YSRCP : సీఎం వైఎస్ జగన్‌పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం!

చిత్తూరు : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

'నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ' అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్ తమ మంచి చెడ్డా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు..

''ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారు? 2019 ఎన్నికల్లో ఐపెక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయా. తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాణిపాకంలోకి వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని? నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం..

గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా . ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైసీపీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా'' అని బాబు పేర్కొన్నారు..

Jagananna Arogya Suraksha: ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ..

60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్‌ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.

6 నెలల పాటు ఈ రెండో దశ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందురు ఏపీ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది..

కొత్త ఏడాది ప్రారంభం.. నిమిషానికి 1,244 బిర్యానీలు

ఒక్కరోజులో ఓయోలో 6.2 లక్షల బుకింగ్స్‌కొత్త ఏడాది సందర్భంగా ఆర్డర్ల వెల్లువ..

కొత్త ఏడాది ప్రారంభంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్‌ డెలివరీ అండ్‌ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు రికార్డుస్థాయిలో ఆర్డర్లను బట్వాడా చేశాయి..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది..

చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ సీఈఓ రోహిత్‌ కపూర్‌ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్‌ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. అదేవిధంగా డిసెంబరు 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలు ఆర్డర్‌ చేసినట్లు పేర్కొంది.

నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఓయో రూమ్‌ బుకింగ్స్‌ కూడా రికార్డుస్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 37శాతం (6.2 లక్షల) రూమ్‌ బుకింగ్స్‌ జరిగాయి. కేవలం డిసెంబరు 30, 31 తేదీల్లోనే 2.3 లక్షల ఓయో రూమ్స్‌ బుక్‌ అయ్యాయి. అయోధ్యలో గతేడాదితో పోలిస్తే 70 శాతం అధికంగా, గోవాలో 50%, నైనీతాల్‌లో 60%ఎక్కువగా రూమ్స్‌ బుక్‌ అయినట్లు ఓయో తెలిపింది..

ఫ్రీ బస్సులో సీటు కోసం మళ్ళీ శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు
ఫ్రీ బస్సులో సీటు కోసం మళ్ళీ శిఖలు పట్టుకొని కొట్టుకున్న మహాలక్ష్మిలు
రేషన్‌ డీలర్ల నియామకాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే

నల్లగొండ డివిజన్‌లోని 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి ఆర్డీఓ రవి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

చిట్యాల మండలంలోని వట్టిమర్తి, తాళ్లవెల్లెంల, వేంబాయి, కనగల్‌ మండలంలోని తుర్కపల్లి, లచ్చుగూడెం, కట్టంగూర్‌ మండలంలోని ఊదులూరు, నారగూడెం, పామనుగుండ్ల, యరసానిగూడెం, కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల, తాటికల్‌, నల్లగొండ మండలంలోని పానగల్‌,

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, శాలిగౌరారం మండలంలోని అంబారిపేట, ఊట్కూరు, ఉప్పలంచ, తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం, రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

అర్హత ఉన్నవారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత గ్రామంలో నివసిస్తూ పదో తరగతి అర్హత ఉండి 18 నుంచి 40ఏండ్ల వయసు వారు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ

పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకొంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది..

దీనికి సుమారు రూ.1,545.66 కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు వచ్చే ఆరున్నరేళ్లలో పూర్తి కానుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ పోస్టులు కూడా ఉండనున్నాయి..

కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్‌ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభ దశలో ఉన్నాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్‌ పని కూడా పూర్తి చేశారు..

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది..

కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది.

నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది.

గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది..

అటు.. జేఎన్‌.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి..

PSLV-C58 Launch: నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58!

ISRO to Launch PSLV-C58 Mission Today: న్యూఇయర్ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది..

ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవ్వగా.. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది..

పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌ రే పొలారి మీటర్‌ శాటిలైట్‌ (ఎక్స్‌పోశాట్‌) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్‌ మిషన్‌ ఇదే కావడం విశేషం. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది.

అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్‌ అయిన పీఎస్‌4.. అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు..

తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క నామినేషన్

హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ డిగ్రీలు డిగ్రీలు పట్టాలొస్తున్నాయి గానీ.. జాబులు మాత్రం వస్తలేవ్వు.. నోటిఫికేషన్ వెయ్యరు ఏం వెయ్యరు.. అందుకే మా అమ్మను అడిగి..నాలుగు బర్రెలు కొన్నా..అంటూ ఓ అమ్మాయి చెప్పే వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది గుర్తుందా.

బర్రెలక్కగా తెగ ఫేమస్ అయిపోయిన ఈ యువతి ఇప్పడు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగ యువతిగా ఇన్‌స్టా గ్రాంలో ఓ చిన్న సెటైరికల్ వీడియోతో ప్రభుత్వంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శిరీష.. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం ఉదయం నామినేషన్ వేసింది.

తెలంగాణ నిరుద్యోగినిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్టు బర్రెలక్క తెలిపింది. అయితే.. తాను అన్ని పార్టీల అభ్యర్థులలాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోవచ్చని.. డబ్బు పంచలేకపోవచ్చని తెలిపింది.

కానీ ప్రజలు ఏది మంచి ఏది చెడు ఆలోచించాలని... తన ప్రజల సపోర్ట్ ఉంటుందని శిరీష విజ్ఞప్తి చేసింది.అయితే.. ప్రభుత్వ ఉద్యోగాలను అప్లై చేసుకుని, కోచింగ్ కూడా తీసుకుని కష్టపడి చదివినా నోటిఫికేషన్లు రాకపోవటంతో.. ప్రభుత్వంపై ఉన్న అసహనాన్ని శిరీష ఓ చిన్న వీడియో ద్వారా చెప్పి దాన్ని ఇన్ స్టాలో సరదాగా పోస్ట్ చేసింది.

అయితే.. ఆ సమయంలో శిరీష వీడియోను నిరుద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా వైరల్ చేసి.. ప్రభుత్వాన్ని విమర్శించాయి. దీంతో.. ఆ వీడియోతో పాటు అందులో ఉన్న శిరీష కూడా రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది.