పార్టీ పేరు టిఆర్ఎస్ గా మార్చండి: కడియం శ్రీహరి
అసెంబ్లీ ఎన్నికల ఓటమి వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల్లో తనదైన ముద్ర వేసిన పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నారు.
వరంగల్ లోక్ సభ సన్నా హక సమావేశంలో కడియం కీలక డిమాండ్‌ను కేటీఆర్ ముందు ఉంచారు. తెలం గాణ ప్రజలు టీఆర్ ఎస్‌ను సొంత పార్టీగా భావించారని కానీ.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్ ను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు.
టీఆర్ఎస్‌తో ఉన్న అటా చ్‌మెంట్, సెంటిమెంట్ బీఆర్ఎస్‌గా పేరు మార్చ డంతో పోయింద న్నారు. ఈ అంశంపై ఫోకస్ పెట్టి వెంట నే బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ ఎస్‌గా మార్చే విషయంలో పునరాలోచించాలని కేటీ ఆర్‌ను కడియం కోరారు.
పార్టీ పేరు మార్పుతో కనీసం 1-2 శాతం ఓట్లు పార్టీకి పడలేదన్నారు. బీఆర్ ఎస్‌ను టీఆర్‌ఎస్ గా మార్చాలని కార్యకర్తలు, నాయకులే కాకుండా మెజారిటీ ప్రజలు అభిప్రా యపడుతున్నారన్నారు.
టీఆర్ఎస్ పేరిట తిరిగి పార్టీ పేరు మార్చే ప్రతిపాదనను గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం పార్టీ నేతలను కోరారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్ వస్తుండటంతో అధినేత కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
నేషనల్ పాలిటిక్స్‌లో ఎంట్రీ కోసం టీఆర్ఎస్ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా గులాబీ బాస్ మార్చిన విషయం తెలిసిందే.
Jan 12 2024, 09:50