నేటి నుండి శ్రీశైల క్షేత్రం లో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శివ క్షేత్రం శ్రీశైలంలో వారం రోజుల పాటు నిర్వ‌హించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధ మైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్స వాలు నిర్వహించనున్నారు.

పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగు తాయి.శ్రీస్వామివారి యగ శాల ప్రవేశంతో మకర సం క్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు..

సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ సాయంత్రం ధ్వజారోహణం, ధ్వజపటం ఆవిష్కరిస్తారు. శ్రీభ్రమ రాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతి రోజూ విశేష పూజలు నిర్వహిస్తారు..

యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యా హవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండ పారాధనలు, రుద్రకళశస్థా పన, వేదపారాయ ణాల తోపాటు ప్రత్యేక పూజాధి కాలు ఉంటాయి.. సాయం త్రం అంకురార్పణ, ధ్వజారో హణ కార్యక్రమాలు ఉండనున్నాయి.

మకర సంక్రమణం రోజున ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక, ఉత్సవాల చివరి రోజు పుష్పోత్సవ సేవ, శయనో త్సవ సేవ కార్యక్రమాలు ఉంటాయి.. కాగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మో త్సవాలకు తరలి వస్తారు భక్తులు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు.

దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు

గుంటూరు కారం' మూవీ REVIEW

దూరమైన అమ్మ ప్రేమను తిరిగి పొందేందుకు హీరో చేసిన ప్రయత్నమే గుంటూరు కారం స్టోరీ.

మహేశ్ మార్క్ మేనరిజం, కుర్చీ మడతబెట్టే సాంగ్లో శ్రీలీలతో స్టెప్పులు, చివర్లో అమ్మ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అనవసరమైన సీన్లు, ఆకట్టుకోని కామెడీ, కొత్తదనం లేని కథ, త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం నిరాశకు గురిచేస్తుంది.

BGM, సౌండ్ మిక్సింగ్ మైనస్.

RATING: 2.75/5 ( ఘాటు లేని గుంటూరు కారం)

ఒకే ఫ్యామిలీకి మూడు అసెంబ్లీ టికెట్లు

ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేశ్ కుటుంబానికి YCP మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించింది.

కొండెపిలో ఆదిమూలపు సురేశ్, కోడుమూరులో ఆదిమూలపు సతీశ్, మడకశిరలో తిప్పేస్వామి పోటీ చేయనున్నారు.

తిప్పేస్వామి మంత్రి సురేశ్కు స్వయానా బావ.

మరోవైపు ఒకే కుటుంబం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి, ఆయన భార్య ఝాన్సీ-విశాఖ MP, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు-విజయనగరం MPగా పోటీ చేస్తున్నారు.

ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ నేడు కీల‌క స‌మావేశం

ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇవ్వాలా కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం ముకుల్ వాస్నిక్ ఇంట్లో ఇరు పార్టీల నేతలు మరోసారి కలిసి సీట్ల పంపకాలపై చర్చించుకోనున్నారు.

అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చ జరగనుంది.

దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందనేది స్పష్టమవుతోంది.

నేడు కరీంనగర్ 2 డిపో లో పందెం కోడి వేలం

పందెంకోడి కి వేలం వేయ డానికి కరీంనగర్-2 డిపో అధికారులు సిద్ధమ య్యారు.

ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయా ణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు.

దీంతో అధికారులు పందెం కోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. ఈ రోజు శుక్రవారం మధ్యా హ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రక టన విడుదల చేశారు.

ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడ వెళ్తున్న బస్సు కరీం నగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లి పోయాడు.

బస్సులో బ్యాగ్ గమనించిన సహచర ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.

దీంతో దాన్ని సంరక్షించేం దుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటు న్నారు.

దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవ కాశాలు కనిపించకపోవ డంతో ఈరోజు వేలానికి ముహూర్తం నిర్ణయించారు.

టి20 సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ తొలి విజయం

అఫ్గాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. మొహాలీ (పంజాబ్‌) వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గాన్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

శివమ్‌ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో భారత్‌ బోణీ చేసింది.

159 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్లో రెండో బంతికే భారీ షాక్‌ తాకింది. సమన్వయ లోపం కారణంగా రోహిత్‌ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌ అయ్యాడు

గిల్‌ స్టంపౌట్‌ అయ్యాడు. 28 పరుగులకే ఓపెనర్లు పెవివలియన్‌కు చేరడంతో క్రీజులోకి వచ్చిన శివమ్‌ దూబే.. తిలక్‌ వర్మలు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. నబీ వేసిన ఏడో ఓవర్లో శివమ్‌ దూబే.. మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు.

ఇదే ఓవర్లో ఆఖరి బంతికి తిలక్‌ వర్మ.. కవర్స్‌ దిశగా బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్లో 16 పరుగులొ చ్చాయి. నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన 8వ ఓవర్లో తిలక్‌ వర్మ సిక్సర్‌ బాదగా దూబే బౌండరీ సాధించాడు. సాఫీగా సాగుతున్న ఈ జోడీని అజ్మతుల్లా విడదీశాడు. అతడు వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ బాదిన తిలక్‌.. తర్వాత బంతిని స్క్వేర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడబోయి గుల్బాదిన్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు.

దీంతో 44 పరుగుల (29 బంతుల్లోనే) మూడో వికెట్‌ భాగస్వ్యామానికి తెర పడింది.తిలక్‌ వర్మ ఔట య్యాక బ్యాటింగ్‌కు వచ్చిన జితేశ్‌ శర్మతో కలిసి దూబే భారత్‌ను విజయం దిశగా నడపించాడు. గుల్బాదిన్‌ వేసిన 12వ ఓవర్లో దూబేతో పాటు జితేశ్‌లు తలా ఓ ఫోర్‌ బాదడంతో భారత్‌ స్కోరు వంద పరుగులు దాటింది.

ముజీబ్‌ వేసిన 14వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ బాదిన జితేశ్‌.. ఐదో బంతికి భారీ షాట్‌ ఆడి ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు ఈ ఇద్దరూ 31 బంతుల్లో 45 పరుగులు జోడించారు.

ఆఖరి ఆరు ఓవర్లలో భారత విజయానికి 38 పరుగులు అవసరముండగా.. దూబే, రింకూ సింగ్‌ (9 బంతుల్లో 16 నాటౌట్‌, 2 ఫోర్లు) లు మరో వికెట్ కోల్పోకుండా భారత్‌ విజయాన్ని ఖరారుచేశారు.

దూబే 38 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టీ20లలో అతడికి ఇది రెండో హాఫ్‌ సెంచరీ. నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన 18వ ఓవర్లో 6, 4 బాది ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు. శివం దూబెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి

అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నారు.

వరంగల్ లోక్ సభ సన్నా హక సమావేశంలో కడియం కీలక డిమాండ్‌ను కేటీఆర్ ముందు ఉంచారు. తెలం గాణ ప్రజలు టీఆర్ ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ ను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు.

టీఆర్ఎస్‌తో ఉన్న అటా చ్‌మెంట్, సెంటిమెంట్ బీఆర్ఎస్‌గా పేరు మార్చ డంతో పోయింద న్నారు. ఈ అంశంపై ఫోకస్ పెట్టి వెంట నే బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ ఎస్‌గా మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీ ఆర్‌ను కడియం కోరారు.

పార్టీ పేరు మార్పుతో కనీసం 1-2 శాతం ఓట్లు పార్టీకి పడలేదన్నారు. బీఆర్ ఎస్‌ను టీఆర్‌ఎస్ గా మార్చాలని కార్యకర్తలు, నాయకులే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రా యపడుతున్నారన్నారు.

టీఆర్ఎస్ పేరిట తిరిగి పార్టీ పేరు మార్చే ప్రతిపాదనను గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం పార్టీ నేతలను కోరారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్ వస్తుండటంతో అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

నేషనల్ పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసం టీఆర్ఎస్ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా గులాబీ బాస్ మార్చిన విషయం తెలిసిందే.

ప్రైమ్ స్కానింగ్ సెంటర్... ఫ్రాడ్ స్కానింగ్ సెంటర్

తప్పుడు రిపొట్ లకు అడ్డగా స్కానింగ్ సెంటర్

నల్లగొండ పట్టణ కేంద్రంలో డాక్టర్స్ కాలనీలో గల ప్రైమ్ స్కానింగ్ సెంటర్ తప్పుడు రిపొట్ లకు అడ్డగా మారింది. కొంత మంది డాక్టర్లు తమ సొంత లాభం కోసం ఆ స్కానింగ్ సెంటర్ కి రిఫర్ చేయగా వాళ్లకు కమిషన్ ముట్టడం ఆనవాయితీగా వస్తోంది.

అదే క్రమంలో ఒక యువకుడు తనకు గ్యాస్ ప్రాబ్లెమ్ రాగ పట్టణ కేంద్రంలో గల సాయి శ్రీనివాస హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్ స్కానింగ్ చేయించాలని ప్రైమ్ స్కానింగ్ సెంటర్ కి రిఫర్ చేయగా ఆ యువకుడు అక్కడ కి వెళ్లగా ఆ స్కానింగ్ సెంటర్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి స్కానింగ్ తీసి ఆ యువకుడికి అపెండిక్స్ ఉంది అని తొందరగా సర్జరీ అవసరం అని అన్నారు.

ఇది గమనించిన ఆ యువకుడు మళ్ళీ తిరిగి అపూర్వ స్కానింగ్ సెంటర్ కి వెళ్లి మళ్ళీ స్కానింగ్ తీయగా ఆ యువకుడికి ఎటువంటి సమస్య లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ యువకుడు తిరిగి తన స్నేహితుల తో కలిసి ప్రైమ్ స్కానింగ్ సెంటర్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ని నిలదియగా

డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ఆ యువకుడికి కొంత డబ్బు ను ఇస్తా అనడంతో అందుకు ఆ యువకుడు నిరాకరించడం తో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి కొంత మంది డాక్టర్లు పుల్ల రావు మరియు సురక్ష డాక్టర్ రమేష్ కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ యువకుడి పై పిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ యువకుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి పై కేసు పెట్టడం జరిగింది.

ఢిల్లీ ని వణికించిన భూకంపం

ఢిల్లీలోఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.

దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది.

ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.

Budget Session: జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..

వివరాల ప్రకారం.. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది.

ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్‌ సమావేశాలు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది..