ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభకు సన్నాహాలు
పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఐదు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై..తాజా పరిస్థితులపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు.
అందుకోసం అందరూ సీరియస్‌గా కష్టపడాలని రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలం గాణలో విజయ ఢంకా మోగించిన హస్తం పార్టీ ఇప్పుడు అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ.. సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
అందుకోసం ఇప్పటికే ఎన్నికల కమిటీతో పాటు జిల్లాల ఇంఛార్జులను కూడా అధిష్ఠానం నియమించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నిక లతో పోల్చితే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించేలా కష్టపడాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుంటే.. 12 స్థానాలు గెలవటమే లక్ష్యం గా కృషి చేయాలని సూచిం చారు. ఐదు ఉమ్మడి జిల్లాల ఇంఛార్జి మంత్రులు, ఎమ్మె ల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో భేటీ అయిన సీఎం.. తాజా పరిస్థితులపై సమీక్షించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సీరియస్‌గా కష్టపడాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవె ల్లిలో తొలి బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న ట్లు గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇంద్రవెల్లిలోనే తొలి సభ నిర్వహించాలని నిర్ణయిం చినట్టు తెలిపారు.
అక్కడే అమరుల స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు.
Jan 11 2024, 12:38