కాంగ్రెస్ గూటికి బిజెపి నేత విక్రమ్ గౌడ్ ❓️

తెలంగాణలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు గోషా మహల్ బిజెపి నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేరకు గురువారం తన రాజీనామా లేఖను ఆయన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పంపించారు.

పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి తొలి వికెట్ పడినట్లైంది.

కాగా, త్వరలోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

పెండింగ్ చాలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్

రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది.

వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడి గించినట్టు పోలీసు అధికా రులు తెలిపారు.

ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్విని యోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాల ని కోరారు.

టూ, త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం, లైట్‌, హెవీ వెహి కిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు.

వాహనదారు లు పెండింగ్‌ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు.

చలాన్లను మీ సేవా, టీ వాలెట్‌, ఈ సేవా, ఆన్‌లైన్‌, పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది.

పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.

నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ వెళ్లనున్నారు.

ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపొచ్చింది.లోక్ సభ ఎన్నికలకు అనుస రించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దీశానిర్దేశం చేయనుంది.

లోక్ సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేట్ పదవుల భర్తీపై నా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి..

జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

నిన్న రాత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.

ఈ క్రమంలో ముద్రగడ మూడు అసెంబ్లీ స్థానాలు కోరినట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరిలో 2, నెల్లూరు జిల్లాలో ఒక సీటు అడిగినట్లు టాక్.

త్వరలోనే వీరిద్దరూ భేటీ కానున్నారని.. ఆ తర్వాత ముద్రగడ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్❓️

తెలంగాణలో ఎంఎల్‌ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్‌సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

రెండింటికి విడివిడిగా ఉపఎన్నికలు నిర్వహిం చనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా ఇసి విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫలితంగా మండలి ఉపఎన్నికల్లో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కను న్నాయి.

గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు, అదే రోజు రాష్ట్ర అధికారిక గెజిట్‌లో కూడా విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.

18వ తేదీ సాయంత్రం ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 29వ తేదీన ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ జరనుంది.

రెండు స్థానాలకు విడివిడిగా ఉపఎన్నికలు జరగుతాయి. అందుకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ జరుగు తోంది. రెండు నోటిఫికేషన్లకు అనుగుణంగా విడివిడిగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది.

శాసనసభ్యుల బలాబలాల మేరకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నందున రెండు స్థానాలకు విడివిడిగా ఎన్ని కలు జరిగితే ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేట్లు అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడి స్తున్నాయి.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవాలయంలో గురువారం భక్తుల రద్దీ చాలావరకు తగ్గింది.

ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

టికెట్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు.భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటు న్నారు.

కాగా, బుధవారం శ్రీవారి 62,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 8,555 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Sharmila: నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు..

కాగా షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం చేసేందుకు వైఎస్‌ కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు..

శ్రీరాముడు మాంసాహారి :NCP నేత సంచలన వ్యాఖ్యలు

కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్‌ సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

శ్రీరాముడు శాకాహారి కాదని, ఆయన వేటాడి మాంసాన్ని తినేవారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ అవద్‌ అన్నారు. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ.. కానీ, శ్రీరాముడు మాంసాహారి అని చెప్పుకొచ్చారు.

14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్‌ కోసం ఎక్కడికి వెళ్తాడు? అవునా..? కాదా..? తాను చెప్పినదానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా అంటూ వ్యాఖ్యానించారు. అవద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అవద్‌పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతు న్నారు. రామ భక్తులు, బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఎన్సీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో దిగివచ్చిన అవద్‌ క్షమాపణలు కోరారు. ఏ విషయం గురించీ తాను తొందరపడి మాట్లాడనని, రామాయణంలో ఉన్నదే చెప్పానంటూ వివరణ ఇచ్చారు.

తన వ్యాఖ్యలతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు.

ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభకు సన్నాహాలు

పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఐదు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై..తాజా పరిస్థితులపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు.

అందుకోసం అందరూ సీరియస్‌గా కష్టపడాలని రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలం గాణలో విజయ ఢంకా మోగించిన హస్తం పార్టీ ఇప్పుడు అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ.. సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

అందుకోసం ఇప్పటికే ఎన్నికల కమిటీతో పాటు జిల్లాల ఇంఛార్జులను కూడా అధిష్ఠానం నియమించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నిక లతో పోల్చితే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కష్టపడాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుంటే.. 12 స్థానాలు గెలవటమే లక్ష్యం గా కృషి చేయాలని సూచిం చారు. ఐదు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మె ల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్ జిల్లాల నేతలతో భేటీ అయిన సీఎం.. తాజా పరిస్థితులపై సమీక్షించారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సీరియస్‌గా కష్టపడాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లిలో తొలి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న ట్లు గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించాలని నిర్ణయిం చినట్టు తెలిపారు.

అక్కడే అమరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు.

చట్నీ ఎక్కువైందని అలిగిన భర్త.. ఉరేసుకున్న భార్య

జూబ్లీహిల్స్‌ : చట్నీ విషయంలో తలెత్తిన గొడవ భార్య బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ రాణా పరిధిలో జరిగింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ..

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వద్ద డ్రైవర్‌. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియోకాల్స్‌ చేసింది. అతడు స్పందించకపోవడంతో ఫోన్‌ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసింది..

అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్‌ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె విగతజీవిగా మారింది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తామన్నారు..