Kishan Reddy: జనసేనతో బీజేపీ దోస్త్‌ కటీఫ్‌..! కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జనసేనతో బీజేపీ దోస్తీ కటీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికల రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం ఉండదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ల అమలు పై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందని అన్నారు.

ఈ నెల 17న సుప్రీం కోర్టులో కేసు ఉందన్నారు. ఆ లోపే ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తుందని.. బీజేఎల్ పీ నేత ఎంపిక ఎప్పుడైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని అన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీ లు వేస్తున్నామని అన్నారు. వాళ్లతో మీటింగ్ ఉంటుందన్నారు..

అంశం చర్చకు రాలేదన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదు? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. భవిష్యత్ లో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటుందన్నారు. అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని అన్నారు. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నమని, జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని అన్నారు..

PM Modi: భారతీయ యువతకు ఇది మంచి సమయం: ప్రధాని మోదీ

తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు..

తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

''యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది.

యువత అంటేనే శక్తికి నిదర్శనం. నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యం. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి'' అని యువతకు మోదీ సూచించారు..

Ponguleti: మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం : గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని చెప్పారు..

ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో నిర్వహించిన 'ప్రజాపాలన' సభలో పొంగులేటి మాట్లాడారు..

'గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసింది. గత సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారు.

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాం. దీంతోనే మా ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం. మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం'' అని పొంగులేటి అన్నారు..

Bhavani Deeksha Viramana: రేపటి నుంచి భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు..

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి..

ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

మరోవైపు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో.. దుర్గగుడి అధికారులు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు..

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లి అరెంపల వద్ద ఈరోజు ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

వారి వివరాలు అడిగి తెలుసుకోవడంతో వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.

మెరుగైన వైద్యం అందిం చాలని చింతపల్లి వైద్యా శాఖ అధికారులకు ఫోన్ లో తెలిపారు.

కొండెక్కిన కోడిగుడ్డు

తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయాని మరొకటి రెడీగా ఉంటోంది.

మొన్నటివరకు ఉల్లిగడ్డలు, టమాల ధరలు కొండెక్కగా.. ఆ తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి.. ఇలా ఒక్కొక్కటిగా మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక.. ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది.

రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కార్తికమాసం ముగిసిన తర్వాత.. గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటంతో.. ధర కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం రూ.5.50 మాత్రమే ఉండగా.. వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.7 నుంచి 8 గా పలుకుతోంది.

వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరుకోవటం గమనార్హం. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉండగా.. రిటైల్‌లో రూ.7గా అమ్ముతున్నారు.

కొన్ని కొన్ని దుకాణాల్లో రూ.7.50, రూ.8గా కూడా అమ్ముతుండటం గమనార్హం. ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు.

మరోవైపు.. చికెన్‌ ధర కూడా పెరిగిందండోయ్. కార్తిక మాసంలో కిలో చికెన్‌ రూ.170 నుంచి రూ.190 వరకు పలకగా.. తాజాగా రూ.240కి చేరటం గమనార్హం.

జపాన్ నగరంలో భారీ భూకంపం

కొత్త సంవత్సరం ప్రారంభం లోనే జపాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్ప కూలి పోయాయి.

ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికా రులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సోమవారం నుంచి దాదా పుగా 155 సార్లు భూప్రకం పనలు చోటు చేసుకు న్నాయి.

సునామీ వస్తుందని హెచ్చరికలు జారీ చేసినప్పటికి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సునామీ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల కు తరలించారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు.

రేపటినుండి ఉత్తరాంధ్ర జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన లను మళ్లీ ప్రారంభించ నున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌తో మన స్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరా మర్శించనున్నారు. వారా నికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించను న్నారు.

జనవరి 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖ పట్నం జిల్లాలకు భువనేశ్వరి వెళ్లనున్నారు.

గతంలో పలు కుటుం బాలను ఆమె పరామర్శిం చిన విషయం తెలిసిందే.

YSRCP : సీఎం వైఎస్ జగన్‌పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం!

చిత్తూరు : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

'నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ' అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్ తమ మంచి చెడ్డా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు..

''ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారు? 2019 ఎన్నికల్లో ఐపెక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయా. తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాణిపాకంలోకి వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని? నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం..

గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా . ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైసీపీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా'' అని బాబు పేర్కొన్నారు..

Jagananna Arogya Suraksha: ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ..

60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్‌ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.

6 నెలల పాటు ఈ రెండో దశ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందురు ఏపీ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది..