Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు

దేశంలో గత 24 గంటల వ్యవధిలో 609 కరోనా కొత్త కేసులు (Coronavirus) బయటపడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health ministry) శుక్రవారం వెల్లడించింది..

ప్రస్తుతం దేశంలో 3,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,412కి చేరింది. ఇక కరోనా వైరస్‌ నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,44,84,162 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,446) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు

మధ్యప్రదేశ్ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పునిచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఈ మేరకు జస్టిస్ షీల్ నాగ్, వినయ్ సరాఫ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ తీర్పును వెల్లడించింది...

నేటినుండి తెలంగాణ స్కూళ్లకు సెలవులు

తెలంగాణలో నేటి నుండి సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు.. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి.

కాగా.. జనవరి 13వ తేదీ 2వ శనివారం కాగా.. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలు ఉన్నాయి. దీంతో ఆరు రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ వచ్చాయి.

మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది.

అలాగే.. ఈనెలలో జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోరెండు రోజులు వరుస సెలవులు విద్యార్థులకు రానున్నాయి...

వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు

చర్చనీయ వంశంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి.

శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈరోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. సినిమా విడుదల ఆగి పోవడం వల్ల కోట్ల రూపా యల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.

ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపి వేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే...

తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని 16 నెంబరు మూలమలుపు వద్ద ఈరోజు ఉదయం ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సు డీ కొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది.

మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి గా పోలీసులు గుర్తించారు.

ఈరోజు తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహ నంలో త్రిబుల్ రైడింగ్ తో వస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం.జరిగినట్టు తెలిసింది.

తీవ్ర గాయాలైన జ్యోతి అనే మహిళ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించ గా.పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పండంటి బిడ్డను ప్రసవించిన సంఘటన గురువారం కర్నాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లా బాగేపల్లి గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుమకూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షయల్ పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. విద్యార్థిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు.

కడుపులో నొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా కడుపులో బిడ్డ ఉందని గుర్తించడంతో పాటు ఎనిమిది నెలల అని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

నొప్పులు ఎక్కువ కావ డంతో మగ బిడ్డకు బాలిక జన్మనిచ్చింది. వైద్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సీనియర్ విద్యార్థి పేరు చెప్పింది.

సదరు విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను కాదని చెప్పడంతో మరో విద్యార్థి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించారు.

బాలిక చెబుతున్న మాటల్లో నిలకడలేకపోవడంతో విచార చేసి బాధ్యులిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాధి కారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వార్డెన్ ను సస్పెండ్ చేశారు.

తెలంగాణలో కొనసాగుతున్న అవిశ్వాస తీర్మానాల పర్వం

రాష్ట్రంలో అధికారం మారడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు తమ పద వులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరుతు న్నారు.

ప్రతి జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో రాజకీయం వేడెక్కింది. పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం సభ్యులు మద్దతు తెలుపడంతో అవిశ్వాసం వీగిపోయింది.

జెడ్పీటీసీలు. గత ఏడాది డిసెంబర్ 28న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మెజార్టీ జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. అయితే నిన్న ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీ టీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు. ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరగా.. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

మెజార్టీ సభ్యుల అసమ్మ తితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపా లిటీలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీ నామా చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఛైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతకే మద్దతు తెలపాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిసైడ్‌ అయ్యారు. దీంతో అవిశ్వా స తీర్మానం వీగిపోనుంది.

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై 11 మంది సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వి.వెంకటా యపాలెం సొసైటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు కూరాకుల నాగ భూషణం. సహకార శాఖ అధికారికి అవిశ్వాస తీర్మాన లేఖను అందజేశారు.

సహకార సంఘం చట్టం ప్రకారం సహకార సంఘంలో ఉన్న సభ్యులకు నోటీసులు ఇచ్చి సొసైటీ ఛైర్మన్ఎన్ని కలు నిర్వహిస్తామన్నారు...

గోదావరిఖని బస్టాండ్ సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని బస్టాండ్ నుఁడి మంచిర్యాల వైపు వెళుతున్న ట్రక్కుఈరోజు ఉదయం బీభత్సం సృష్టించింది.

చెత్త సేకరణ కోసం వచ్చిన వాహనాన్ని ఢీ కొట్టి పలు వాహనాలను కూడ ట్రక్కు ఢీకొట్టింది. వాహనాలను ఢీకొన్న తరువాత టిఫిన్ సెంటర్‌లోకి ట్రక్కు దూసు కెళ్లింది.

ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసంకాగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రమాదంలో చెత్త సేకరణ వాహన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబం ధించిన వివరాలు తెలియ వలసి ఉంది...

నేటి నుండి శ్రీశైల క్షేత్రం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలంలో వారం రోజుల పాటు నిర్వ‌హించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధ మైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్స వాలు నిర్వహించనున్నారు.

పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగు తాయి.శ్రీస్వామివారి యగ శాల ప్రవేశంతో మకర సం క్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు..

సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు. శ్రీభ్రమ రాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తారు..

యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యా హవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండ పారాధనలు, రుద్రకళశస్థా పన, వేదపారాయ ణాల తోపాటు ప్రత్యేక పూజాధి కాలు ఉంటాయి.. సాయం త్రం అంకురార్పణ, ధ్వజారో హణ కార్యక్రమాలు ఉండనున్నాయి.

మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక, ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనో త్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి.. కాగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మో త్సవాలకు తరలి వస్తారు భక్తులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు.

దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు

గుంటూరు కారం' మూవీ REVIEW

దూరమైన అమ్మ ప్రేమను తిరిగి పొందేందుకు హీరో చేసిన ప్రయత్నమే గుంటూరు కారం స్టోరీ.

మహేశ్ మార్క్ మేనరిజం, కుర్చీ మడతబెట్టే సాంగ్లో శ్రీలీలతో స్టెప్పులు, చివర్లో అమ్మ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అనవసరమైన సీన్లు, ఆకట్టుకోని కామెడీ, కొత్తదనం లేని కథ, త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం నిరాశకు గురిచేస్తుంది.

BGM, సౌండ్ మిక్సింగ్ మైనస్.

RATING: 2.75/5 ( ఘాటు లేని గుంటూరు కారం)