సావిత్రి బాయిపూలే మహిళా లోకానికి ఆదర్శం : ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి
సావిత్రి భాయి పూలే మహిళా లోకానికి ఆదర్శమని 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు ఈ రోజు 5వ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి జరిగింది ఈ సందర్భంగా పూలమాలంకరణ చేసి ప్రభావతి మాట్లాడుతూ
19వ శతాబ్దంలో పితృస్వామిక వ్యవస్థకు, పురుషాధిక్య సమాజానికి, వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.
మహిళలపట్ల. వివక్షతలు రూపుమాపబడాలంటే విద్యయే పదునైనన ఆయుధమని భావించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు విద్యను అందించడానికి శ్రీకారం చుట్టిన తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళల కోసం సుమారుగా 52 మహిళా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధిస్తున్న క్రమంలో ఆధిపత్య బ్రాహ్మణీయ శక్తులు అనేక రకాలుగా సావిత్రిబాయి పూలేని వేధించినప్పటికి వాటన్నింటిని ప్రతిఘటించి మహిళలను చైతన్యవంతం చేయడంలో క్రియాశీలక భూమిక పోషించిందన్నారు.
సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అన్నారు. అణగారిన వర్గాల మహిళలకు సంపూర్ణమైన హక్కులు దక్కాలంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో సబ్ కోటా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన,గోండు లాంటి మారుమూల తండాలకు విద్యను అందించడానికి విద్యా వ్యవస్థ లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రిబాయి పూలే అందించిన స్ఫూర్తితో వివక్షతలు లేనటువంటి సమాజం కొరకు పోరాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా సహాయ కార్యదర్శిలు చెనబోయిన నాగమణి భూతం అరుణ కుమారి జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సుల్తానా శశికళ లక్ష్మమ్మ సైదమ్మ భారతమ్మ రాధిక చిలుకూరి వర్ణ బొల్లెపల్లి మంజుల పాల్గొన్నారు.
Jan 03 2024, 20:54