TS: తెలంగాణ ఏసీబీ డీజీ గా సివి ఆనంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ గా ఐపీఎస్ అధికారి సీవి ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీ గా పని చేసిన ఆయన ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీ గా నియమించింది.
ఈ రోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు. రెండేళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ, ఎక్కడా మత సామరస్యం దెబ్బ తినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.











Dec 23 2023, 21:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.3k