, 14:54

Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health ministry) శుక్రవారం వెల్లడించింది..

ప్రస్తుతం దేశంలో 3,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,446) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.