వైఎస్సార్ పెన్షన్ కానుక: సీఎం జగన్ కాకినాడ పర్యటన
తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, పెన్షన్..
పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు..
నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నారు..
పర్యటన ఇలా..
ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు..
Jan 03 2024, 09:33