TS: టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023లో.. పది రికార్డులు సొంతం చేసుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న

నల్గొండ జిల్లా, పిఏ పల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, దళిత రత్న బుర్రి వెంకన్న.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తో 10 వరల్డ్ రికార్డ్స్ అవార్డ్స్ ల పురస్కారాలను మయూరి ఆర్ట్స్ ద్వారా అందుకున్నారు.

హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ అధినేత రాధా మరియు దత్తు నేతృత్వంలో, టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023 కార్యక్రమంతో 

ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,

ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,

ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,

ఇంటర్నేషనల్ ప్లాటినం బుక్ ఆఫ్ రికార్డ్స్ తో 

మయూరి ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో చరిత్రను సృష్టిస్తూ.. అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా, ఈ పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ పురస్కార అవార్డులు 290 మందికి వివిధ రంగాలలో ప్రతిభ మరియు సేవలను అందిస్తున్న వ్యక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లైన్ సాయి వెంకట్, సీనియర్ తెలుగు సినిమాల ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ డా. బింగి నరేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియన్ చీప్ కోఆర్డినేటర్, డా.సుభాషిని హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వం వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ సాయి ప్రియ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ చీఫ్ కోఆర్డినేటర్ ల చేతుల మీదుగా.. దళిత రత్న బుర్రి వెంకన్న ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర శాఖ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు, మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి జయంతి కార్యక్రమాల ద్వారా చరిత్ర పోరాటాలను సమాజానికి పరిచయం చేస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు న్యాయబద్ధంగా పోరాట కార్యక్రమాలు, అంబేద్కర్ ఆశ సాధన కోసం సామాజిక ఉద్యమ కార్యక్రమాలు, నిర్వహిస్తున్నందుకు గాను, గతంలో దళిత రత్న అవార్డు మరియు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డు లను అందుకొని ముందుకెళుతున్న బుర్రి వెంకన్న సేవా కార్యక్రమాల్ని పరిశీలించి.. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు తో పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ అవార్డు పురస్కారాన్ని వెంకన్న కు అందించి ఘనంగా సన్మానించారు. ఈ అవార్డ్స్ ను అందుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ అవార్డ్స్ అందించిన మయూరి ఆర్ట్స్ సంస్థ వారికి వివిధ వరల్డ్ రికార్డ్స్ అధినేత లకు అభివందనాలతో కృతజ్ఞతలు తెలిపారు.

TS: నేడు సింగరేణి ఎన్నికలపై హైకోర్టు లో విచారణ

హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టు లో విచారణ. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగాల్సివుంది, అయితే 27న జరిగే సింగరేణి ఎన్నికలను వాయిదా వెయ్యాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.

NLG: త్వరలో నల్గొండలో చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను ప్రారంభిస్తాం: గిరిబాబు

గ్రామీణ ప్రాంతాలలోని క్రికెట్ క్రీడాకారులకు చేయూతనిచ్చి వారిని వెలుగులోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో.. నల్గొండలో చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను ప్రారంభిస్తున్నామని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబుతెలిపారు. నల్గొండ ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గ్రాస్ రూట్ లో క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తామని వారు తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ను స్థాపించి ఎంతోమంది కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావడమే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీ క్రీడాకారులను తయారు చేశామని ఆయన తెలిపారు.

TS: ఐపీఎస్ లను బదిలీ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చేపట్టారు. హైదరాబాద్ క్రైమ్ అదనపు సీపీ గా ఏవి.రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గా విశ్వప్రసాద్, ఎస్బి జాయింట్ సిపి గా జోనియల్ డేవిస్, డిసిపి డిడి గా శ్వేతా ను నియమించారు. అదేవిధంగా వెస్ట్ నార్త్ జోన్ డీసీపీ లుగా విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని లను నియమించారు. ఇక చందన దీప్తి, గుజరాల్ భూపాల్ లను బిజెపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

TS: మేడిగడ్డ పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనమండలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ ఎందుకు కృంగిపోయిందో తెలుసుకుంటాం. సమావేశాలు ముగిశాక సభ్యులందరికీ తీసుకెళ్తాం. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలు బయటపడతాయని అన్నారు.

TS: పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు

హైదరాబాద్ : విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాలు ఉండాలన్నారు. ఉత్తర, దక్షణ తెలంగాణాలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పది రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం'

తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం’ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం ప్రకటించింది. ఈ సమయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం టికెట్లు విడుదుల చేసింది.

గత కొన్నేళ్ల మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రోటోకాల్ అమలులో ఉంటుంది. పరిమిత స్థాయిలో మాత్రమే దర్శనం అందించబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.

TS: కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి

కరీంనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సమీపంలో శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

TS: కేటీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి దీటుగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం వద్దనే తెలంగాణ వచ్చిందన్నారు. సంపదతో కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. టిఆర్ఎస్ నేతలు అప్పుల పాలు చేశారని ఆరోపించారు.

TS: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు, శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు.