NLG: పేదరికంలో కూడా పెద్దమనసు చాటుకున్న చిలక రాజు కోటయ్య

క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాల పంపిణీ

నల్లగొండ జిల్లా, చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన చిలక రాజు కోటయ్య పేదరికంలో ఉండి కూడా పెద్ద మనసు చాటుకున్నాడు. మర్రిగూడెం మండలం లెంకలపల్లి పెట్రోల్ బంకు లో వర్కర్ గా పనిచేస్తున్నాడు.

దోనిపాముల గ్రామంలో సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు దాదాపు 30 మందికి మరియు కొంతమంది వితంతువులకు నూతన వస్త్రాలు అందించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివ, అనిల్, నికిత, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు: బెల్టు షాపులను మూసి వేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: 

మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపు ల మూసివేత పై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి 

ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీ లను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు దిశా నిర్దేశం

గ్రామ అభివృద్ధి కమిటీల పనితీరును పరిశీలించడానికి త్వరలోనే నియోజకవర్గ గ్రామస్తులతో కలిసి పది బస్సుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో స్టడీ టూర్ కు ప్లాన్ - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సోమవారం మండలం లోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ప్రజలకు సూచించారు. తాను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎంతో మంది మహిళలు గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాప్ ల వల్ల సంసారాలు ఆగమవుతున్నాయని, తమ దృష్టికి తీసుకొచ్చారని, ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులు మూసేస్తామని హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా బెల్ట్ షాపు ల మూసివేతకు కార్యాచరణ ప్రకటించారు. బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటానని,

తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానానికి వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపులు.. ఎక్కడబడితే అక్కడ ఉండడం వల్ల యువత చెడిపోతుందన్నారు.

చట్ట ప్రకారం బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీలులేదని, గ్రామాలలో నాయకులు అందరూ ఏకమై బెల్టు షాపు లు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని, ఈ అంశం రాజకీయాలతో సంబంధంలేదని ముఖ్య నాయకులకు సూచించారు. 

బెల్ట్ షాపు ల విషయంలో రాజి పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే తరాలకు ఈ విచ్చల విడి తాగుడు వల్ల మనం ఏం సందేశం ఇస్తున్నామని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూసి వేయడం అనేది గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని సూచించారు. బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో తనతో నడిచిన వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తానని, నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకోసం కాదు సమాజం కోసం, ప్రజల కోసం అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.

2014 ముందు గ్రామాలలో బెల్ట్ షాపులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవని టిఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు వచ్చి ఎంతోమంది యువకులు చనిపోయారని వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఆషామాషీగా తీసుకోవద్దు.. 'బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలి' అని పిలుపునిచ్చారు. ఒక ఉద్యమం లాగా ఇది రావాలి.. బెల్ట్ షాపులు మూసివేయాలని.. ప్రతి గ్రామంలో దండోరా వేయించాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రతి గ్రామంలో 10 మందితో ఒక కమిటీ వేయాలని ఈ 10 మందిలో నలుగురు మహిళలు ఉండేలా చూసుకోవాలని.. ఊరి పొలిమేర లోపల గంజాయి గానీ, తాగుడు గానీ లేకుండా చేయడం ఈ కమిటీ యొక్క విధి అని సూచించారు.

ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.

గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి గ్రామంలో ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటి ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ అభివృద్ధి కమిటీ ద్వారానే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని.. దానికి సంబంధించిన నిధుల సమకూర్చడం విషయాలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పనితీరుని పరిశీలించడానికి ఆర్మూరు నియోజకవర్గానికి  త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా 10 బస్సులలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు తాను కూడా వచ్చి పరిశీలిస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

TS: క్రీస్తు సంఘం సహవాసం చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

జమ్మికుంట: ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని క్రీస్తు సంఘం సహవాసం చర్చిలో, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాయకులు వొడితల ప్రణయ్.. క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రిస్మస్ కేకు ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా వొడితల ప్రణయ్ మాట్లాడుతూ.. శాంతియుత సమాజ స్థాపన కోసం, రక్తం చిందించిన ధీశాలి క్రీస్తు జన్మదినం సందర్భంగా, ఈ క్రిస్మస్ ప్రజల జీవితాలలో సరికొత్త కాంతులను నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొలగంటి మల్లయ్య, పాస్టర్ బిట్ల ప్రభుదాస్, సుధాకర్, శీలం వైకుంఠం, పలేపు రాజేశం, మేకల పప్పయ, టీ సమైయ్యా, శ్రావణ్, విద్యాసాగర్, సతీష్ పాల్గొన్నారు.

మర్రిగూడ: ఎబినేజరు ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో ఎబినేజర్ ప్రార్థన మందిరంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రం తో పాటు పల్లెల్లోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఏసు క్రీస్తును కొలుస్తూ భక్తులు భక్తి గీతాలు, కీర్తనలు ఆలకించారు. ఈ సందర్భంగా పాస్టర్లు యేసు క్రీస్తు జన్మదిన విశిష్టత వివరించారు. ఎబినేజరు ప్రార్థన మందిరంలో చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

TS: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవం.. ఈనెల 28న

హైదరాబాద్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవం.. ఈనెల 28న సాయంత్రం 4:00 గంటలకు జూబ్లీహిల్స్ లో గల యూనివర్సిటీ లోని భవనం వెంకట్రాం ఆడిటోరియం లో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హాజరై స్నాతకోత్సవ సభా నిర్దేశనం చేస్తారని తెలిపారు.

ఉపకులపతి ఆచార్య కే.సీతారామారావు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆచార్య ఎం.జగదీష్ కుమార్ చైర్మన్ యూనివర్సిటీ గ్రాండ్ కమీషన్, న్యూఢిల్లీ వారు స్నాతకోపన్యాసం చేస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి, పాలకమండలి సభ్యులు కోరారు.

TS: తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గా డాక్టర్ కే.టి.మహి

తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు

హైదరాబాద్: నిజాం క్లబ్ లో ఆదివారం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (TFA) ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎలక్షన్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పక్షాన జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 సంవత్సరాల ( 2023-2027 ) వ్యవధి కి గాను చైర్మన్ గా ఎన్నికైన డాక్టర్ కే.టి.మహి, జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన జి.పి.ఫల్గుణ లను ప్రత్యేకంగా అభినందించారు.

TS: చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి: భూమి చట్టాల నిపుణులు ఎం.సునీల్‌కుమార్‌

హైదరాబాద్: తెలంగాణా రెవెన్యూ అధికారుల సమావేశం లో భూమి సమస్యల పరిష్కార మార్గాలపై, ఆదివారం భూ చట్టాల నిపుణులు ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్ కుమార్) పాల్గొని మాట్లాడుతూ.. చిక్కులు లేని భూమి హ‌క్కులు ద‌క్కాలి అని అన్నారు.

భూమి అంటే తెలంగాణ‌.. తెలంగాణ అంటే భూమి అని ప్ర‌ధాన‌మైన భూ స‌మ‌స్య‌ను తీర్చ‌కుండా ఏది కూడా ప‌రిష్కారం కాద‌ని భూమి సునీల్ కుమార్ పేర్కొన్నారు.

ప్ర‌పంచ దేశాల‌లో భూ స‌మ‌స్య‌లు లేని దేశాలు మాత్ర‌మే అభివృద్ధి చెందుతున్న‌ట్టుగా తెలిపారు. భూ ప‌రిపాల‌న గ్రామ స్థాయిలో ఉండాల‌న్నారు. భూమి హ‌క్కుల‌కు గ్యారంటీ కూడా గ్రామ‌స్థాయి లోనే ఇవ్వాల‌న్నారు.

భూమి హ‌ద్దుల స్ప‌ష్టంగా, హ‌క్కుల క‌ల్పించే ప‌త్రాలు ప‌క్కాగా, హ‌క్కుల మార్పిడి వెంట‌నే జ‌రిగే వ్య‌వ‌స్థ ఉండాల‌న్నారు. చిక్కులు వ‌స్తే గ్రామ స్థాయిలోనే ప‌రిష్కారం కావాల‌న్నారు. 

భూమి హ‌క్కుల‌కు ప్ర‌భుత్వ‌మే గ్యారంటీ ఇవ్వాల‌న్నారు.

ద‌స్తావేజుల రిజిస్ట్రేష‌న్ కాదు.. హ‌క్కుల‌కు రిజ‌స్ట్రేష‌న్ కావాల‌న్నారు. ప‌క్క‌నే ఉన్న ఏపీలో ఈ దిశ‌గా చ‌ట్టం కూడా చేసుకున్నార‌ని భూమి సునీల్ కుమార్ గుర్తు చేశారు.

NLG: మ్యాన్ ఆఫ్ ద మిలియనియం పద్మశ్రీ కళ్యాణ సుందరం ను కలిసిన గ్రంథ పాలకుడు దుర్గాప్రసాద్

నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ దుర్గాప్రసాద్.. నేడు చెన్నైలో పద్మశ్రీ అవార్డు అందుకున్న పలని కళ్యాణ సుందరం (మ్యాన్ ఆఫ్ మిలియనియం) ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కళ్యాణ సుందరం 36 సంవత్సరాలు గ్రంథ పాలకులుగా గ్రంధాలయ సమాజ సేవ చేసి పదవి విరమణ పొందారు. వారు పదవీ విరమణ తరువాత వచ్చిన 18 లక్షల రూపాయలను అనాధాశ్రమాలకు, పేదల విద్య కోసం దానం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇతను చేసిన సేవకు గాను మ్యాన్ ఆఫ్ మిలీనియం అవార్డును కళ్యాణ సుందరం కు బహుకరించింది. అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ తను చేసిన సేవకు మన దేశానికి వచ్చి క్యాష్ 30 కోట్ల రూపాయలను బహూకరించారు. కళ్యాణ సుందరం గారి అమ్మ చెప్పినట్లుగా ఎప్పుడు సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాచార మరియు విద్యకు సేవలో పాటుపడాలని చెప్పిన నినాదంతో వారు సర్వీస్ లో ఉన్నప్పుడు మరియు రిటైర్ అయిన తర్వాత కూడా శాలరీని పేదలకు అనాధాశ్రమాలకు దానం చేశారు.

అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం కూడా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనాధాశ్రమాలయాలకు వారు దానం చేశారు. ఇతని గ్రంథాలయ సేవలను చూసి భారత ప్రభుత్వం జనవరి 2023 లో పద్మశ్రీ అవార్డును బహుకరించింది. అవార్డును ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కళ్యాణ సుందరం వయస్సు 85, యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా అవుట్ స్టాండింగ్ పర్సన్స్ ని 17 మందిని ఎంపిక చేయగా ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఏకైక సమాజ సేవ సమాచార సేవకుడు కల్యాణ సుందరం అని తెలిపారు.

కళ్యాణ సుందరం జీవిత చరిత్రను తెలుగులో రాస్తున్నానని కళ్యాణ సుందరంను వ్యక్తిగతంగా కలిసి.. బాల్యం, తన విద్య, గ్రంథాలయ సేవ, సమాజ సేవ లను తెలుసుకున్నానని, వారిని కలవడం ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందానని, వారి యొక్క జీవితం భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక సందేశం. ఒక సందేశాత్మకంగా సమాజంలో ఒకరికొకరికి సహాయంలో తోడ్పడటంలో విద్యాభివృద్ధిలో వారి సేవ ఎంతగానో ఉపయోగపడిందని డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్ తెలిపారు.

TS: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!

100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం, మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఓ ఆర్టీసీ కండక్టర్..

మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న టీఎస్34టీఏ5189 బస్సులో కండక్టర్ గండీడ్, జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తున్నట్లుగా పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

TS: జేఎన్‌1తో ఆందోళన అక్కర్లేదు: డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ లోని కొత్త వేరియంట్ జేఎన్‌.1 అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి. నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

2020లో ప్రపంచాన్నే స్తంభింపజేసి, 2021లో డెల్టా రూపంలో పెద్దసంఖ్యలో ప్రాణాలు హరించిన కొవిడ్‌.. 2022 తొలినాళ్లలో ఒమిక్రాన్‌గా విరుచుకుపడింది. దాదాపు 18 నెలలుగా మహమ్మారి జాడ కనిపించలేదు. మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉన్నట్టుండి ‘జేఎన్‌1’ రూపంలో కరోనా మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజల్లో కోవిడ్‌ కొత్త వేరియంట్ పై ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘జేఎన్‌.1’ స్వభావం, దాని వ్యాప్తి, తీవ్రత, ప్రమాదమా? తదితర అంశాలపై డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి పలు అంశాలు వెల్లడించారు.

జే ఎన్ 1 కొత్త వైరస్‌ కాదు, కానీ కొత్త వేరియంట్‌. కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక రూపాలు మార్చింది. అందులో ఒకటి ‘ఎక్స్‌బీబీ’. దాని ఉత్పరివర్తనమే ‘జేఎన్‌1’. జన్యు క్రమ విశ్లేషణ చేయగా.. స్పైక్‌ ప్రొటీన్‌లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్‌లోని లక్సంబర్గ్‌ అనే చిన్న దేశంలో మొదట బయటపడింది. ఆ తర్వాత యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ అక్కడక్కడా కనిపించింది. కానీ అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ అంటువ్యాధి అయి ఉంటే.. ఈపాటికి అంతటా వ్యాప్తి చెందేది. డెల్టా, ఒమిక్రాన్‌లు నెలరోజుల్లోనే అంటువ్యాధులు గా మారాయి.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా జేఎన్‌1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సింగపూర్‌లో 56వేల కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ కేసులు హాంగ్‌కాంగ్‌, చైనా వంటి దేశాల్లో కొంచం ఎక్కువగా ఉన్నాయి. దీని వ్యాప్తి, లక్షణాలు, పర్యవసనాలను వైద్యనిపుణులు సునిశితంగా గమనిస్తున్నారు. కేరళలో నమోదైన కేసుల నమూనాలను విశ్లేషిస్తే స్వల్ప సమస్యలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది.