నేటి నుండి శ్రీశైల క్షేత్రం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలంలో వారం రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధ మైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్స వాలు నిర్వహించనున్నారు.
పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగు తాయి.శ్రీస్వామివారి యగ శాల ప్రవేశంతో మకర సం క్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు..
సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు. శ్రీభ్రమ రాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తారు..
యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యా హవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండ పారాధనలు, రుద్రకళశస్థా పన, వేదపారాయ ణాల తోపాటు ప్రత్యేక పూజాధి కాలు ఉంటాయి.. సాయం త్రం అంకురార్పణ, ధ్వజారో హణ కార్యక్రమాలు ఉండనున్నాయి.
మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనో త్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి.. కాగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మో త్సవాలకు తరలి వస్తారు భక్తులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు.
దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు
Jan 12 2024, 11:14