TS: ఐపీఎస్ లను బదిలీ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలనం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చేపట్టారు. హైదరాబాద్ క్రైమ్ అదనపు సీపీ గా ఏవి.రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ గా విశ్వప్రసాద్, ఎస్బి జాయింట్ సిపి గా జోనియల్ డేవిస్, డిసిపి డిడి గా శ్వేతా ను నియమించారు. అదేవిధంగా వెస్ట్ నార్త్ జోన్ డీసీపీ లుగా విజయ్ కుమార్, రోహిణి ప్రియదర్శిని లను నియమించారు. ఇక చందన దీప్తి, గుజరాల్ భూపాల్ లను బిజెపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

TS: మేడిగడ్డ పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనమండలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ ఎందుకు కృంగిపోయిందో తెలుసుకుంటాం. సమావేశాలు ముగిశాక సభ్యులందరికీ తీసుకెళ్తాం. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలు బయటపడతాయని అన్నారు.

TS: పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు

హైదరాబాద్ : విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాలు ఉండాలన్నారు. ఉత్తర, దక్షణ తెలంగాణాలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పది రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం'

తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం’ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం ప్రకటించింది. ఈ సమయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం టికెట్లు విడుదుల చేసింది.

గత కొన్నేళ్ల మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రోటోకాల్ అమలులో ఉంటుంది. పరిమిత స్థాయిలో మాత్రమే దర్శనం అందించబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది.

TS: కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి

కరీంనగర్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని శంకరపట్నం మండలంలోని తాడికల్లు సమీపంలో శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

TS: కేటీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి దీటుగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రం వద్దనే తెలంగాణ వచ్చిందన్నారు. సంపదతో కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే.. టిఆర్ఎస్ నేతలు అప్పుల పాలు చేశారని ఆరోపించారు.

TS: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు, శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు.

TS: మాజీ డి.ఎస్.పి నళిని ఉద్యోగం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగం లోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

మాజీ డిఎస్పి నళిని

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింపజేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

TS: వంటగ్యాస్ e-KYC పై కీలక ప్రకటన

హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే e- kyc కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న యాప్ ద్వారా e- కేవైసి పూర్తి చేయొచ్చని తెలిపింది. గ్యాస్ e-kyc కి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది.

ఇకపై భారత్ పర్యాటకులు వీసా లేకుండానే ఇరాన్ లో పర్యటించవచ్చు!

భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది.