తెలంగాణలో జిల్లాల కుదింపు ❓️

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

జనాభా, అసెంబ్లి, లోక్‌సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టులు వంటి కీలక మైన అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల ప్యూన ర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.

వచ్చే నెల చివరిన లేదా మార్చిలో నిర్వహించే అసెంబ్లి బడ్జెట్‌ సమా వేశాల్లో జిల్లాల మార్పులు, చేర్పులపై పూర్తిస్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని అన్నిపార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించి ముందు కెళ్లాలన్న అభిప్రా యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చించకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండాఒంటెద్దుపోకడతో పాత జిల్లాలను విభ జించి కొత్త వాటిని ఏర్పాటు చేసిందని అధికార పార్టీ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయడం మూలం గా అధికార యంత్రాంగం అనేక సమస్య లను ఎదు ర్కొంటోందని పాలక పక్షం చెబుతోంది. జిల్లాల విభ జనలో జరిగిన పొర పాట్లను, చేసిన తప్పి దాలను సరిదిద్ది పటి ష్టమైన యంత్రాగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలను విడదీసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్దతిని అవలంభించ లేదన్న విమర్శలున్నాయి. ఎవరికి పడితే వారికి అడిగిందే తడవుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, చివరికి మండలాలను ప్రకటిం చారని చెబుతున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాల పునర్విభజనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. గతంలో నిజామాబాద్‌ జిల్లా ఉండేదని..

కొత్తగా ఇదే జిల్లాలో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా చేరిందని, ఇదే తరహాలో పెద్ద జిల్లాలో మూడు చిన్న జిల్లాలో రెండు ఉండేలా పునర్విభన చేసేలా ప్రభుత్వం ప్రాథమిక కసరత్తుకు శ్రీకారం చుట్టి నట్టు సమాచారం.

అవసరమైన చోటే కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కొన సాగించేలా చర్యలు తీసుకోవాలని భావి స్తున్నట్టు సమాచారం.

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది.

ఇప్పటికే అన్ని రకాల కార్య క్రమాలు పూర్తయ్యాయి . దేశ నలుమూలల నుంచి హిం దువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్య వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్య పట్టణంలోని హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి.

ఇదిలా ఉంటే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజే, తాము బిడ్డకు జన్మనివ్వాలని కొందరు గర్భిణీలు కోరుకుంటు న్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన నెలల నిండిన గర్భిణీలు జనవరి 22వ తేదీ రోజునే తమకు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లను కోరుకుంటున్నారు.

ప్రస్తుతం నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు సైతం జనవరి 22వ తేదీ వరకు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తు గానే.. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయా లని వేడుకోవడం గమనార్హం.

అయితే వైద్యులు మాత్రం గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసు కుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు.. జనవరి 22న బిడ్డకు జన్మిస్తే రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని ఆలోచిస్తు న్నారు.

అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయ మని.. ఆరోజు ఎంతో పవిత్ర మైందని అక్కడి వారు భావిస్తున్నారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీకి టెండర్లు ఎప్పుడు

•బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

తిరుమలగిరి అశోక్

మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ లో 92 షాపులలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో

మిర్యాలగూడ ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేస్తున్న బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్.

ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహించిన షాపులకు నేటికీ టెండర్లు లేకపోవడంతో మున్సిపల్ కాంప్లెక్స్ లలో దళారీ దందా నడుస్తుంది ఎంతోమంది నిరుద్యోగులు జీవన ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటూ నెలకు 25 వేల నుండి 30 వేల వరకు షాపుల యాజమాన్యాలు దళారులకు చెల్లిస్తున్నారు.

మున్సిపాలిటీకి దక్కవలసినటువంటి ఆదాయాన్ని దళారులు గండి కొడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయడం వలన ఈ దళారీ దందా మరింతగా పెరిగి షాపుల వ్యాపారులపై నెలసరి కిరాయిలు అమాంతం పెంచేస్తూ వ్యాపారం చేసుకునే నిరుద్యోగ యువతకు తీవ్ర ఇబ్బందిగా మారింది మున్సిపాలిటీ షాపులు నిర్మించిన నాటినుండి ఇప్పటివరకు టెండర్లు వేయకపోవడంతో వారి సొంత షాపుల చలామణి అవుతూ నిరుద్యోగ యువతకు తీవ్ర ఇబ్బంది మారింది దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 92 షాపులకు బహిరంగ టెండర్లు పూర్తిచేసి వ్యాపారస్తులకు మాత్రమే షాపులు దక్కేలా చర్యలు తీసుకొని దళారీ దందా లేకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో.. బీసీ సంక్షేమ సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు రాయించు నరసింహ, బీసీ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు చిలకల మురళి యాదవ్, బీసీ యువజన సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, బీసీ యువజన సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు గంగాధర్, గోపి, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక లారీలను నియంత్రించండి: మంత్రి సీతక్క

జిల్లాలలో ఇసుక లారీలను నియంత్రించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంద‌ని, -ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అను మతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.

నేడు రైతుల ఖాతాలో రైతు బంధు జమ

రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు అధికారులను ఆదివారం సాయంత్రం ఆదేశించారు.

శనివారమే మంత్రి అధికారులతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా సోమవారం నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.

ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం ,వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.

గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావువెల్లడించారు.

వ్యూహం సినిమా రిలీజ్ పై నేడు విచారణ

వ్యూహం సినిమాపై నేడు హైకోర్టులో విచారణ జర గనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. నేడు సినిమా రికార్డ్స్ అన్నిటిని న్యాయ స్థానం పరిశీలిం చునుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో సినిమా యూనిట్ అప్పీల్ చేసింది.

సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని అంటోంది.

ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11 కు బదులు 8వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది.

మెరిట్స్ ఆధారంగా ఈనెల 8న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్‌కు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతిలో సర్వసాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.

కాగా, ఆదివారం శ్రీవారి 76,058మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరు మలలో నిన్న 22,543 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు...

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు.

9న రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై సీఈసీ సమీక్ష చేయనుంది. 10న ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఏపీలో ఓట్ల గల్లంతు, జాబితాలో అవకతవకలపై సీఇసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయనున్నారు.

నేడే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం

ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6 వకు నిర్వహిం చిన ప్రజాపాలన కార్యక్ర మంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ నున్నారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీజీజీ డైరెక్టర్ జనరల్, సీఎస్ శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికా రులు సహా ఉన్నతాధికా రులు సమావేశానికి హాజరుకానున్నారు.

మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం

తెలంగాణలో ఈ సంస్కృతి, అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి.

అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి. ఆ డబ్బులతో గాజులు కొనాలి. తాను ధరించాలి. ఇలా గాజులు కొనుక్కోవటానికి డబ్బులు అడిగే తల్లికి తప్పని సరిగా.. ఆమె వారసత్వం కోసమే కాదు.. తన వారసత్వ క్షేమం కోసమూ మహిళా మూర్తులు గాజుల మామూళ్లు ఇస్తారు.

అంతే కాదు, ఉత్తరాయణ సంక్రమణ దశలో,, మకర సంక్రాంతి సందర్భంగా ఆ సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. కృతజ్ఙతలు తెలుపుతారు. ఇక మహావిష్ణువు, శ్రీ లక్ష్మీని పూజిస్తారు.

అందరూ క్షేమంగా ఉండాలి. అందరిలో మేమూ ఉండా లనే నానుడి.. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ మహిళల్లో విస్పష్టం.

తెలంగాణ సంస్కృతిలో,, మహిళలు ప్రాణ సమానం గా గాజులను ఆరాధిస్తారు. డబ్బున్న మారాణులైతే వజ్రాల గాజలతో ఫోజి స్తారు. ఎన్నో రంగుల రంగుల గాజులు ధరిం చటానికే ఇష్టపడ తారు.

ధనవంతులు బంగారు గాజులు ధరించవచ్చు. కానీ ఎల్లవేళలా రంగు రంగుల గాజులకు ఇచ్చే విలువ, గౌరవం బంగారు గాజులకు దక్కదంటే ఆశ్చర్యపోనక్క రలేదు. మట్టి గాజులంటే ఆడబిడ్డలు అల్లాడి పోతుంటారు. .

బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్‍ గాజులు తీసుకుం మని మధ్యతరగతి మహిళ భావిస్తుంది. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్‍ గాజులు కొంటుంది. కానీ మట్టి గాజులకే అపూర్వ గౌరవం లభిస్తుంది.