అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి
-ఐద్వా -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
అన్ని గ్రామాలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈరోజు ఐద్వా జిల్లా విస్తృతస్థాయి సమావేశం పొలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం డ్వాక్రా మహిళల కోసం ఒకటి నవంబర్ 2001 అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత వచ్చిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించాలని. లేకపోతే వారికి బకాయి పడ్డ 600 కోట్ల రూపాయలు అభయ హస్తం డబ్బులను మహిళల బ్యాంక్ అకౌంట్ల లో జమ చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. బెల్టు షాపులను ఎత్తివేయాలని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ
సభ్యత్వ క్యాంపెయిన్ సందర్భంగా
ఉపాధి హామీ సమస్యలు, రేషన్ సమస్యలు, పొదుపు గ్రూపుల సమస్యలపై సర్వేలు చేసి మెమోరాండం ఇస్తాము. ఆ సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా సరోజ, కొండ అనురాధ, ఐద్వా ఆఫీస్ బేరర్స్ చనబోయిన నాగమణి, తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు చనగాని సైదమ్మ,సుల్తానా, వసంత, శశికళ, జంజిరాల ఉమా, బోల్లపెల్లి మంజుల, వర్ణ, వరంగంటి సంధ్యారాణి, సుజాత, భాగ్య,భారతి తదితరులు పాల్గొన్నారు.
Jan 05 2024, 14:36