తెలంగాణలో జిల్లాల కుదింపు ❓️
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
జనాభా, అసెంబ్లి, లోక్‌సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టులు వంటి కీలక మైన అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల ప్యూన ర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.
వచ్చే నెల చివరిన లేదా మార్చిలో నిర్వహించే అసెంబ్లి బడ్జెట్ సమా వేశాల్లో జిల్లాల మార్పులు, చేర్పులపై పూర్తిస్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని అన్నిపార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించి ముందు కెళ్లాలన్న అభిప్రా యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చించకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండాఒంటెద్దుపోకడతో పాత జిల్లాలను విభ జించి కొత్త వాటిని ఏర్పాటు చేసిందని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయడం మూలం గా అధికార యంత్రాంగం అనేక సమస్య లను ఎదు ర్కొంటోందని పాలక పక్షం చెబుతోంది. జిల్లాల విభ జనలో జరిగిన పొర పాట్లను, చేసిన తప్పి దాలను సరిదిద్ది పటి ష్టమైన యంత్రాగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలను విడదీసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్దతిని అవలంభించ లేదన్న విమర్శలున్నాయి. ఎవరికి పడితే వారికి అడిగిందే తడవుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, చివరికి మండలాలను ప్రకటిం చారని చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాల పునర్విభజనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. గతంలో నిజామాబాద్ జిల్లా ఉండేదని..
కొత్తగా ఇదే జిల్లాలో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా చేరిందని, ఇదే తరహాలో పెద్ద జిల్లాలో మూడు చిన్న జిల్లాలో రెండు ఉండేలా పునర్విభన చేసేలా ప్రభుత్వం ప్రాథమిక కసరత్తుకు శ్రీకారం చుట్టి నట్టు సమాచారం.
అవసరమైన చోటే కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కొన సాగించేలా చర్యలు తీసుకోవాలని భావి స్తున్నట్టు సమాచారం.
Jan 08 2024, 12:50