జాతీయ పక్షుల దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన: మంత్రి కొండ సురేఖ

ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపు కుంటున్నామని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ ( EPTRI ) పక్షు జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి ముఖ్యమైన విష యాలను ప్రస్తావించారు.

పర్యావరణ సమ తుల్య తను కాపాడు కోవడంలో పక్షులు పోషించే కీలక పాత్ర, అవి ఎదుర్కొనే సమస్య లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

ఆ దిశగా అవగాహన పెంచడం కొరకు ఈ రోజును జనవరి 5వ తేదీ జరుపు తున్నామని మంత్రి అన్నా రు. దీనికి సంబంధిం చిన అవగాహన, విజ్ఞాన పోస్ట ర్‌ను పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ సిద్ధం చెయ్యడం జరిగిం దన్నారు.

ఆ పోస్టర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరిం చడం చాలా సంతోషంగా వుందని మంత్రి కొండా సురేఖ అన్నారు...

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దింపింది..

హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌కు గురైన నౌకలోకి ప్రవేశించి, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి సందేశం పంపడంతో ఈ హైజాక్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నౌకలోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

కనిగిరి: రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జనసేనతో (Janasena) కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ (TDP) శ్రీకారం చుట్టింది..

'రా.. కదలి రా..' (Ra kadali Ra) పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ''ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా! అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైంది. ఈరోజు మీ అందరి సహకారం అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా! అని పిలుపునిస్తున్నా. నేను.. పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత..

ఎమ్మెల్యేలు.. ఎంపీలకు బదిలీలు ఉంటాయా?

''రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే. ఒక్క ఛాన్స్‌ అన్నారని జగన్ మాయలో పడ్డారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్‌ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారు. పాలన సమర్థంగా ఉంటే కరెంట్‌ ఛార్జీలు పెంచే అవసరం లేదు. ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగింది. తెదేపా పాలనలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాలి. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండపిలో బంగారం అవుతుందా? మన రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్ కావాలని ప్రణాళికలు రచించాం. నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా'' అని చంద్రబాబు తెలిపారు..

మహబూబ్‌నగర్‌ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌ జిల్లా: వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది..

ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది..

చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

ఉద్రిక్తత.. డీసీఎంకు నిప్పు..

బాలానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..

వైఎస్సార్సీపీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

చిత్తూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం తనకు సీటు లేదని బయటకు పంపించేశారు. నాకు నమ్మించి మోసం చేశాడని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.

ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది.

జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. నాలుగేళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ

వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు.

అదానీకి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు పెరిగాయి.

ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం ను కలిసిన చిరంజీవి దంపతులు

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు.

గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి ప్రజాభ వన్‌కు వచ్చిన చిరంజీవి.. అక్కడ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు సైతం భట్టి సత్కారం చేశారు.

చిరుతో భేటీకి సంబంధిం చిన ఫొటోలను డిప్యూటీ సీఎం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులను ఒక్కొక్కరిని మెగాస్టార్ కలుస్తున్నారు.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియ జేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ

ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోన్నది. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మె ల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకా శం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడు తున్నారు.

దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడు తుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్న ది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.

తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడు తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెల వడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీ లను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపు లు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాఫిక్ గా మా రింది. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికపై క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్ల నున్నారు. ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి, తర్వాతి ప్రాసెస్ బాధ్య తలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించను న్నట్లు తెలుస్తుంది....

తెలంగాణకు రావలసిన నిధులు ఇప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారు ల‌ను మాత్రమే కేటాయిం చార‌ని.. జిల్లాల విభ‌జ‌న‌, వివిధ శాఖ‌ల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటా యించాల‌ని కోరారు.

ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం గురవారం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,అభివృద్ధి పనులపై చర్చించారు.

రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి అమిత్ షా,సాను కూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికా రుల‌ను అద‌నంగా కేటాయిస్తామ‌ని హామి ఇచ్చారు...