ఖమ్మం జిల్లా పార్లమెంటు ఎన్నికల బరిలో సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రా యంగా అంగీకరించారు.

ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సోనియాగాంధీ నాయక త్వంలోని యూపీఏ ప్రభు త్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేత లు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకట నకు ముందు సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నా రు. సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు బలంగా తీసుకువెళ్ల గలిగారు.

ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్‌ను లోక్‌సభ ఎన్నిక ల్లోనూ గట్టిగా ఉపయోగిం చాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగం గానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు.

తాజాగా బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగం గానే సోనియాగాంధీ తెలం గాణ నుంచి పోటీ చేయాల ని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాల యం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అంది నట్లు తెలిసింది.

రాష్ట్రం నుంచి పోటీ చేయ డానికి ఆమె అంగీకరించా రని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొం దించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబం ధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.

అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

-ఐద్వా -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

అన్ని గ్రామాలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ఐద్వా జిల్లా విస్తృతస్థాయి సమావేశం పొలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం డ్వాక్రా మహిళల కోసం ఒకటి నవంబర్ 2001 అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత వచ్చిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించాలని. లేకపోతే వారికి బకాయి పడ్డ 600 కోట్ల రూపాయలు అభయ హస్తం డబ్బులను మహిళల బ్యాంక్ అకౌంట్ల లో జమ చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. బెల్టు షాపులను ఎత్తివేయాలని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ

సభ్యత్వ క్యాంపెయిన్ సందర్భంగా

ఉపాధి హామీ సమస్యలు, రేషన్ సమస్యలు, పొదుపు గ్రూపుల సమస్యలపై సర్వేలు చేసి మెమోరాండం ఇస్తాము. ఆ సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా సరోజ, కొండ అనురాధ, ఐద్వా ఆఫీస్ బేరర్స్ చనబోయిన నాగమణి, తుమ్మల పద్మ, భూతం అరుణకుమారి, కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు చనగాని సైదమ్మ,సుల్తానా, వసంత, శశికళ, జంజిరాల ఉమా, బోల్లపెల్లి మంజుల, వర్ణ, వరంగంటి సంధ్యారాణి, సుజాత, భాగ్య,భారతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

తెలుగు రాష్ట్రాల రాజ కీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురు వారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ మేరకు షర్మిల, మరికొందరు నేతలు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. కాగా.. ముందుగా షర్మిల.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు.

ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించు కునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు....

తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స‌భ్యురాలిగా పోస్టింగ్ ఇచ్చారు.

అధికారుల కొత్త పోస్టింగ్:

ఇరిగేషన్ కార్యదర్శి: రాహుల్ బొజ్జా

స్విత అబర్వాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్

దాసరి హరిచందన: నల్లగొండ కలెక్టర్

డి. దివ్య: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

భారతి హోళికేరి: పురావస్తు శాఖ డైరెక్టర్

సంగీతా: సీఎంవో సంయుక్త కార్యదర్శి

మహేశ్ దత్ ఎక్కా: గనుల శాఖ ముఖ్య కార్యదర్శి

అహ్మద్ నజీర్: ప్రణాళిక ముఖ్య కార్యదర్శి

కాగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి జీ. చంద్రశేఖర్ రెడ్డి ని నియ‌మించారు..

ప్రస్తుతం ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు .

సావిత్రి బాయిపూలే మహిళా లోకానికి ఆదర్శం : ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి

సావిత్రి భాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమని 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు ఈ రోజు 5వ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి జరిగింది ఈ సందర్భంగా పూలమాలంకరణ చేసి ప్రభావతి మాట్లాడుతూ

19వ శతాబ్దంలో పితృస్వామిక వ్యవస్థకు, పురుషాధిక్య సమాజానికి, వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.

 మహిళలపట్ల. వివక్షతలు రూపుమాపబడాలంటే విద్యయే పదునైనన ఆయుధమని భావించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు విద్యను అందించడానికి శ్రీకారం చుట్టిన తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళల కోసం సుమారుగా 52 మహిళా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధిస్తున్న క్రమంలో ఆధిపత్య బ్రాహ్మణీయ శక్తులు అనేక రకాలుగా సావిత్రిబాయి పూలేని వేధించినప్పటికి వాటన్నింటిని ప్రతిఘటించి మహిళలను చైతన్యవంతం చేయడంలో క్రియాశీలక భూమిక పోషించిందన్నారు.

సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అన్నారు. అణగారిన వర్గాల మహిళలకు సంపూర్ణమైన హక్కులు దక్కాలంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో సబ్ కోటా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన,గోండు లాంటి మారుమూల తండాలకు విద్యను అందించడానికి విద్యా వ్యవస్థ లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో వివక్షతలు లేనటువంటి సమాజం కొరకు పోరాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా సహాయ కార్యదర్శిలు చెనబోయిన నాగమణి భూతం అరుణ కుమారి జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సుల్తానా శశికళ లక్ష్మమ్మ సైదమ్మ భారతమ్మ రాధిక చిలుకూరి వర్ణ బొల్లెపల్లి మంజుల పాల్గొన్నారు.

ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే నేనే..: ఆర్కే

మగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు.

అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు.

కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల వెంటే తన రాజకీయ ప్రస్థానం అని ప్రకటించారు.

గృహ లక్ష్మీ పథకం రద్దు?

గత ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని ఉపసంహకరిస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జివో జారీ చేసింది.

గృహలక్ష్మీ పథకం కింద నాలుగు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఆర్థిక సహాయం 100 శాతం సబ్సిడితో అందజేసేందుకు గత ప్రభుత్వం నిర్దేశించింది.

ఇందుకు సంబంధించి 2,12,095 మంది లబ్ది దారులకు శాంక్షన్ ఆర్డర్లను ఆయా జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట జాగా వున్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేనివారికి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు నిర్ణయిం చింది.

ఈ క్రమంలో గతంలో వున్న గృహలక్ష్మీ పథకాన్ని ఉపంస హరిస్తూ నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు ఆయా శాఖ లకు ఆదేశాలిచ్చింది.

నేటి నుండి నియోజక వర్గాల వారీగా బి ఆర్ ఎస్ సమావేశాలు

లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవు తున్నది. గెలుపే లక్ష్యం గా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ నెల 21 వరకు సమా వేశాలు కొనసాగ నున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగా ణభవన్‌లో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామా రావు, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవ రావు, పార్టీ నేతలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూ ధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు సమా వేశాలను నిర్వహించ నున్నారు.

రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగను న్నాయి. మొదటి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడురోజుల విరామ మిస్తారు.

తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. మొదట ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గం నాయకు లతో సమావేశమై, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చిస్తారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయా లు తీసుకుని కార్యాచరణ ను రూపొందిస్తారు.

అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశాలకు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వా నించారు.

ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకాను న్నారు.

నేడు సీఎం జగన్ ను కలవనున్న వైయస్ షర్మిల

వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమా నంలో షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకొ ని, సాయంత్రం తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసా నికి వెళ్లనున్నారు.

కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించ నున్నారు.

వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కుమార్తె, కోడలి తరపు కుటుంబ సభ్యులుకూడా జగన్ వద్దకు వెళ్లనున్నారు.

SB NEWS

చర్లపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు..

హైదరాబాద్ : చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది..

దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చర్లపల్లిలోని వెంకట్రెడ్డి నగర్లో గల మధుసూదన్రెడ్డి నగర్లో ఈ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు..