Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు
దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health ministry) శుక్రవారం వెల్లడించింది..
ప్రస్తుతం దేశంలో 3,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.
ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,446) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Jan 12 2024, 14:56